పెట్రోల్ కార్లతో పోలిస్తే రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉండే మిడ్-సైజ్ SUV ని కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది మంచి ఫ్యూయల్ ఎకానమీని అందిస్తుంది.
రూ.2 లక్షలు చెల్లించి Maruti Victoris CNG తీసుకుంటే చెల్లించాల్సిన EMI లెక్కలు ఇవే
మారుతి సుజుకీ విక్టోరిస్ CNG కారును హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్ ఛార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుంది.ఒక్కో రాష్ట్రం, నగరాల్లో ధరలో వ్యత్యాసం ఉంటుంది.

- మారుతి విక్టోరిస్ CNG అధిక మైలేజ్ కోసం మధ్యస్థ SUV.
- హైదరాబాద్ ఆన్-రోడ్ ధర ₹14.21 లక్షలు, లోన్ అందుబాటు.
- ₹2 లక్షల డౌన్ పేమెంట్‌తో ₹12.21 లక్షల లోన్.
- దీర్ఘకాల లోన్‌లు ఎక్కువ వడ్డీకి దారితీస్తాయని గమనించాలి.
Maruti Victoris Finance Plan | మీరు CNG ఆప్షన్ ఉన్న మిడ్ సైజ్ SUV ని కొనాలని భావిస్తున్నారా.. అయితే దాని రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ కార్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మీకు Maruti Victoris CNG బెస్ట్ ఆప్షన్‌గా మారవచ్చు. Maruti Suzuki సంస్థ Victoris ను మిడ్-సైజ్ SUV విభాగంలో తీసుకొచ్చి విక్రయిస్తోంది. దీని CNG వెర్షన్‌ను SUV తో పాటు మంచి ఫ్యూయల్ ఎకానమీ (మైలేజ్) కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి తీసుకువచ్చారు.
మీరు ఈ SUV ని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించలేరనుకుంటే, కార్ లోన్ తీసుకుని దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాంటప్పుడు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌పై కారు కొనుగోలు చేసి, టర్మ్ పూర్తయ్యే వరకు ప్రతి నెలా EMI చెల్లించాల్సి ఉంటుంది.
కారు ఆన్ రోడ్ ధర ఎంత?
Maruti Victoris CNG LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.54 లక్షలుగా ఉంది. అయితే కస్టమర్ కారును కొనుగోలు చేసేటప్పుడు RTO, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. దానిని కార్ ఆన్ రోడ్ ధర అంటారు.
ఈ కారును హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా చెల్లించాలి. అంతేకాకుండా TCS ఛార్జీ కూడా చేర్చుతారు. ఈ ఖర్చులన్నింటినీ కలిపిన తర్వాత Maruti Victoris CNG హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు 14.21 లక్షలుగా ఉంది.
2 లక్షల డౌన్ పేమెంట్‌పై లోన్
కారు ఫైనాన్స్ ప్లాన్ విషయానికి వస్తే, మారుతి Victoris CNG కొనుగోలు చేయడానికి మీరు 2 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన మొత్తానికి బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకోవాలి. అప్పుడు మీరు దాదాపు 12.21 లక్షల మొత్తాన్ని ఫైనాన్స్ చేయించుకోవాలి.
మీరు బ్యాంక్ నుండి ₹12.21 లక్షల కార్ లోన్ తీసుకుని, ఆ లోన్‌పై సంవత్సరానికి 9 శాతం వడ్డీతో 7 సంవత్సరాల లోన్ (84 నెలలు) వ్యవధి పెట్టుకుంటే ప్రతి నెలా సుమారు ₹19,649 EMI చెల్లించాలి. కేవలం వడ్డీ రూపంలోనే రూ.4 లక్షలకు పైగా చెల్లిస్తారు.
ఒకవేళ మీరు 6 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే కనుక 72 నెలల పాటు ప్రతినెలా EMI రూ. 22,014 చెల్లించాలి. మొత్తంగా వడ్డీ రూ.3.6 లక్షల వరకు అవుతుంది. 5 ఏళ్లకు అదే వడ్డీతో లోన్ తీసుకుంటే మీరు 60 నెలలపాటు EMI రూ. 25,351 చెల్లించాలి. మొత్తంగా వడ్డీ రూ.3 లక్షల వరకు అవుతుందని గమనించాలి.
కేవలం EMI మాత్రమే చూసి కారు కొనుగోలు చేయాలనుకోకూడదు. తక్కువ EMI కోసం లోన్ కాలపరిమితిని ఎక్కువగా పెట్టుకుంటే ప్రతి నెలా చెల్లింపు తగ్గుతున్నా, చెల్లించే వడ్డీ పెరుగుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయగలిగితే, లోన్ మొత్తం, దానిపై పడే వడ్డీ సైతం తగ్గుతాయి. మీ జీతం ₹50-60 వేల మధ్య ఉంటే మీరు ప్లాన్ చేసుకుంటే సులభంగా మారుతి విక్టోరిస్ సీఎన్‌జీ కొనుగోలు చేయవచ్చు.
Victoris ను Maruti Suzuki 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న SUV గా మార్కెట్లోకి తెచ్చారు. భారత ఆటో మార్కెట్‌లో ఇది Maruti Grand Vitara తో పాటు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), Kia Seltos, Mahindra XUV700, Scorpio-N, Honda Elevate వంటి కార్లతో పోటీపడుతుంది.
Frequently Asked Questions
Maruti Victoris CNG ఎవరికి సరైన ఎంపిక?
హైదరాబాద్‌లో Maruti Victoris CNG ఆన్-రోడ్ ధర ఎంత?
Maruti Victoris CNG LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.54 లక్షలు. RTO, ఇన్సూరెన్స్ ఛార్జీలతో కలిపి హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర సుమారు 14.21 లక్షలు అవుతుంది.
₹2 లక్షల డౌన్ పేమెంట్‌తో Victoris CNG లోన్‌పై EMI ఎంత?
₹2 లక్షల డౌన్ పేమెంట్ చేసి, ₹12.21 లక్షల లోన్ తీసుకుని, 7 సంవత్సరాలకు (9% వడ్డీతో) ప్రతి నెలా సుమారు ₹19,649 EMI చెల్లించాలి.
తక్కువ EMI కోసం లోన్ కాలపరిమితిని పెంచడం మంచిదా?
తక్కువ EMI కోసం కాలపరిమితిని పెంచుకుంటే నెలకు చెల్లింపు తగ్గుతున్నా, మొత్తంగా చెల్లించే వడ్డీ పెరుగుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే వడ్డీ కూడా తగ్గుతుంది.
ట్రెండింగ్ వార్తలు























