అన్వేషించండి

రూ.79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం!

రూ.79,999 ప్రారంభ ధరతో ఓలా S1Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 5.1 kWh బ్యాటరీతో 301 కి.మీ. IDC రేంజ్‌ను ప్రకటించింది. దేశీయ LFP బ్యాటరీ సెల్స్‌ దీని ప్రత్యేకత.

Ola S1Z Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ మరోసారి దూకుడు పెంచింది. కొత్త S1Z స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.79,999 (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ఈ స్కూటర్‌లో 3.1 kWh & 5.1 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

5.1 kWh బ్యాటరీతో వచ్చే S1Z అత్యధికంగా 301 కి.మీ. IDC రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వెర్షన్‌ ధర రూ.99,999. 3.1 kWh వెర్షన్‌ 179 కి.మీ. IDC రేంజ్‌ అందిస్తుందని ఓలా వెల్లడించింది. దీని ధర రూ.79,999. S1Z ను కేవలం రూ.999తో బుక్‌ చేసుకోవచ్చు.

3.1 kWh వెర్షన్‌ డెలివరీలు 2026 డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. 5.1 kWh వెర్షన్‌ డెలివరీలు 2027 మార్చి నుంచి మొదలవుతాయి.

ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ టెక్నాలజీ. ఓలా స్వయంగా అభివృద్ధి చేసిన LFP సెల్స్‌ను S1Zలో ఉపయోగించింది. ఈ సెల్స్‌ను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలా గిగాఫ్యాక్టరీలో వీటి తయారీ జరుగుతోంది.

LFP బ్యాటరీలకు మంచి ఉష్ణ స్థిరత్వం ఉంటుంది. ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం కూడా ఉంటుంది. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సెల్స్‌ను అభివృద్ధి చేసినట్లు ఓలా చెబుతోంది. దేశీయంగా బ్యాటరీ సెల్స్‌ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి: పెట్రోల్ బాదుడుకి చెక్ చెబుదాం - పాత వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చడం ఎలా?

S1Zలో 4 kW పీక్‌ పవర్‌ కలిగిన మిడ్‌-డ్రైవ్‌ IPM మోటార్‌ ఉంటుంది. రెండు వెర్షన్లలోనూ గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ. 3.1 kWh వెర్షన్‌ 0-40 కి.మీ. వేగాన్ని 4.6 సెకన్లలో అందుకుంటుంది. ఇదే వేగం 5.1 kWh వెర్షన్‌కు 4.9 సెకన్లు పడుతుంది.

3.1 kWh బ్యాటరీ 0-80 శాతం చార్జ్‌ కావడానికి 5 గంటల 42 నిమిషాలు పడుతుంది. 5.1 kWh బ్యాటరీకి 6 గంటల 16 నిమిషాలు అవసరం.

S1Zలో MoveOS 5 సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. GPS ట్రాకింగ్‌, రైడ్‌ గణాంకాలు, OTA అప్‌డేట్స్‌, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. జియో ఫెన్సింగ్‌, టైమ్‌ ఫెన్సింగ్‌ & మోడ్‌ ఫెన్సింగ్‌ కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ స్కూటర్‌కు 3 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ. వారంటీని ఓలా అందిస్తోంది.

S1Zలో మరో కీలక మార్పు విక్రయాల విధానం. ఈ స్కూటర్‌ను డీలర్‌ ఆధారిత రిటైల్‌ మోడల్‌ ద్వారా విక్రయించనున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాల్లో ఓలా విక్రయాలు & సర్వీస్‌ నెట్‌వర్క్‌ మరింత విస్తరించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!

TVS iQube, Bajaj Chetak, Ather Rizta, Vida వంటి మోడళ్లతో S1Z పోటీ పడనుంది. రూ.79,999 ప్రారంభ ధరతో పాటు రూ.99,999కే 5.1 kWh బ్యాటరీ & 301 కి.మీ. IDC రేంజ్‌ అనే ప్రకటన S1Z పట్ల ఆసక్తిని పెంచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget