అన్వేషించండి

రూ.3 లక్షలు డౌన్ పేమెంట్‌తో Maruti Suzuki Invicto కొనుగోలు చేస్తే, EMI ఎంత కట్టాలి

Maruti Suzuki Invicto EMI | మారుతి ఇన్‌విక్టో కార్ల ధరలు కొన్ని వేరియంట్లలో మరోసారి పెరిగాయి. జూన్ 2026లో కంపెనీ దీని కొన్ని వేరియంట్ల ధరను రూ. 25,000 వరకు పెంచింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి ఇన్‌విక్టో ధరలు రూ. 10,000 పెరిగాయి.
  • జీటా ప్లస్ 8S, ఆల్ఫా ప్లస్ 7S వేరియంట్లు ప్రభావితమయ్యాయి.
  • అయితే, జీటా ప్లస్ 7S వేరియంట్ ధరలో మార్పు లేదు.
  • ఈ ఏడాది మొత్తం ధరలు రూ. 35,000 అధికమయ్యాయి.

Maruti Suzuki Invicto Finance Plan | మారుతి సుజుకికి చెందిన ప్రీమియం MPV అయిన ఇన్‌విక్టోను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. కంపెనీ ఈ MPV ధరలు మరోసారి పెంచేసింది. కొత్త అప్‌డేట్ తర్వాత కొన్ని వేరియంట్ల ధర దాదాపు రూ. 10,000 వరకు పెరిగింది. కొన్ని రోజుల కిందట ఇన్‌విక్టో ధర కూడా పెరిగింది. దీనివల్ల ఈ MPV కొనుగోలు చేసే వారు కొంచెం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మారుతి సుజుకి ఇన్‌విక్టోను కంపెనీ భారత మార్కెట్లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఇస్తోంది. ఇది ప్రధానంగా జీటా ప్లస్ హైబ్రిడ్ (Zeta Plus Hybrid), ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ (Alpha Plus Hybrid) వేరియంట్లలో లభిస్తుంది. భిన్నమైన సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను బట్టి ఇందులో 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ మోడల్ ప్రీమియం MPV సెగ్మెంట్‌లో కంపెనీకి చెందిన స్పెషల్ ప్రొడక్ట్.

జీటా ప్లస్ 7S ధరలో మార్పుల్లేవ్

మారుతి ఇన్‌విక్టో కొత్త ధర అప్‌డేట్‌లో ఇన్‌విక్టో అన్ని వేరియంట్ల ధరలు పెరగలేదని కంపెనీ తెలిపింది. జీటా ప్లస్ 7S ధరలో మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో మారుతి సుజుకీ ఇన్‌విక్టో ఎక్స్‌షోరూమ్ ధర Rs.24,97,400 గా ఉండగా, ఆర్టీవో ఛార్జీలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇతర ఛార్జీలు కలిపితే ఆన్ రోడ్ ధర రూ. 31,72,335 వరకు అవుతుంది.

ఇక జీటా ప్లస్ 8S వేరియంట్ ధర మాత్రం రూ. 10,000 పెరిగింది. దీంతో ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.37 లక్షలు ఉండగా, ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 32.25 లక్షలకు చేరింది. 7 సీటర్ జీటా ప్లస్‌ కొనుగోలు చేసే వినియోగదారులు పాత ధరనే చెల్లిస్తారు. అయితే 8 సీటర్ వేరియంట్ అయితే కాస్త ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌విక్టో టాప్ వేరియంట్ ఆల్ఫా ప్లస్ 7S ధర. 10,000 పెరిగింది. ధర పెరిగిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.70 లక్షలైంది. 

Also Read: రూ.లక్ష లోపే వచ్చే పవర్‌ఫుల్‌ 125cc బైక్స్ - యూత్‌ మెచ్చిన టాప్-5 లిస్ట్‌ మీ కోసం!

ఈ వేరియంట్‌లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి, అందుకే ఇది ఇన్‌విక్టోలో అత్యంత ఖరీదైన ఆప్షన్. ధర పెరిగినప్పటికీ, ఇందులో లభించే ఫీచర్లు మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ దీనిని ప్రీమియం MPV కొనుగోలుదారులకు మంచి ఎంపికగా నిలుపుతున్నాయి.

జూన్‌లో కూడా పెరిగిన ధర
మారుతి ఇన్‌విక్టో ధర ఈ ఏడాది ఇప్పటికే పెరిగింది. జూన్ 2026లో కంపెనీ దీని కొన్ని వేరియంట్ల ధరను రూ. 25,000 వరకు పెంచింది. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ కొన్ని వేరియంట్ల ధరను రూ. 10,000 వరకు పెంచారు. అంటే మే నెల ధరలతో పోలిస్తే, ఇన్‌విక్టో కొన్ని వేరియంట్ల మొత్తం ధరలో దాదాపు రూ. 35,000 వరకు తేడా వచ్చింది.

