అన్వేషించండి

నెలకు రూ.17,000 EMIతో సరికొత్త కియా సైరోస్‌ మీదవుతుంది! ఫీచర్లు, బ్యాంక్ ఆఫర్ల పూర్తి వివరాలు

కియా సైరోస్‌ తాజా ఆన్-రోడ్ ధరలు, తక్కువ డౌన్‌పేమెంట్ & బ్యాంక్ EMI ఆఫర్లు. నెలకు ఎంత కట్టాలో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Kia syros Price And Features Telugu: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVల లెక్కలు సరిచేయడానికి కియా ఇండియా నుంచి వచ్చిన మోడల్ Kia Syros. వినూత్నమైన డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ కారుపై తెలుగు ప్రజలు చలా ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ అవసరాలకు, రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా రూపుదిద్దుకున్న ఈ SUVని కొనాలని మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కారు ధరలు, డౌన్‌పేమెంట్స్ & వివిధ బ్యాంకుల EMI ఆప్షన్లపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఎక్స్-షోరూమ్ ధరలు & ఆన్-రోడ్ అంచనా

తెలుగు రాష్ట్రాల్లో Kia Syros ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 8,41,900 నుంచి ప్రారంభమవుతుంది. RTO ఛార్జీలు, వాహన ఇన్సూరెన్స్ & ఇతర అవసరమైన ఛార్జీలను కలిపితే బేస్ వేరియంట్ (HTE పెట్రోల్) ఆన్-రోడ్ ధర సుమారు రూ. 9,76,424 వరకు ఉంటుంది. మీరు ఎంచుకునే వేరియంట్, పెట్రోల్ లేదా డీజిల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మోడల్‌ను బట్టి ఆన్-రోడ్ ముగింపు ధరలు మారుతుంటాయి.

కనీస డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి?

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మంది చూసేది ప్రాథమిక పెట్టుబడి లేదా డౌన్‌పేమెంట్. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆన్-రోడ్ ధరలో 85% నుంచి 90% వరకు లోన్ సదుపాయం కల్పిస్తాయి. Kia Syros బేస్ మోడల్ కొనుగోలుకు కనీస డౌన్‌పేమెంట్ రూ. 1,34,524 చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే రూ.2.50 లక్షల వరకు డౌన్‌పేమెంట్ చెల్లించడం ద్వారా నెలానెలా పడే భారాన్ని (EMI) తగ్గించుకోవచ్చు.

బ్యాంక్ రుణాలు & లోన్ టెన్యూర్‌లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ & ప్రముఖ NBFCలు కారు రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం రుణ వడ్డీ రేట్లు సగటున 8% నుంచి 9.5% మధ్య నడుస్తున్నాయి. లోన్ తిరిగి చెల్లించే వ్యవధి లేదా టెన్యూర్ రూపంలో 3 సంవత్సరాల (36 నెలలు) నుంచి 7 సంవత్సరాల (84 నెలలు) వరకు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

వివిధ EMI ఆప్షన్ల పూర్తి వివరాలు

మీ లోన్ టెన్యూర్ ఆధారంగా నెలవారీ EMI లెక్కింపు మారుతుంది. ఉదాహరణకు... మీరు రూ.1.35 లక్షల డౌన్‌పేమెంట్ చేసి, 8% వడ్డీ రేటుతో రూ. 8,41,900 బ్యాంక్ రుణం తీసుకుంటే, ప్రతి నెలా ఎంత EMI పడుతుందో ఇక్కడ పరిశీలించండి:

5 సంవత్సరాల టెన్యూర్ (60 నెలలు): ప్రతి నెలా చెల్లించాల్సిన EMI సుమారు రూ.17,071

7 సంవత్సరాల టెన్యూర్ (84 నెలలు): ప్రతి నెలా చెల్లించాల్సిన EMI సుమారు రూ.13,000 నుంచి రూ. 13,500

సరికొత్త డీజిల్ & ఆటోమేటిక్ వేరియంట్ల కోసం నెలవారీ EMI రూ.24,000 నుంచి రూ. 32,000 వరకు పడే అవకాశం ఉంటుంది.

మోడల్ వివరాలు & ఫైనాన్స్ సమాచారం ‍‌(ఉదాహరణ)

ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర: రూ. 8,41,900
ఆన్-రోడ్ ప్రారంభ ధర (అంచనా):  రూ. 9,76,424
కనీస డౌన్‌పేమెంట్:  రూ. 1,34,524
సుమారు రుణ మొత్తం:  రూ. 8,41,900
సగటు వడ్డీ రేటు:  8.0%
లోన్ టెన్యూర్ 5 సంవత్సరాలు (60 నెలలు)
నెలవారీ EMI: రూ. 17,071

ఇది కూడా చదవండి: రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం!

ముఖ్య గమనిక: కారు రుణం తీసుకునే ముందు మీ సిబిల్‌ స్కోర్‌ను సరిచూసుకోండి. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే లోన్ ఆమోదిస్తాయి. అలాగే వాహనం డెలివరీ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీలు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే, దీనికోసం బ్యాంక్ ప్రతినిధులతో ముందే మాట్లాడి నిర్ధారించుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

River Indieకి కొత్త వెర్షన్‌ రాబోతోందా? RX02, RX03 స్కూటర్ల ఫోటోలు లీక్.. డిజైన్‌లో మార్పులివే!
త్వరలో మార్కెట్‌లోకి రానున్న రివర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే.. ఫోటోలు లీక్!
Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget