అన్వేషించండి

కొత్త బజాజ్‌ పల్సర్ 150లో ఫీచర్లు ఎక్కువే.. కానీ పాత మోడల్‌లో ఉన్న ఈ సదుపాయాలు మిస్!

కొత్త బజాజ్ పల్సర్ 150లో కొత్త ఇంజిన్, ఫ్రేమ్, మోనోషాక్ & అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అయితే పాత మోడల్‌లో ఉన్న కొన్ని కీలక సదుపాయాలు కొత్త బైక్‌లో లేవు.

Bajaj Pulsar 150 new vs old differences: బజాజ్ పల్సర్ 150 కొత్త తరంలోకి అడుగుపెట్టింది. కంపెనీ కొత్త పల్సర్ 150లో ఇంజిన్, ఫ్రేమ్, సస్పెన్షన్‌తో పాటు ఫీచర్లను భారీగా అప్‌డేట్ చేసింది. అయితే కొత్త మోడల్‌లో అన్నీ మెరుగయ్యాయని చెప్పలేం. పాత పల్సర్ 150లో ఉన్న కొన్ని సదుపాయాలను కొత్త బైక్‌లో తొలగించారు. దీంతో కొత్త పల్సర్ 150 నిజంగా పాత మోడల్ కంటే మెరుగైనదేనా అనే ప్రశ్న వస్తోంది. కొత్త, పాత మోడళ్ల మధ్య ప్రధాన తేడాలు ఏమిటో చూద్దాం.

ఇంజిన్‌లో కీలక మార్పులు

కొత్త & పాత పల్సర్ 150 రెండింటిలోనూ 149.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. అయితే ఇంజిన్ టెక్నాలజీలో మార్పు ఉంది. పాత మోడల్‌లో ఎయిర్ కూలింగ్ ఉండేది. కొత్త బైక్‌లో ఆయిల్ కూలింగ్‌ను అందించారు.

పవర్ మాత్రం రెండు మోడళ్లలోనూ 14hpగానే ఉంది. కొత్త మోడల్‌లో ఈ పవర్ 8,000rpm వద్ద వస్తుంది & పాత మోడల్‌లో 8,500rpm వద్ద లభించేది. అంటే కొత్త బైక్‌లో గరిష్ట పవర్ 500rpm ముందుగానే వస్తుంది.

టార్క్ విషయంలో కొత్త పల్సర్ ముందంజలో ఉంది. కొత్త మోడల్ 14.1Nm టార్క్‌ను అందిస్తుంది. పాత మోడల్‌లో ఇది 13.2Nm మాత్రమే. రెండు బైక్‌లలోనూ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. మెరుగైన పవర్ టు వెయిట్ నిష్పత్తి కారణంగా కొత్త బైక్ 0-60 కిలోమీటర్ల వేగాన్ని త్వరగా అందుకుంటుందని బజాజ్ చెబుతోంది.

ఫ్రేమ్‌లో మార్పు

కొత్త పల్సర్ 150లో డ్యూయల్ క్రేడిల్ ఫ్రేమ్‌కు బదులుగా సింగిల్ క్రేడిల్ లేదా డైమండ్ టైప్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇంజిన్‌ను ఫ్రేమ్‌లో భాగంగా పనిచేసేలా రూపొందించారు. దీంతో బైక్ దృఢత్వం పెరిగి హ్యాండ్లింగ్ & స్థిరత్వం మెరుగవుతాయని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: యూత్ ఆల్-టైమ్ ఫేవరెట్‌ బజాజ్ పల్సర్ 150 కొనాలనుకుంటున్నారా? తక్కువ EMI ఆప్షన్లు, ఆఫర్ల వివరాలు మీకోసం!

ఫ్రంట్ సస్పెన్షన్ విషయంలో మాత్రం పాత మోడల్‌తోనే ప్రయోజనాలు ఉన్నాయి. పాత టాప్ వేరియంట్‌లో 37mm ఫోర్క్‌తో 130mm ట్రావెల్ ఉండేది. బేస్ వేరియంట్‌లో 31mm ఫోర్క్‌తో 135mm ట్రావెల్ ఉండేది.

కొత్త పల్సర్ 150లో మూడు వేరియంట్లకూ 33mm ఫోర్క్‌ ఇచ్చారు. దీని ట్రావెల్ 125mm. ప్రయాణంలో పెద్దగా ఇబ్బంది కలిగించే స్థాయిలో ఈ తగ్గింపు ఉండకపోవచ్చు. అయినా, పాత మోడల్‌తో పోలిస్తే ఇది తగ్గుదలే.

రియర్‌ సస్పెన్షన్‌లో మాత్రం కొత్త మోడల్ బెటర్‌గా మారింది. పాత ట్విన్ షాక్స్‌ స్థానంలో మోనోషాక్‌ తీసుకొచ్చారు. ట్రావెల్ కూడా 8mm పెరిగి 110mmకు చేరింది. దీంతో నేరుగా వెళ్లేటప్పుడు & మలుపుల్లో బైక్ స్థిరత్వం మెరుగవుతుందని బజాజ్ చెబుతోంది.

