అన్వేషించండి

కొంతమంది తమ కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ బ్యాగ్‌ను ఎందుకు కడతారు? అసలు కారణం ఇదే

కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ బ్యాగ్ కట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని విషయాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే డ్రైవింగ్‌కు ముందు ఆ బ్యాగ్‌లను తప్పనిసరిగా తొలగించాలి.

Tying plastic bags to the car mirrors: మీ కారును ఆరుబయట, చెట్ల కింద, రోడ్డు పక్కన వంటి పబ్లిక్‌ ప్లేస్‌ల్లో పార్క్ చేస్తున్నారా? అయితే మీ వాహనం సైడ్ మిర్రర్లు చాలా ముప్పులు ఎదుర్కొంటాయి. దుమ్ము, ధూళి, తేమ, మంచు మాత్రమే కాదు.. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పక్షుల వ్యర్థాలు కూడా మిర్రర్లపై పడుతుంటాయి. చలికాలంలో మిర్రర్లపై మంచు, తేమ పేరుకుపోవడం కూడా సాధారణమే. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క సింపుల్ చిట్కా ఉపయోగపడుతుంది. అదే.. కారు సైడ్ మిర్రర్లకు పాలిథిన్‌ కవర్లు కట్టడం. మీ ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉండే పాలిథిన్‌ కవర్‌తోనే ఈ పని చేయవచ్చు. వాహనం బయట ఎక్కువసేపు పార్క్ చేసినప్పుడు ఇది మిర్రర్లకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ప్లాస్టిక్ బ్యాగ్ ఎందుకు కట్టాలి?

కారు మిర్రర్‌పై ప్లాస్టిక్ బ్యాగ్‌ను కప్పడం వల్ల.. ముందుగా దుమ్ము, ధూళి నేరుగా మిర్రర్‌పై పడకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా రోడ్డు పక్కన, ఇంటి బయట, ఆఫీస్‌ బయట వంటి ప్రదేశాల్లో కారును పార్క్ చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

గీతలు పడకుండా..

మీ కారు అద్దాలకు వేరే వాహనం లేదా ఏదైనా వస్తువు తగిలినప్పుడు పాలిథిన్‌ బ్యాగ్‌ ఒక కవచంలా మారుతుంది, గీతలు పడే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.

చలికాలంలో మరో ప్రయోజనం

తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో రాత్రి సమయంలో మిర్రర్లపై మంచు పేరుకుపోవచ్చు. ఉదయం కారును బయటకు తీసే సమయంలో మిర్రర్‌పై ఉన్న మంచును తొలగించాల్సి వస్తుంది. పాలిథిన్‌ కవర్‌ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి ఉంచితే మంచు నేరుగా మిర్రర్ ఉపరితలంపై పేరుకుపోకుండా కొంతవరకు రక్షణ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

పక్షుల నుంచి కూడా రక్షణ

పక్షుల వ్యర్థాల నుంచి కూడా మిర్రర్లను కాపాడవచ్చు. పార్క్ చేసిన కార్ల మిర్రర్లపై పక్షులు తరచూ వాలుతుంటాయి. దీంతో మిర్రర్ మురికిగా మారుతుంది. పక్షులు అద్దాలపై రెట్టలు కూడా వేస్తుంటాయి. ప్లాస్టిక్ బ్యాగ్ ఉండటం వల్ల మిర్రర్ ఉపరితలంపై నేరుగా వ్యర్థాలు పడే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు.. కారు అద్దంలో పక్షులకు తమ ప్రతిబింబం కనిపించినప్పుడు, అవి దానిని మరో పక్షిగా భావిస్తాయి. దీంతో కొన్ని పక్షులు మిర్రర్‌ను ముక్కుతో పొడవడం లేదా గీకడం చేస్తాయి. దీనివల్ల మిర్రర్‌పై చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాగ్ ఈ సమస్యను కొంతవరకు తగ్గించగలదు. మిర్రర్‌కు & పక్షులకు మధ్య ఒక అదనపు పొరలా పనిచేస్తుంది.

ఎలా కట్టాలి?

మిర్రర్ మొత్తం కప్పేంత పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఎంచుకోవాలి. బ్యాగ్‌ను మిర్రర్‌పై పూర్తిగా కప్పిన తర్వాత బిగుతుగా కట్టాలి. గాలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ ముడులు వేయడం మంచిది. దీంతో బ్యాగ్ ఎగిరిపోకుండా ఉంటుంది. 

అయితే, ఈ చిట్కా ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఎక్కువసేపు ఉంచినా మిర్రర్ పూర్తిగా శుభ్రంగా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు సాధారణ క్లీనింగ్‌ చేస్తుండాలి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

అత్యంత ముఖ్యమైన విషయం

డ్రైవింగ్‌కు ముందు ప్లాస్టిక్ బ్యాగ్‌ను తప్పనిసరిగా తొలగించాలి. మిర్రర్‌పై బ్యాగ్‌ను అలాగే ఉంచి వాహనం నడపకూడదు. డ్రైవింగ్ ప్రారంభించే ముందు రెండు సైడ్ మిర్రర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

మొత్తంగా చూస్తే, పైసా ఖర్చు లేకుండా చేయగల సులభమైన చిట్కా ఇది. ముఖ్యంగా వాహనాన్ని పగలు లేదా రాత్రిపూట బయట పార్క్ చేసేవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మరో విషయం గుర్తుచుకోవాలి.. ఇది కారు మిర్రర్ నిర్వహణకు ప్రత్యామ్నాయం కాదు. రెగ్యులర్ క్లీనింగ్‌తో పాటు ఈ చిట్కాను అదనపు రక్షణగా మాత్రమే ఉపయోగించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget