అన్వేషించండి

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో లాంచ్‌ కాబోతున్న ఈ కార్లపై ఓ లుక్కేయండి!

2026 సెప్టెంబర్‌లో.. కియా సోరెంటో, మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్, BMW 7 సిరీస్, i7 ఫేస్‌లిఫ్ట్, పోర్షే కయేన్ ఎలక్ట్రిక్ కార్లు మన మార్కెట్లో సందడి చేయనున్నాయి.

Car launches September 2026: భారత కార్ల మార్కెట్‌లో కొత్త మోడళ్ల సందడి కొనసాగుతోంది. ఆగస్టులో చాలా కొత్త కార్లు, కొత్త వేరియంట్లు, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. సెప్టెంబర్ కూడా ఇదే జోరును కొనసాగనుంది. ఈ నెలలో కియా, మారుతి సుజుకి, BMW, పోర్షే సంస్థల నుంచి కీలక మోడళ్లు రాబోతున్నాయి.

Kia Sorento

లాంచ్: సెప్టెంబర్ 4

కియా కంపెనీ, భారత మార్కెట్లోకి తన కొత్త ఫ్లాగ్‌షిప్ ICE SUVగా సోరెంటోను తీసుకురానుంది. ఈ SUVలో స్ట్రాంగ్ హైబ్రిడ్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి.

1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 238hp పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2 లీటర్ డీజిల్ ఇంజిన్ 202hp పవర్, 441Nm టార్క్ అందిస్తుంది.

సోరెంటో ముందు భాగంలో కియా ప్రత్యేకమైన టైగర్ నోస్ గ్రిల్ ఉంది. పెద్ద LED హెడ్‌లైట్లు, Y ఆకారంలోని LED DRLs ఆకర్షణగా నిలుస్తాయి. LED ఫాగ్ ల్యాంప్స్, నిలువు ఆకారంలోని ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.

వెనుక భాగంలో చతురస్రాకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇన్వర్టెడ్ L ఆకారంలోని LED లైటింగ్, పెద్ద రూఫ్ స్పాయిలర్, టూ టోన్ బంపర్ ఉన్నాయి.

క్యాబిన్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కనెక్టెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇవి రెండూ 12.3 అంగుళాల స్క్రీన్లు కావచ్చని అంచనా. ADAS, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ IRVM, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇచ్చారు.

సోరెంటో 6 సీటర్ & 7 సీటర్ వెర్షన్లలో వచ్చే అవకాశం ఉంది. ఇది స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టేయ్రాన్, జీప్ మెరిడియన్‌లకు పోటీ ఇవ్వనుంది.

Maruti Baleno facelift

లాంచ్: సెప్టెంబర్ 5

మారుతి సుజుకి బలెనో రెండో తరం మోడల్‌ 2022లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు దీనికి ఫేస్‌లిఫ్ట్ వస్తోంది. కొత్త బలెనోలో ముందు భాగంలో కీలక మార్పులు ఉండనున్నాయి.

కొత్త గ్రిల్‌లో హెడ్‌లైట్లను కలిపేలా మధ్యలో అడ్డంగా ఒక బార్ ఉండే అవకాశం ఉంది. కొత్త బంపర్ కూడా కనిపించనుంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కొత్త వెర్షన్‌లో ఉండకపోవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. వెనుక భాగంలో కొత్త బంపర్ రావచ్చు. టెయిల్ ల్యాంప్స్ మాత్రం ప్రస్తుత మోడల్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది.

క్యాబిన్‌లో ప్రస్తుత 9 అంగుళాల టచ్‌స్క్రీన్ కొనసాగవచ్చు. కొత్త అప్‌హోల్స్టరీ & అదనపు ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

ఇంజిన్ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 90hp పవర్ ఇస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ AMT ఆప్షన్లు ఉంటాయి. 77.5hp CNG వెర్షన్ కూడా కొనసాగుతుంది. CNG మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

కొత్త బలెనో... Tata Altroz, Hyundai i20, Toyota Glanzaకు పోటీ కారుగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: ఇంజిన్ ఆఫ్ చేసినా కారు టిక్‌ టిక్‌ శబ్దం ఎందుకు చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోండి!

BMW 7 Series & i7 Facelifts

లాంచ్: సెప్టెంబర్ 11

BMW తన ఫ్లాగ్‌షిప్ 7 సిరీస్ సెడాన్ & ఆల్‌-ఎలక్ట్రిక్ i7కు ఫేస్‌లిఫ్ట్ తీసుకురానుంది. ఈ రెండు మోడళ్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

భారత్‌లో ప్రస్తుతం 740i పెట్రోల్, 740d డీజిల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. i7లో eDrive 50 & M70 xDrive వేరియంట్లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌తో వీటిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అయితే భారత్‌లో ఏ వేరియంట్లు వస్తాయనేది BMW ఇంకా స్పష్టం చేయలేదు.

అంతర్జాతీయ మార్కెట్లలో 740iలో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ 400hp పవర్, 580Nm టార్క్ ఇస్తుంది. 740d 313hp పవర్, 670Nm టార్క్ అందిస్తుంది. రెండు మోడళ్లలో 48V మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ & xDrive ఆల్ వీల్ డ్రైవ్ ఉన్నాయి.

i7లో 112.4kWh బ్యాటరీ ఉంటుంది. eDrive 50 వెర్షన్ 455hp పవర్, 660Nm టార్క్ ఇస్తుంది. M70 xDrive 680hp పవర్, 1,100Nm టార్క్ అందిస్తుంది. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది.

బయట డిజైన్ మరింత ఆధునికంగా మారింది. కొత్త స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, సన్నగా & నిలువుగా ఉండే కిడ్నీ గ్రిల్, ఇల్యూమినేటెడ్ గ్రిల్ సరౌండ్ ఉన్నాయి. వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, కొత్త టెయిల్‌గేట్ & బంపర్ ఉన్నాయి.

క్యాబిన్‌లో 17.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 14.6 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే ఉంటాయి. విండ్‌షీల్డ్ కింది భాగంలో పెద్ద పనోరమిక్ విజన్ డిస్‌ప్లే ఉంటుంది.

వెనుక ప్రయాణికుల కోసం హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ & లంబార్ సపోర్ట్ ఉన్న పవర్డ్ సీట్లు ఉన్నాయి. 31.3 అంగుళాల 8K థియేటర్ స్క్రీన్‌ను టచ్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. BMW 7 సిరీస్‌కు ప్రధాన ప్రత్యర్థి మెర్సిడెస్ బెంజ్ S క్లాస్.

ఇది కూడా చదవండి: కొంతమంది తమ కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ బ్యాగ్‌ను ఎందుకు కడతారు? అసలు కారణం ఇదే

Porsche Cayenne Electric

డెబ్యూ: సెప్టెంబర్ 30

పోర్షే కయేన్ ఎలక్ట్రిక్‌ను సెప్టెంబర్ 30న భారత్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను ఇప్పటికే ప్రకటించారు. స్టాండర్డ్ కయేన్ ఎలక్ట్రిక్ ధర రూ.1.77 కోట్లు & టాప్ ఎండ్ టర్బో ఎలక్ట్రిక్ ధర రూ.2.27 కోట్లు (ఎక్స్ షోరూమ్).

రెండు వేరియంట్లలో 113kWh బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ ప్రామాణికంగా వస్తుంది. టర్బో ఎలక్ట్రిక్ 1,156hp పవర్ & 1,500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కంట్రోల్‌తో కేవలం 2.5 సెకన్లలో 0 నుంచి 100kph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 260kph. WLTP రేంజ్ 537km.

స్టాండర్డ్ కయేన్ ఎలక్ట్రిక్ 442hp పవర్, 835Nm టార్క్ ఇస్తుంది. 0 నుంచి 100kph వేగాన్ని 4.8 సెకన్లలో చేరుతుంది. గరిష్ట వేగం 230kph. దీని WLTP రేంజ్ 542km.

ఎలక్ట్రిక్ కయేన్‌.. డిజైన్ పరంగా ICE కయేన్‌ను పోలి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోడల్‌లో క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. బ్యాటరీ & ఎలక్ట్రిక్ భాగాలను చల్లబరచడానికి బంపర్‌కు ఇరువైపులా ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. వెనుక భాగంలో పూర్తి వెడల్పు LED లైట్ బార్ & ఇల్యూమినేటెడ్ పోర్షే లోగో కనిపిస్తాయి.

క్యాబిన్‌లో 14.5 అంగుళాల కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంటుంది. అదనంగా 14.9 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేను ఆప్షన్‌గా పొందవచ్చు. 8 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ వెహికల్‌ RC కార్డు పోతే టెన్షన్ వద్దు.. డూప్లికేట్ RC కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!
మీ బండి RC పోయిందా? డూప్లికేట్ పొందడం ఎలా? ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇదే!
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
దాడి సమయంలో Tiger Shroff వెళ్తున్న BMW Car ఎంత వరకు సేఫ్? బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఖర్చు ఎంత
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Embed widget