లైటింగ్‌లో మార్పులు

రెండు మోడళ్లలోనూ LED హెడ్‌లైట్ & టెయిల్ లైట్ ఉన్నాయి. అయితే కొత్త పల్సర్ 150 ఫెయిరింగ్‌ను స్వల్పంగా రీడిజైన్ చేశారు. పాత మోడల్‌లో అన్ని వేరియంట్లలో LED ఇండికేటర్లు ఉండేవి. కొత్త బైక్‌లో మాత్రం రెండు టాప్ వేరియంట్లకే ఇవి లభిస్తాయి.

హజార్డ్ లైట్లు కూడా టాప్ రెండు వేరియంట్లలో మాత్రమే ఉంటాయి. ఈ రెండు వేరియంట్లలో బెల్లీ పాన్ కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: కారు,బండి కొనేందుకు సెప్టెంబర్‌ మంచి సమయమా? దసరా ఆఫర్ల కోసం ఆగాలా?

టైర్లు, బ్రేకుల్లో పాతదే బెటర్

టైర్ల విషయంలో కొత్త పల్సర్ 150 కొంత వెనుకబడింది. కొత్త మోడల్‌లో మూడు వేరియంట్లకూ 80/100-17 ముందు & 100/90-17 వెనుక టైర్లను ఇచ్చారు.

పాత పల్సర్ 150 టాప్ వేరియంట్‌లో 90/90-17 ముందు, 120/80-17 వెనుక టైర్లు ఉండేవి. అంటే పాత టాప్ వేరియంట్‌లో పెద్ద టైర్లు లభించేవి.

బ్రేకింగ్‌లోనూ పాత టాప్ వేరియంట్‌కు స్వల్ప ప్రయోజనం ఉంది. కొత్త బైక్‌లో ముందు 260mm డిస్క్ ఉంటుంది. వెనుక బేస్ వేరియంట్‌లో 130mm డ్రమ్, మిగతా రెండు వేరియంట్లలో 230mm డిస్క్ ఉంటుంది.

పాత టాప్ వేరియంట్‌లో 280mm ఫ్రంట్ డిస్క్ ఉండేది. రెండు మోడళ్లలోనూ సింగిల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.

ఫీచర్లలో కొత్త పల్సర్‌దే పైచేయి

ఫీచర్ల విషయంలో కొత్త పల్సర్ 150 భారీగా అప్‌డేట్‌ అయింది. పాత బైక్‌లో బేస్ వేరియంట్‌కు సెమీ డిజిటల్ క్లస్టర్, టాప్ వేరియంట్‌కు నెగెటివ్ LCD క్లస్టర్ ఉండేవి. వీటి స్థానంలో కొత్త మోడల్‌లో 5 అంగుళాల LCD క్లస్టర్‌ను ఇచ్చారు. 

మిడ్ & టాప్ వేరియంట్లలో 5 అంగుళాల TFT క్లస్టర్ ఉంటుంది. మూడు వేరియంట్లలోనూ బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్‌గా లభిస్తుంది. మ్యూజిక్ కంట్రోల్, కాల్ & SMS అలర్ట్‌లు కూడా ఉన్నాయి.

TFT క్లస్టర్‌లో డ్రైవింగ్ లైసెన్స్, RC వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను సేవ్ చేసుకోవచ్చు. టాప్ వేరియంట్‌లో Google Maps మిర్రరింగ్ సౌకర్యం ఉంటుంది. మిగతా రెండు వేరియంట్లలో టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే లభిస్తుంది.

కొత్త బైక్‌లో USB Type-C పోర్ట్ కూడా ఉంది, అయితే ఇది టాప్ రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత మోడల్‌లో USB Type-A పోర్ట్ ఉండేది.

రైడింగ్ మోడ్‌లు & క్రాల్ టెక్

కొత్త పల్సర్ 150లో Road, Rain & Sport అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో సులభంగా ప్రయాణించేందుకు Crawl Techను అందించారు.

టాప్ రెండు వేరియంట్లలో ISG కూడా ఉంటుంది. ట్రాఫిక్‌లో బైక్ ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది.

ధరలోనూ పెరుగుదల

కొత్త పల్సర్ 150 ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.23 లక్షల వరకు ఉంది. పాత మోడల్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.18 లక్షల వరకు ఉండేది. అంటే కొత్త మోడల్ కనీసం రూ.4,000 పెరిగింది.

మొత్తంగా చూస్తే.. కొత్త పల్సర్ 150లో ఇంజిన్, ఫ్రేమ్, రియర్‌ సస్పెన్షన్ & ఫీచర్లలో గణనీయమైన మార్పులు ఉన్నాయి. అయితే ఫ్రంట్ ఫోర్క్ పరిమాణం, టైర్లు, కొన్ని వేరియంట్లలో LED ఇండికేటర్లు వంటి అంశాల్లో పాత మోడల్‌కే ఎడ్జ్‌ ఉంది. కాబట్టి కొత్త పల్సర్ 150 ఒక బెటర్‌ బండి అని కేవలం ఫీచర్ల ఆధారంగా మాత్రమే నిర్ణయించలేం. మీరు ఈ బండిని కొనాలనుకుంటే, టెస్ట్ రైడ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

బజాజ్‌ బైక్‌లపై దసరా ఆఫర్లు.. వేలల్లో ఆదా, పండగ ఖర్చులు వచ్చినట్లే!
దసరా వేళ బజాజ్ అదిరిపోయే ఆఫర్లు.. పల్సర్‌ బైక్‌లపై భారీగా డబ్బు ఆదా!
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Embed widget