అన్వేషించండి

ఇంజిన్ ఆఫ్ చేసినా కారు టిక్‌ టిక్‌ శబ్దం ఎందుకు చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోండి!

ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత కారు టిక్ టిక్ శబ్దం చేయడం, ఫ్యాన్ తిరగడం ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి. ఏ శబ్దం సాధారణం, ఎప్పుడు జాగ్రత్త పడాలో తెలుసుకోండి.

Car Make Noise After Turn Off The Engine: మీ కారును ఆపేశారు. ఇంజిన్ కూడా ఆఫ్ చేశారు. ఇక అంతా నిశ్శబ్దమే అనుకుంటారు. కానీ కొద్దిసేపటికే బానెట్ కింద నుంచి టిక్.. టిక్.. టిక్.. అంటూ శబ్దం వినిపిస్తుంది. కొన్ని కార్లలో ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంటుంది. మరికొన్ని కార్లలో డ్యాష్‌బోర్డ్ వెనుక నుంచి క్లిక్ అనే శబ్దం వస్తుంది. ఇలాంటి శబ్దాలు వినిపిస్తే చాలామంది కారు ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉందేమోనని భయపడతారు. కానీ ఈ శబ్ధం సమస్యకు మూలం కాకపోవచ్చు!. సాధారణంగా, ఆధునిక కార్లలో ఇంజిన్ ఆఫ్ చేసిన వెంటనే అన్ని వ్యవస్థలు పూర్తిగా ఆగిపోవు. కొన్ని భాగాలు కొద్దిసేపు తమ పని కొనసాగిస్తాయి.

మీ ప్రయాణ సమయంలో కారు ఇంజిన్, ఎగ్జాస్ట్ వ్యవస్థ చాలా వేడెక్కుతాయి. ముఖ్యంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఎగ్జాస్ట్ పైపులు, హీట్ షీల్డ్స్ అధిక ఉష్ణోగ్రతకు చేరతాయి. కారు ఆపిన తర్వాత ఇవి నెమ్మదిగా చల్లబడతాయి. ఈ సమయంలో లోహ భాగాలు కుచించుకుపోతాయి. దాంతో టిక్.. టిక్.. అనే శబ్దం వస్తుంది. ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు ఈ శబ్దం మరింత స్పష్టంగా వినిపించవచ్చు. హైవే డ్రైవింగ్, వేగంగా నడపడం, బరువులు లాగడం వంటి సందర్భాల్లో కూడా ఇది ఎక్కువగా ఉండొచ్చు. శబ్దం క్రమంగా తగ్గి ఆగిపోతే సాధారణంగా ఆందోళన అవసరం లేదు.

కారు ఆపిన తర్వాత కూలింగ్ ఫ్యాన్ తిరగడం కూడా సాధారణమే. ఆధునిక కార్లలో విద్యుత్ ఫ్యాన్లు ఉంటాయి. ఇంజిన్ ఇంకా వేడిగా ఉంటే, కారును నిలిపేసిన తర్వాత కూడా ఫ్యాన్ కొన్ని నిమిషాలు పనిచేస్తుంది. అయితే, ఫ్యాన్ చాలా సేపు ఆగకుండా తిరిగితే మాత్రం తప్పకుండా పరిశీలించాలి. దీని అర్ధం.. ఉష్ణోగ్రత సెన్సార్, రిలే లేదా కూలింగ్ వ్యవస్థలో సమస్య ఉండొచ్చు. ఫ్యాన్‌ ఎక్కువ సేపు తిరగడం వల్ల బ్యాటరీ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు పరిశీలించేటప్పుడు.. ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ ఫ్యాన్ అకస్మాత్తుగా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి బానెట్ లోపల చేతులు పెట్టకూడదు.

ఇది కూడా చదవండి: కొంతమంది తమ కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ బ్యాగ్‌ను ఎందుకు కడతారు? అసలు కారణం ఇదే

మరో ఆసక్తికరమైన విషయం - EVAP వ్యవస్థ. పెట్రోల్ ఆవిరి బయటకు వెళ్లకుండా కారు వాటిని నియంత్రిస్తుంది. కొన్ని కార్లు ఇంజిన్ ఆఫ్ చేసిన కొన్ని గంటల తర్వాత ఇంధన ఆవిరి లీక్‌ అవుతుందా అని ఆటోమేటిక్‌గా పరీక్షిస్తాయి. ఈ సమయంలో పంపులు, వాల్వులు పనిచేస్తాయి. దాంతో కారు కింద నుంచి స్వల్ప శబ్దం వినిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియేనని కొన్ని కారు కంపెనీలు వెల్లడించాయి.

డ్యాష్‌బోర్డ్ వెనుక క్లిక్ శబ్దం కూడా కొన్నిసార్లు సహజమే. ఏసీ వ్యవస్థలో, గాలి వెళ్లే మార్గాలను మార్చే చిన్న మోటార్లు ఉంటాయి. ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి తమ స్థానాన్ని సరిచేసుకోవచ్చు. అప్పుడు క్లిక్ శబ్దాలు వస్తాయి. కానీ అదే శబ్దం పదేపదే గట్టిగా వినిపిస్తే యాక్చుయేటర్‌లో సమస్య ఉండొచ్చు.

ఆధునిక కార్లలో ఎన్నో కంప్యూటర్ నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. కారు ఆపిన తర్వాత అవి వెంటనే పూర్తిగా ఆగిపోవు. సమాచారాన్ని భద్రపరచడం, తనిఖీలు చేయడం, ఇతర వ్యవస్థలను ఆపడం వంటి పనులు కొంతసేపు కొనసాగుతాయి.

శబ్దంతో పాటు పొగ, ఆవిరి, కూలెంట్ లీక్, పెట్రోల్ వాసన, కాలిన వాసన లేదా ఓవర్‌హీటింగ్ హెచ్చరిక కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. బ్యాటరీ తరచూ ఖాళీ అవుతున్నా, ఫ్యాన్ ఆగకపోయినా, గట్టిగా గ్రైండింగ్ లేదా ర్యాట్లింగ్ శబ్దాలు వచ్చినా మెకానిక్‌ను సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: అథర్ కొణార్క్ లాంచ్‌ అయింది.. 161km రేంజ్‌, 3 బ్యాటరీ ఆప్షన్లతో పాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

ఒక్క విషయం గుర్తుంచుకోండి.. కారు ఆపిన తర్వాత వచ్చే ప్రతి శబ్దం సమస్యకు సంకేతం కాదు. కొన్నిసార్లు ఇంజిన్ ఆపిన తర్వాత కూడా మీ కారు తన చివరి పనులను పూర్తి చేస్తుంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget