అన్వేషించండి

యమహా R15 V4 బైక్ లోన్ ఆఫర్లు: ఎంత డౌన్‌పేమెంట్ కడితే నెలకు ఎంత EMI పడుతుంది? పూర్తి క్యాలిక్యులేషన్‌!

యమహా R15 V4 బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వివిధ బ్యాంకులు అందిస్తున్న ఈజీ EMI ఆప్షన్లు & కనీస డౌన్‌పేమెంట్ వివరాలను ఇక్కడ పూర్తిగా చెక్ చేయండి.

Yamaha R15 V4 Price And Features Telugu: యూత్ & స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి Yamaha R15 V4 ఒక కలల టూవీలర్‌. సూపర్‌బైక్ లుక్స్, అద్భుతమైన 155cc ఇంజిన్, లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ & టూ-ఛానల్ ABS ఫీచర్లతో రోడ్లపై ఈ బైక్ తారాజువ్వలా దూసుకెళ్తుంది. అయితే ఒకేసారి ఆన్-రోడ్ ధర మొత్తం చెల్లించడం అందరికీ వీలుకాకపోవచ్చు. అందుకే బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్న ఆకర్షణీయమైన EMI ఆప్షన్లు, తక్కువ Down Payment ప్లాన్ల వివరాలను ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాం.

ఎక్స్-షోరూమ్ ధర & ఆన్-రోడ్ అంచనా

Yamaha R15 V4 బేస్ వేరియంట్ Metallic Red ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1,73,000 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్టీఓ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ & ఇతర చార్జీలు కలిపి ఆన్-రోడ్ ధర ప్రాంతాన్ని బట్టి రూ. 2,00,000 నుంచి రూ. 2,10,000 వరకు ఉంటుంది.

కనీస డౌన్‌పేమెంట్ వివరాలు

ఫైనాన్స్ కింద ఈ బైక్‌ను కొనాలనుకుంటే, బ్యాంక్‌లు ప్రాథమికంగా కొనుగోలుదారు సిబిల్‌ స్కోర్‌ను చూస్తాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే ఆన్-రోడ్ ధరలో 90% వరకు లోన్ ఇస్తాయి.

కనీస డౌన్‌పేమెంట్: రూ.17,270 నుంచి రూ.20,000 వరకు చెల్లించి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మీ దగ్గర ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే, రూ.50,000 లేదా రూ.60,000 వరకు డౌన్‌పేమెంట్ కడితే నెలానెలా పడే వడ్డీ & EMI భారం గణనీయంగా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'

వివిధ రుణ కాలపరిమితులు & EMI ఆప్షన్లు

ప్రస్తుతం బ్యాంక్‌లు, వివిధ ఫైనాన్స్‌ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న వడ్డీరేట్ల ప్రకారం, వడ్డీ రేటు సగటున 8.5% నుంచి 10% మధ్య ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మంత్లీ EMI ఎంత పడుతుందో చూద్దాం:

60 నెలల కాలపరిమితి (5 ఏళ్లు): కనీస డౌన్‌పేమెంట్ రూ.17,300 చెల్లించినట్లయితే, నెలకు EMI కేవలం రూ.3,189 నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద కాలపరిమితి ఎంచుకోవడం వల్ల నెలవారీ భారం చాలా తక్కువగా ఉంటుంది.

36 నెలల కాలపరిమితి (3 ఏళ్లు): మధ్యస్థ కాలపరిమితి ఎంచుకునేవాళ్లకు ఇది చాలా ఉత్తమం. రూ.20,000 డౌన్‌పేమెంట్ చేస్తే, నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ.5,490 వరకు ఉంటుంది.

24 నెలల కాలపరిమితి (2 ఏళ్లు): త్వరగా లోన్ ముగించాలనుకునేవాళ్లకు 24 నెలల ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్‌లో నెలవారీ EMI సుమారు రూ.7,500 నుండి రూ.8,000 మధ్యలో ఉంటుంది.

ఇది కూడా చదవండి: రూ.9,999 చెల్లించి Apache RTR 160 కొనేయండి, నెలవారీ EMI ఎంత కట్టాలి

యమహా R15 V4 ఈఎంఐ &డౌన్‌పేమెంట్‌ అంచనా ప్లాన్‌

వేరియంట్ / మోడల్ అంచనా ఆన్-రోడ్ ధర కనీస డౌన్‌పేమెంట్ లోన్ కాలపరిమితి అంచనా వడ్డీ రేటు నెలవారీ EMI
R15 V4 Metallic Red రూ. 2,00,000 రూ. 17,300 60 నెలలు 8.5% రూ. 3,189
R15 V4 Standard రూ. 2,02,000 రూ. 20,000 36 నెలలు 9.5% రూ. 5,490
R15 V4 Racing Blue రూ. 2,05,000 రూ. 25,000 24 నెలలు 10.0% రూ. 7,800
R15 M Edition రూ. 2,11,000 రూ. 29,000 36 నెలలు 9.5% రూ. 6,070

 ముఖ్య గమనిక: పైన పేర్కొన్న EMI & డౌన్‌పేమెంట్‌ అంకెలు అంచనా మాత్రమే. మీ సిబిల్ (CIBIL) స్కోర్, ఆదాయ ప్రొఫైల్ & మీరు ఎంచుకునే బ్యాంకు లేదా షోరూమ్‌ను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. బైక్ బుక్ చేసుకునే ముందు మీ సమీపంలోని Yamaha షోరూమ్‌కు వెళ్లి, ఏవైనా ఆఫర్లు & ప్రాసెసింగ్ ఫీజుల వివరాలను తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!
E100 ఫ్యూయల్ వాహనాలకు లైన్‌ క్లియర్‌.. ఇక పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే కార్లను కూడా చూస్తాం!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget