అన్వేషించండి

517 KM రేంజ్, అద్భుతమైన ఫీచర్లు.. MG Hector Tomahawk EV కోసం EMI ఎంత చెల్లించాలి

517 కిమీ క్లెయిమ్డ్ రేంజ్ తో వచ్చిన MG Hector టోమాహాక్ EV ఫీచర్లు, ధరతో పాటు ఫైనాన్స్ ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రూ.19.49 లక్షల నుంచి BaaS ద్వారా తక్కువ ధరకే లభ్యం.

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. కాలుష్య రహిత ప్రయాణం, తక్కువ నిర్వహణ ఖర్చు వల్ల కస్టమర్లు ఈవీలను కొంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎమ్‌జీ మోటార్స్ (MG Motors) సంస్థ సరికొత్త హెక్టార్ టోమాహాక్ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ADAPT ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన ఈ భారీ ఎస్‌యూవీ Hector Tomahawk EV ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఆల్-ఎలక్ట్రిక్ అనే 2 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లోకి రానున్న మహీంద్రా XEV 9s, టాటా ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 

ఈ ఎలక్ట్రిక్ కార్ ఇంటీరియర్ అత్యంత విలాసవంతమైన ట్యాన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో చేశారు. డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన 15.6 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది గెస్టర్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, 10 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. 5 సీటర్, 7 సీటర్ లలో లభించే ఈ కారులో వెనుక వరుస ప్రయాణీకులకు విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్,  ఫ్లాట్ ఫ్లోర్ సదుపాయం కల్పించారు.

హైదరాబాద్‌లో MG హెక్టర్ టోమాహాక్ EV బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 20.83 లక్షలుగా ఉంది. అయితే మీరు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈవీ కారు తీసుకుంటే మీరు మిగతా 18.83 లక్షలు లోన్, ఫైనాన్స్ చేసుకోవాలి. 4 ఏళ్లకుగానూ 9.5 శాతం వడ్డీతో అయితే 48 నెలలకుగానూ EMi రూ. 47 వేలు కట్టాలి. అదే 5 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే 60 నెలలపాటు ఈఎంఐ రూ. 39,550 చెల్లించాలి. 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే 72 నెలలపాటు ఈఎంఐ రూ. 34,416 మేర చెల్లించాలి. అదే 7 ఏళ్లకు అయితే 84 నెలలపాటు రూ. 30,780 కట్టాలి.

Also Read: క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌

517 కిలోమీటర్ల రేంజ్..

సామర్థ్యం విషయానికి వస్తే, ఈ కారులో 69.2 kWh కెపాసిటీ గల  బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 204 bhp శక్తిని, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల  మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సాధారణ రోడ్లపై సులభంగా 400 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. కారు విండోలకు ఉపయోగించిన ఎకౌస్టిక్ గ్లాస్ క్యాబిన్ లోపలికి బయటి శబ్దం రాకుండా నిరోధిస్తుంది. సిటీ డ్రైవింగ్ కోసం ఈకో మోడ్, ఈజీ స్టీరింగ్ కంట్రోల్ ప్రయాణాన్ని తేలిక చేస్తాయి. 

భద్రత, ఛార్జింగ్ 
సాంకేతికత పరంగా ఇందులో భారత రోడ్లకు అనుగుణంగా పనిచేసే 'లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించారు. V2L (వెహికల్ టూ లోడ్), V2V (వెహికల్ టూ వెహికల్) బైడైరెక్షనల్ ఛార్జింగ్ విధానాల ద్వారా ఈ కారు బ్యాటరీ నుండి ఇతర పరికరాలకు, వేరొక ఈవి వాహనానికి ఛార్జింగ్ చేయొచ్చు. 90kW DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే 30% నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో MG హెక్టర్ టోమాహాక్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.49 లక్షల నుంచి రూ. 23.49 లక్షల వరకు ఉంటుంది.  దీంతోపాటు కంపెనీ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానంలోనూ దీనిని విక్రయిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద కారు ప్రారంభ ధర రూ. 13.99 లక్షలకే లభిస్తుంది. బ్యాటరీ వినియోగానికి వాడిన కిలోమీటర్లను బట్టి ప్రత్యేకంగా అద్దె చెల్లించాలి. విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన రోడ్ ప్రెజెన్స్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఎస్‌యూవీ బెస్ట్ ఛాయిస్ కానుంది. 

Also Read: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

Frequently Asked Questions

MG హెక్టర్ టోమాహాక్ EV ధర ఎంత, BaaS ప్రోగ్రామ్ అంటే ఏమిటి?

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.49 లక్షల నుంచి రూ. 23.49 లక్షల వరకు ఉంటుంది. BaaS ప్రోగ్రామ్ కింద కారు రూ. 13.99 లక్షలకే లభిస్తుంది, బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్లను బట్టి అద్దె చెల్లించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget