అన్వేషించండి

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి

టాటా మోటార్స్ భారత్‌లో టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ లాంచ్ చేసింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరలో లభించే కారు హై-టెక్ ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ ₹9.99 లక్షలకు మార్కెట్లోకి వచ్చింది.
  • పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో క్రెటాకు ప్రత్యర్థిగా నిలిచింది.
  • మెరుగైన క్యాబిన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఫీచర్లతో ఆకర్షిస్తోంది.
  • ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అధిక భద్రత కల్పిస్తుంది.

భారత్‌లో టాటా మోటార్స్ కార్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. టాటా కార్లు బెస్ట్ లుక్, దృఢత్వానికి పేరుగాంచాయి. టాటా మోటార్స్ తన కూపే-ఎస్‌యూవీ టాటా కర్వ్ ప్రజాదరణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసింది. టాటా మోటార్స్ కర్వ్ కొత్త అవతార్ 'టాటా కర్వ్ సిరీస్ ఎక్స్' (Tata Curvv series x)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ కార్ల ప్రారంభ ధరను కేవలం ₹9.99 లక్షలుగా నిర్ణయించారు. అంటే ఇప్పుడు కేవలం రూ.10 లక్షల ప్రారంభ బడ్జెట్‌లోనే కస్టమర్లకు ఈ ప్రీమియం లుక్ ఉన్న కూపే- ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త కారును పెట్రోల్, డీజిల్ ర2 ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేసింది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు నేరుగా పోటీ ఇస్తుంది.

రూ. 9.99 లక్షల నుంచి ధరలు ప్రారంభం

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌ను కంపెనీ 6 ప్రధాన ట్రిమ్‌లుగా విభజించింది. వీటిలో స్మార్ట్ ఎక్స్, ప్యూర్ ఎక్స్, ప్యూర్ ఎక్స్+, క్రియేటివ్ ఎక్స్+, ఎకామ్ప్లిష్డ్ ఎక్స్, ఎకామ్ప్లిష్డ్ ఎక్స్+ అని ఉన్నాయి. దీని ప్రారంభ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ అయిన ఎకామ్ప్లిష్డ్ ఎక్స్+ డార్క్ ఎడిషన్ ధర రూ.18.99 లక్షలుగా ఉంది. స్టైల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఎంపిక చేసిన ట్రిమ్‌లలో ఆల్-బ్లాక్ థీమ్‌తో కూడిన డార్క్ ఎడిషన్‌ తెచ్చింది. ఇది కారుకు అత్యంత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌ ఇస్తుంది.

ఈఎంఐ లెక్కల పూర్తి వివరాలు 

బేస్ మోడల్ హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ. 11,89,545గా ఉంది.  లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే.. మిగతా 10.89 లక్షలు కార్ లోన్ తీసుకోవాలి. 4 ఏళ్ల కాలానికిగానూ 9.8 శాతం వడ్డీతో ప్రతినెలా (48 నెలలు) రూ.27,529 చెల్లించాలి. 5 ఏళ్లపాటు లోన్ తీసుకుంటే 60 నెలలపాటు ప్రతినెల రూ.23,043 చెల్లించాలి. ఈఎంఐం బారం తగ్గించుకోవాలని 6 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే 9.8 శాతం వడ్డీతో ప్రతినెలా EMI రూ.20,075 చెల్లించాలి. అయితే మీరు చెల్లించే మొత్తం రూ. 14.45 లక్షల వరకు అవుతుందని గ్రహించాలి.  

Also Read: 7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్

కేబిన్‌లో పలు మార్పులు

సిరీస్ ఎక్స్ ఇంటీరియర్, సీటింగ్ సౌకర్యంపై కంపెనీ బాగా వర్క్ చేసింది. దీని కేబిన్‌లో కొత్త కలర్ థీమ్స్, మరింత ప్రీమియం టచ్ ఉన్న మెటీరియల్‌ వాడారు. దీని ఫ్రంట్ సీట్ల బ్యాక్ పార్ట్‌ను కాస్త సన్నగా చేసి, రియర్ బెంచ్ పొజిషనింగ్‌ను మళ్లీ రీ-డిజైన్ చేసింది. కేబిన్‌లో జరిగిన ఈ మార్పుతో వెనుక కూర్చునే ప్యాసింజర్లకు అంతకుముందు కంటే చాలా మెరుగైన లెగ్‌రూమ్, నీ-రూమ్ లభిస్తాయి. వీటితో పాటు కేబిన్‌లో ఓయిస్టర్ వైట్ లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, వెంటిలేటెడ్ సీట్లు ఫీచర్లు ఉన్నాయి. లాంగ్ జర్నీకి ఈ కారు సెట్ అవుతుంది.

ADAS వంటి లోడెడ్ ఫీచర్లు 

 టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ పూర్తిగా లోడెడ్ గా ఉంది. దీని బేస్, మిడ్ వేరియంట్లలోనే 10.25 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు ఇచ్చారు. టాప్ వేరియంట్లలో పెద్దదైన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ 3D కెమెరా, జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ మూడ్ లైటింగ్, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీని అందించారు. రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ESP ని స్టాండర్డ్‌గా చేర్చారు.

Also Read: 2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?

3 పవర్‌ఫుల్ ఇంజిన్లు

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌లో కస్టమర్లకు ఇంజిన్ ఎంచుకోవడానికి 3 ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో మొదటిది 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, రెండవది 1.2 లీటర్ హైపీరియన్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మూడోది 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్.

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఇచ్చారు. టాటా మోటార్స్ డీజిల్ ఇంజిన్‌తో కూడా DCA ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేసింది. ఈ సెగ్మెంట్‌లో దీనిని చాలా ప్రత్యేకమైన, శక్తివంతమైన ఆప్షన్‌ మారుస్తుంది.

Frequently Asked Questions

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ ప్రారంభ ధర ఎంత?

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ ప్రారంభ ధర ₹9.99 లక్షలుగా నిర్ణయించారు. ఇది కస్టమర్‌లకు ప్రీమియం కూపే-ఎస్‌యూవీని బడ్జెట్ ధరలో అందిస్తుంది.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ ఏ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది?

ఇది 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.2 లీటర్ హైపీరియన్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ టాప్ వేరియంట్‌లలో ఏయే ఫీచర్లు ఉన్నాయి?

టాప్ వేరియంట్‌లలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ క్యాబిన్‌లో ఎలాంటి మార్పులు చేశారు?

క్యాబిన్‌లో కొత్త కలర్ థీమ్స్, మెరుగైన లెగ్‌రూమ్, నీ-రూమ్ కోసం సీట్లను రీ-డిజైన్ చేశారు. ఓయిస్టర్ వైట్ లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌లో ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఏమిటి?

రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటివి అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget