అన్వేషించండి

రూ.లక్ష లోపే వచ్చే పవర్‌ఫుల్‌ 125cc బైక్స్ - యూత్‌ మెచ్చిన టాప్-5 లిస్ట్‌ మీ కోసం!

రూ.లక్ష ధర లోపు మార్కెట్‌లో ఉన్న టాప్ 5 పవర్‌ఫుల్ 125cc బైక్స్ ఇవే. బజాజ్, హీరో, హోండా, టీవీఎస్ మోడళ్ల పవర్ & ధర వివరాలు తెలుసుకోండి.

125cc bikes under 1 lakh 2026: మన దేశంలో ప్రస్తుతం 125cc బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు ఎక్కువగా కమ్యూటర్ బైక్‌లదే ఆధిపత్యం ఉండేది, పరిస్థితి ఇప్పుడు మారుతోంది. కంపెనీలు కొత్త డిజైన్‌తో బైక్‌లను తీసుకొస్తున్నాయి. మెరుగైన ఫీచర్లు అందిస్తున్నాయి. పవర్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే, రూ.లక్ష ధరలోపే కొనుగోలు చేయగల అత్యంత పవర్‌ఫుల్ 125cc బైక్‌ల జాబితా ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్‌లో బజాజ్, హీరో, హోండా & టీవీఎస్ మోడళ్లు ఉన్నాయి.

1. Honda SP 125

పవర్: 10.9hp
ధర: రూ.97,335 నుంచి

పవర్‌ పరంగా, హోండా ఎస్పీ 125 ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 123.94cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.9hp పవర్ & 10.9Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2025లో ఈ బైక్‌కు అప్‌డేటెడ్‌ మోడల్‌ వచ్చింది. OBD2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశారు. యాక్టివా 125 నుంచి 4.2 అంగుళాల TFT డిస్‌ప్లేను తీసుకొచ్చారు. ఇందులో Bluetooth కనెక్టివిటీ కూడా ఉంది. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు.

2. TVS Raider 125

పవర్: 11.4hp
ధర: రూ.83,910 నుంచి

2021లో విడుదలైన టీవీఎస్ రైడర్ 125.. 125cc బైక్‌లకు కొత్త స్పోర్టీ లుక్ తీసుకొచ్చింది. యువతను ఆకట్టుకునే డిజైన్ దీని ప్రత్యేకత. ఇందులో 124.8cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 11.4hp పవర్ & 11.2Nm టార్క్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే పనితీరుతో పాటు స్పోర్టీ రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

రైడర్‌లో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. Eco & Power అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. Glide Through Technology కూడా అందుబాటులో ఉంది. మొత్తం ఏడు వేరియంట్లు ఉన్నాయి. టాప్ SX వేరియంట్ మాత్రమే రూ.1 లక్ష దాటుతుంది.

ఇది కూడా చదవండి: Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI ఎంత కట్టాలి

3. Hero Glamour X

పవర్: 11.5hp
ధర: రూ.88,517 నుంచి

హీరో గ్లామర్ X ఈ జాబితాలో ప్రత్యేకమైన బైక్. 125cc సెగ్మెంట్‌లో క్రూయిజ్ కంట్రోల్‌ను అందించడం దీని ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు రైడింగ్ మోడ్‌లు & కలర్ LCD డ్యాష్ కూడా ఉన్నాయి.

ఇందులో 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11.5hp పవర్ & 10.5Nm టార్క్ ఇస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.96,876గా ఉంది. అంటే లక్ష రూపాయల్లోపే మెరుగైన ఫీచర్లతో నిండిన వేరియంట్ లభిస్తుంది.

4. Hero Xtreme 125R

పవర్: 11.5hp
ధర: రూ.98,425 నుంచి

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కూడా 11.5hp పవర్‌ను అందిస్తుంది. ఇందులో 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. టార్క్ 10.5Nm.

డిజైన్ విషయంలో ఈ బైక్‌కు మంచి ప్రత్యేకత ఉంది. పెద్ద ఎక్స్‌ట్రీమ్ 160 మోడల్ నుంచి డిజైన్ స్ఫూర్తి తీసుకుంది. దాని చాసిస్ ఆధారంగానే దీన్ని రూపొందించారు. 37mm టెలిస్కోపిక్ ఫోర్క్ కూడా ఉంది. మూడు వేరియంట్లు ఉన్నాయి. అందులో IBS వేరియంట్ మాత్రమే లక్ష రూపాయల్లోపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: కొత్త Bajaj Pulsar 125లో 4 వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

5. Bajaj Pulsar 125

పవర్: 12.1hp
ధర: రూ.92,990 నుంచి

ఈ జాబితాలో అత్యంత పవర్‌ఫుల్ బైక్ బజాజ్ పల్సర్ 125. 2026లో పల్సర్ 125కు కొత్త తరం అప్‌డేట్ వచ్చింది. ఇందులో కొత్త 124.58cc సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,500rpm వద్ద 12.1hp పవర్ ఇస్తుంది. 6,500rpm వద్ద 11.4Nm టార్క్ అందిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్ 0.3hp పెరిగింది. టార్క్ 0.6Nm పెరిగింది.

ఫీచర్ల విషయంలో కూడా పల్సర్ 125 ఆకట్టుకుంటుంది. టాప్ వేరియంట్లలో LED హెడ్‌లైట్ & TFT డ్యాష్ ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. పవర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారికి బజాజ్ పల్సర్ 125 ఫస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు. తక్కువ ధరలో స్పోర్టీ బైక్ కావాలంటే టీవీఎస్ రైడర్ 125 మంచి ఎంపిక. ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తే హీరో గ్లామర్ X, హోండా ఎస్పీ 125 కూడా పరిశీలించవచ్చు. స్పోర్టీ డిజైన్ కోరుకునేవారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మరో ఆకర్షణీయమైన ఆప్షన్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ వెహికల్ ఓనర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RCలు వచ్చేస్తున్నాయోచ్‌!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget