అన్వేషించండి

ఎంత జీతం ఉంటే Maruti Celerio కొనవచ్చు? ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి

ఎంత జీతం లేక ఆదాయం ఉన్నవారు మారుతి సెలెరియో కొనవచ్చు? బేస్ మోడల్ కొనేవారు డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వివిధ కాలపరిమితులకు ఈఎంఐలు మారుతాయి; సురక్షితంగా రూ. 50 వేలు జీతం.

గత కొన్నేళ్లుగా భారత్‌లో కార్లకు డిమాండ్ పెరుగుతోంది. సొంతంగా ఒక కారు ఉండాలని, అందులోనే ఫ్యామిలీతో జర్నీ చేయాలని భావిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో కార్ల ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల కారు కొనడం అంత సులభం కావడం లేదు. అయితే ఇప్పటికీ అత్యంత తక్కువ ధరకే లభించే కార్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. అందులో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) కారు ఒకటి.

అద్భుతమైన లుక్, లీటరుకు 25- 26 కిలోమీటర్ల మైలేజ్, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు కారణంగా ఈ హ్యాచ్‌బ్యాక్  మధ్యతరగతి కుటుంబాలలో ఎంతో ప్రజాదరణ పొందింది. మీరు కూడా మారుతి సెలెరియో కొనాలని ఆలోచిస్తుంటే, ప్రతి నెలా మీకు ఎంత జీతం లేక ఆదాయం రావాలనేది తెలుసుకోండి. ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్, బ్యాంక్ వడ్డీ రేట్ల ఆధారంగా  EMI లెక్కలు అర్థం చేసుకుందాం.

సెలెరియో ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో మారుతి సెలెరియో బేసిక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4,69,900గా ఉంది. ఆన్ రోడ్ ధర అయితే రూ. 5.75 లక్షల వరకు ఉంటుంది. మోడల్, వేరియంట్ ఆధారంగా ధరలు ఇంకా పెరుగుతాయి. టాప్ సీఎన్జీ (CNG) లేదా ఆటోమేటిక్ మోడల్ సుమారు రూ. 7.55 లక్షలు అలా ఉంటుంది. 

కారు కొనేటప్పుడు 20/4/10 రూల్ పాటించాలి. మొత్తం ఆన్-రోడ్ ధరలో కనీసం 20 శాతం అయినా డౌన్ పేమెంట్ చేయాలి. లోన్ వ్యవధి గరిష్టంగా 4 నుంచి 5 సంవత్సరాలు ఉండాలి. నెలవారీ EMI మీ జీతంలో 10 నుంచి 15 శాతానికి మించరాదు.

జీతం ఎంత ఉండాలి?

మారుతి సెలెరియో బేస్ మోడల్ LXi కొనాలనుకుంటే దాని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 5.75 లక్షల వరకు ఉంటుంది. మీరు 20 శాతం అంటే రూ. 1.02 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే, రూ. 4.73 లక్షల బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంక్ మీకు 9.5 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితికి లోన్ ఇస్తుందని భావిస్తే, మీ ప్రతి నెల EMI సుమారు రూ. 8,560 అవుతుంది. 10 నుండి 15 శాతం నియమం ప్రకారం, మీ నెలవారీ ఇన్-హ్యాండ్ జీతం రూ. 30,000 నుండి రూ. 35,000 మధ్య ఉంటే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా బేస్ మోడల్‌ను హాయిగా కొనుగోలు చేయవచ్చు.

4,73,000 లోన్ తీసుకుంటే 9.5% వార్షిక వడ్డీ రేటుతో 4, 5, 6 సంవత్సరాలకు ప్రతినెలా చెల్లించాల్సిన EMI వివరాలు..

4 సంవత్సరాల కాలపరిమితి (48 నెలలు).. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.11,889

బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ ₹97,688 కాగా, మొత్తం తిరిగి చెల్లించే మొత్తం: ₹5,70,688 అవుతుంది.

5 సంవత్సరాల కాలపరిమితి (60 నెలలు) ప్రతినెలా EMI 9,933 చెల్లించాలి. 

బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ.1,22,965, కాగా మొత్తం రూ.5,95,965 తిరిగి చెల్లించనున్నారు. 

6 సంవత్సరాల కాలపరిమితి (72 నెలలు) అయితే ప్రతినెలా చెల్లించాల్సిన EMI రూ. 8,638.

బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ రూ.1,48,930 కాగా, మొత్తం తిరిగి చెల్లించే మొత్తం:రూ.6.21 లక్షలు అవుతుంది.

ఈ EMIని సులభంగా చెల్లించడానికి మీ నెలవారీ జీతం కనీసం రూ. 50,000 అయినా ఉండాలి. సొంతిల్లు ఉంది, ఇతరత్రా తక్కువ ఖర్చులు ఉండేవారు 40 వేల శాలరీ వచ్చినా కారు కొనవచ్చు. అందుకే అత్యవసర నిధి (Emergency Fund), పొదుపు పక్కనపెట్టాక మీ జీతానికి తగిన సరైన వేరియంట్‌ను ఎంచుకోండి.

Frequently Asked Questions

కారు కొనుగోలు చేసేటప్పుడు 20/4/10 నియమం అంటే ఏమిటి?

ఈ నియమం ప్రకారం, కారు మొత్తం ధరలో కనీసం 20% డౌన్ పేమెంట్ చేయాలి. లోన్ వ్యవధి 4-5 సంవత్సరాలు మించకూడదు, EMI మీ జీతంలో 10-15% ఉండాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget