అన్వేషించండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధర!.. మార్కెట్‌లోకి సరికొత్త హోండా 'రెబల్ 300'

హోండా రెబల్ 300 భారత్‌లో విడుదలైంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.22 లక్షలు కాగా E-Clutch ధర రూ.2.62 లక్షలు.

Honda Rebel 300 Price And Features Telugu: 'హోండా మోటార్‌సైకిల్‌ & స్కూటర్‌ ఇండియా' మరో కొత్త బైక్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. బాబర్ తరహా క్రూయిజర్ బైక్ "రెబల్ 300"ను లాంచ్‌ చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.22 లక్షలు, ఇది స్టాండర్డ్ వేరియంట్. ఈ వేరియంట్‌, రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ రేటుకే మార్కెట్‌లోకి వచ్చింది. అయితే, రెబల్ 300 E-Clutch వేరియంట్ కూడా ఉంది, దీని ధర రూ.2.62 లక్షలు. ఇవి బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధరలు.

భారత్‌లోనే తయారీ

హోండా కంపెనీ, రెబల్ 300ను భారత్‌లోనే తయారు చేస్తోంది. ఈ బైక్‌ను హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయించనుంది. తక్కువ ఎత్తు సీటింగ్ పొజిషన్, బాబర్ డిజైన్‌తో రూపొందిన ఈ బైక్, క్రూయిజర్ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

రెండు వేరియంట్లు

రెబల్ 300 రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.22 లక్షలు. E-Clutch వేరియంట్ ధర రూ.2.62 లక్షలు. అంటే E-Clutch కోసం అదనంగా రూ.40,000 చెల్లించాలి. ఈ రెండు వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్ & గేర్‌బాక్స్ ఉన్నాయి. E-Clutch వేరియంట్‌లో అదనంగా ఎలక్ట్రానిక్ క్లచ్ సిస్టమ్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!

30hp పవర్

హోండా రెబల్ 300లో 286cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 30hp పవర్ & 27.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను గతంలో CB300Rలోనూ ఉపయోగించారు. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

E-Clutch వేరియంట్ ప్రత్యేకత ఏంటి?

రెబల్ 300 E-Clutch వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ యాక్చుయేటర్లు ఉన్నాయి. ఇవి క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేస్తాయి. దీంతో క్లచ్ లివర్‌ను ఉపయోగించకుండానే గేర్లు మార్చుకోవచ్చు. అవసరమైనప్పుడు క్లచ్‌ను మాన్యువల్‌గా కూడా ఆపరేట్ చేయవచ్చు. TFT డిస్‌ప్లే ద్వారా ఈ సిస్టమ్‌ను అవసరానికి అనుగుణంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

సస్పెన్షన్ & బ్రేకులు

బైక్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ అందించారు. వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది.

రెబల్ 300లో 16 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ముందు భాగంలో 130 సెక్షన్ టైర్‌ను అమర్చారు. దీని ప్రొఫైల్ 90గా ఉంటుంది. వెనుక భాగంలో మరింత వెడల్పైన 150 సెక్షన్ టైర్ ఉంది. దీని ప్రొఫైల్ 80.

ఇది కూడా చదవండి: కొత్త బజాజ్‌ పల్సర్ 150లో ఫీచర్లు ఎక్కువే.. కానీ పాత మోడల్‌లో ఉన్న ఈ సదుపాయాలు మిస్!

క్రూయిజర్ తరహా డిజైన్

రెబల్ 300లో లో-స్లంగ్ బాబర్ డిజైన్ కనిపిస్తుంది. టియర్‌డ్రాప్ ఆకారంలో ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, రెండు భాగాల సీటు & షార్ట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.

రైడర్‌ సీటు ఎత్తు 690 మిల్లీమీటర్లు, కాబట్టి తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా ఈ బైక్‌ను హ్యాండిల్ చేయడం సులభం. ఎత్తుగా ఉండే హ్యాండిల్‌బార్ & ముందుకు సెట్ చేసిన ఫుట్‌పెగ్స్ కారణంగా రిలాక్స్‌డ్ రైడింగ్ పొజిషన్ లభిస్తుంది.

టెక్నాలజీ కూడా ఉంది

రెబల్ 300లో గుండ్రటి TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంది. ఇందులో హోండా RoadSync కనెక్టివిటీ అందించారు. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. LED లైటింగ్ & డ్యూయల్ ఛానల్ ABS ఇతర ప్రధాన ఫీచర్లు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ

రూ.2.22 లక్షల ధరతో ఉన్న రెబల్ 300 స్టాండర్డ్ వేరియంట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ Goan Classic 350 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. Goan Classic 350 ధర చెన్నైలో రూ.2.25 లక్షల నుంచి రూ.2.28 లక్షల మధ్య ఉంది. అయితే, రెబల్ 300 E-Clutch వేరియంట్ ధర రూ.2.62 లక్షలు. ఇది Goan Classic 350 కంటే రూ.34,000 నుంచి రూ.37,000 వరకు ఎక్కువ.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget