సరైన ప్లానింగ్, డౌన్ పేమెంట్, బ్యాంక్ లోన్ ఎంచుకుంటే తక్కువ జీతంలోనూ కొత్త కారు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లను EMI ద్వారా సులువుగా పొందవచ్చు.
Low Budget Cars: తక్కువ జీతం ఉన్నవారికి బెస్ట్ కార్లు ఇవే.. వీటిపై EMI చాలా తక్కువ
తక్కువ జీతం, ఆదాయం ఉన్న వారు సైతం కొంచెం ప్లాన్ చేసుకుంటే తమ సొంత కారు కల నెరవేరవచ్చు. మారుతి ఆల్టో, టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్ వంటి బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

- తక్కువ జీతంతో సొంత కారు కొనడం ఇప్పుడు సాధ్యం.
- తక్కువ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లు తక్కువ EMIకి అందుబాటులో.
- మారుతి ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, రెనో క్విడ్ ఉత్తమ ఎంపికలు.
- టాటా టియాగో భద్రత, నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే వారికి అనువైనది.
Low salary budget cars in India less emi options check here
ఈరోజుల్లో సొంత కారు ఉండటం చాలా అవసరంగా మారింది. మీ అనేక పనులకు హెల్ప్ అవుతుంది. కానీ కొత్త కారు కొనుగోలు చేయడం అందరికీ అంత ఈజీ కాదు. కారు ధరతో పాటు మెయింటనెన్స్ ఖర్చులు చూసి కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. అయితే, మీ ఆదాయం, శాలరీ తక్కువగా ఉన్నప్పటికీ కొత్త కారును ఎలా కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
మీరు కాస్త అవగాహన, సరైన ప్లానింగ్‌తో వ్యవహరిస్తే తక్కువ జీతంలో కూడా ఒక కొత్త, నమ్మకమైన కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో పలు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధరలు చాలా తక్కువే. మీరు సరైన డౌన్ పేమెంట్, బ్యాంక్ లోన్‌ను ఎంచుకుంటే ప్రతి నెలా EMI చెల్లించుకుంటే మీ జేబుపై ఒకేసారి భారం పడదు. తక్కువ ఈఎమ్‌ఐ పడే, తక్కువ బడ్జెట్ ఉన్న కుటుంబాలకు ఈ కార్లు సరిగ్గా సరిపోతాయి.
మారుతి సుజుకి ఆల్టో K10
తక్కువ బడ్జెట్‌లో తొలిసారి కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మారుతి సుజుకికి చెందిన ఆల్టో K10 సెట్ అవుతుంది. దాదాపు రూ. 3.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చే ఈ కారు చాలా చౌక. ఆన్ రోడ్ ధర అయితే ఎక్కువగానే ఉంటుంది. మీరు దాదాపు రూ. 80,000 డౌన్ పేమెంట్ చేస్తే, దీని నెలవారీ EMI రూ. 6,500 నుండి రూ. 7,000 ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇందులో లభించే 1.0-లీటర్ K సిరీస్ ఇంజన్ సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ సులభంగా ఉంటుంది. దీని మైలేజ్ లీటరుకు 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ అని కంపెనీ చెబుతోంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మీకు తక్కువ బడ్జెట్‌లో కాస్త ఎత్తుగా కూర్చునే అనుభూతి, మిని- SUV వంటి లుక్ కోరుకుంటే మారుతి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర దాదాపు రూ. 4.26 లక్షలు. దీని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీని ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, కేబిన్‌లో లభించే మంచి స్పేస్. దీనివల్ల గతుకుల రోడ్లపై కూడా కారును నడపడానికి అంతగా ఇబ్బంది ఉండదు. తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్, మారుతికి ఉన్న పెద్ద సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా తక్కువ జీతం ఉన్నవారికి బెస్ట్ అని చెప్పవచ్చు.
రెనో క్విడ్
మీరు స్టైలిష్, మోడ్రన్ లుక్‌ను ఇష్టపడే యువతకు రెనో క్విడ్ అత్యుత్తమ కారు. దాదాపు రూ. 4.70 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరలో వచ్చే ఈ కారులో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టచ్‌స్క్రీన్ ఫీచర్లు ఉన్నాయి.
రెనో క్విడ్ కోసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, దీని నెలవారీ EMI దాదాపు రూ. 7,500 నుండి రూ. 8,000 మధ్య ఉంటుంది. తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ, దీని మస్కులర్, స్పోర్టీ డిజైన్ చూడటానికి చవకైన కారులా కనిపించదు.
టాటా టియాగో
మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉండి, మీ ఫస్ట్ ప్రియారిటీ స్ట్రాంగ్ కారు, సేఫ్టీ అయితే, ఈ సెగ్మెంట్‌లో టాటా టియాగో బెస్ట్ కారు. దాదాపు రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారుకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. డౌన్ పేమెంట్‌ను బట్టి నెలవారీ ఈఎమ్‌ఐ దాదాపు రూ. 8,500 నుండి రూ. 9,500 మధ్య ప్లాన్ చేసుకోవాలి.
టాటా టియాగో కేబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు కాస్త ఎక్కువ EMI చెల్లించడానికి వీలుంటే టాటా టియాగో మీ కుటుంబానికి సురక్షితమైన, సుదీర్ఘకాలం మన్నికైన కారు మీకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
Frequently Asked Questions
తక్కువ జీతంతో కొత్త కారు కొనడం ఎలా సాధ్యం?
మారుతి సుజుకి ఆల్టో K10 ప్రారంభ ధర ఎంత?
మారుతి సుజుకి ఆల్టో K10 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షలు. రూ. 80,000 డౌన్ పేమెంట్‌తో, నెలవారీ EMI సుమారు రూ. 6,500 నుండి రూ. 7,000 ఉంటుంది.
మారుతి ఎస్-ప్రెస్సో ప్రత్యేకతలు ఏమిటి?
దీనికి ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మారుతి విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ దీనిని తక్కువ జీతం ఉన్నవారికి అనుకూలంగా చేస్తాయి.
టాటా టియాగో భద్రతకు సంబంధించి ఎలాంటి రేటింగ్ పొందింది?
టాటా టియాగోకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి, కాస్త ఎక్కువ బడ్జెట్ ఉన్నవారికి ఇది బెస్ట్ ఎంపిక.
ట్రెండింగ్ వార్తలు