డౌన్ పేమెంట్ కడితే EMI ఎంత చెల్లించాలి

మారుతి ఇన్‌విక్టో 7 సీటర్ ఆన్ రోడ్ ధర రూ. 31.72 లక్షలుగా ఉంది. అయితే మీరు రూ.3 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే కనుక 9.8 శాతం వడ్డీతో 4 ఏళ్లపాటు ఈఎంఐ రూ. 70,682 చెల్లించాలి. 
ఒకవేళ మీరు 5 ఏళ్లకు లోన్ తీసుకుంటే అదే వడ్డీ శాతంతో 60 నెలలపాటు ప్రతినెలా రూ.59,162 EMI కడుతూ ఉండాలి. మీరు కనుక 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే 72 నెలలపాటు EMI రూ. 51,543 చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ రెండు కార్ల మధ్య గట్టి పోటీ

మారుతి ఇన్‌విక్టోకు అతిపెద్ద పోటీదారుగా టయోటా ఇన్నోవా హైక్రోస్ (Toyota Innova Hycross) విక్రయాలు జరుగుతుంటాయి. రెండూ ప్రీమియం హైబ్రిడ్ MPV సెగ్మెంట్‌లోకి రావడంతో పాటు రెండింటిలోనూ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లభిస్తుంది. పెద్ద కేబిన్, ప్రీమియం ఫీచర్లు ఇన్‌విక్టో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బుకింగ్ చేసుకునే ముందు మీకు నచ్చిన వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర, డీలర్ వద్ద లభించే ఆఫర్ల వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

Frequently Asked Questions

మారుతి సుజుకి ఇన్‌విక్టో ధర మళ్ళీ పెరిగిందా?

అవును, మారుతి ఇన్‌విక్టో ధర మరోసారి పెరిగింది. కొత్త అప్‌డేట్ తర్వాత కొన్ని వేరియంట్ల ధర దాదాపు రూ. 10,000 వరకు పెరిగింది. ఇది ఇప్పటికే జూన్ మరియు ఆగస్టులో ధరల పెంపు తర్వాత జరిగింది.

మారుతి ఇన్‌విక్టోలో ఏ వేరియంట్ల ధరలు పెరిగాయి?

జీటా ప్లస్ 8S మరియు ఆల్ఫా ప్లస్ 7S వేరియంట్ల ధరలు రూ. 10,000 పెరిగాయి. అయితే, జీటా ప్లస్ 7S వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు.

మే నెలతో పోలిస్తే ఇన్‌విక్టో మొత్తం ధర ఎంత పెరిగింది?

మే నెల ధరలతో పోలిస్తే, ఇన్‌విక్టో కొన్ని వేరియంట్ల మొత్తం ధరలో దాదాపు రూ. 35,000 వరకు తేడా వచ్చింది. ఇది జూన్, ఆగస్టు మరియు ప్రస్తుత పెంపుదలలను కలుపుకుని.

మారుతి ఇన్‌విక్టో ఏ సీటింగ్ ఆప్షన్లలో లభిస్తుంది?

మారుతి సుజుకి ఇన్‌విక్టో భిన్నమైన సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను బట్టి 7 సీటర్ మరియు 8 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.

మారుతి ఇన్‌విక్టోకు ప్రధాన పోటీదారు ఎవరు?

మారుతి ఇన్‌విక్టోకు అతిపెద్ద పోటీదారుగా టయోటా ఇన్నోవా హైక్రోస్ (Toyota Innova Hycross) ఉంది. రెండూ ప్రీమియం హైబ్రిడ్ MPV సెగ్మెంట్‌కు చెందినవి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌.. టాప్ వేరియంట్‌లో లెవెల్‌ 2 ADAS ఫీచర్లు!
2026 బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది.. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయంటే?
7-సీటర్ ఫ్యామిలీ కారు Nissan Gravite ను లోన్‌పై తీసుకోవచ్చు - 5, 6 లేదా 7 ఏళ్ల లోన్‌కు ఇంత EMI చెల్లించాలి!
కేవలం రూ.1.50 లక్షలు కట్టి 7-సీటర్‌ Nissan Gravite ను ఇంటికి తెచ్చుకోండి.. నెలవారీ EMI లెక్క ఇదిగో!
రూ.1.11 లక్షల Jupiter 110 డ్యూయల్‌ టోన్‌ ఎడిషన్‌.. 3, 4, 5 ఏళ్ల టెన్యూర్‌ పెట్టుకుంటే నెలకు ఎంత EMI కట్టాలి?
TVS Jupiter 110 డ్యూయల్‌ టోన్‌ ఎడిషన్‌.. రూ.20,000 డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత పడుతుంది?
TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!
కొత్తగా డ్యూయల్ టోన్ రంగులే కాదు.. TVS Jupiter 110లో ఇవి కూడా ప్రత్యేకతలే!
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget