అన్వేషించండి

Buying Car EMI: 30,000 జీతం ఉన్నవారు కారు కొనడం సాధ్యమేనా? అందుకు ఏం చేయాలి

₹30 వేల జీతం ఉన్న వారు కూడా కారు కొనుగోలు చేయవచ్చు. అయితే డౌన్ పేమెంట్ కోసం నగదు ఏర్పాటు చేసుకుని, EMI, బడ్జెట్ ప్లానింగ్‌తో కారు కొని దర్జాగా తిరగవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ₹30,000 జీతంతో సరైన ప్రణాళికతో కారు కొనుగోలు సాధ్యం.
  • 20-4-10 నియమం ప్రకారం, EMI జీతంలో 10% మించకూడదు.
  • ఇంటి ఖర్చులతో పాటు కారు నిర్వహణ వ్యయాలు పరిగణించాలి.
  • వడ్డీ రేట్లు పోల్చి ఎక్కువ డౌన్‌పేమెంట్ చేయడం లాభదాయకం.

చాలామంది ఉద్యోగస్తులకు ఇల్లు కొనడం, లేక కట్టుకున్న తర్వాత మరొక కోరిక కారు కొనాలని ఉంటుంది. దీని కోసం సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. ఒకవేళ ఇల్లు లేకపోయినా ఫ్యామిలీ ప్రయాణాల కోసం కారు ఉండాలని భావిస్తారు. నెలకూ రూ.30 వేలు సంపాదించే వ్యక్తి ఆ జీతంతో కారు కొనడం సాధ్యమేనా అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం అవును అని చెప్పవచ్చు. కాకపోతే సరైన ప్లానింగ్, సరైన లెక్కలతో నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు EMIలతో కార్ లోన్లు ఇస్తున్నాయి. దీనివల్ల ఒకేసారి మొత్తం నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే కారు సొంతం చేసుకోవచ్చు. మన ఆదాయంతో పాటు ఖర్చులను సరైన రీతిలో అంచనా వేసి అనుకున్నది దక్కించుకోవడం పెద్ద సమస్య కాదు. కారు కొనడానికి సంబంధించిన పూర్తి అవకాశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత EMI చెల్లించడం

ఫైనాన్స్ నిపుణులు 20- 4- 10 అనే ఒక సాధారణ రూల్ చెబుతారు. ఈ లెక్క ప్రకారం, కారు కొనుగోలు చేయడానికి కనీసం 20 శాతం డబ్బు డౌన్ పేమెంట్‌గా మనం చెల్లించాలి. లోన్‌ను గరిష్టంగా 4 సంవత్సరాలలో (48 నెలలు) తీర్చివేయడానికి ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే 5 ఏళ్ల టర్మ్ ఎంచుకోవాలి. ప్రతి నెలా చెల్లించే EMI మీ మొత్తం జీతంలో 10 శాతానికి మించకుండా చూసుకోవాలని సూచించారు.

ఒకవేళ ఒకరి నెల జీతం ₹30,000 ఉంటే, ఈ లెక్కన నెలకు EMI సుమారు 5,000 నుండి ₹7,000 వరకు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ₹4 లక్షల నుండి ₹6 లక్షల ప్రారంభ ధరలో అనేక మంచి చిన్న, బడ్జెట్ కార్లు ఉన్నాయి. ఈ కార్లు మీ EMIకి సులభంగా లభిస్తాయి. సరైన డౌన్ పేమెంట్ చేసి లోన్ తీసుకుంటే, 30 వేల రూపాయల జీతం ఉన్న వ్యక్తి కూడా ప్లాన్ చేసి ప్రతి నెలా వాయిదాలను సులబంగా చెల్లించవచ్చు.

Also Read: రూ.10 లక్షల్లోపు పాపులర్‌ సెడాన్లు - మారుతి డిజైర్, హోండా అమేజ్ టాప్ వేరియంట్ల కంపారిజన్‌

ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి?

కారు కొనేముందు కేవలం EMI లెక్కలు చెక్ చేస్తే సరిపోదు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను కస్టమర్లు గుర్తుంచుకోవాలి. మొదటగా, EMI పోను ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, మంచినీటి బిల్లులు, నిత్యావసర ఖర్చులు, ఇతర ఇంటి ఖర్చులు ఇబ్బంది లేకుండా గడిచేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది కాకుండా కారు కొన్న తర్వాత పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చు, కార్ సర్వీసింగ్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులకు డబ్బులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

కేవలం ఫ్యామిలీ జర్నీ కోసం తీసుకున్న కారు అయితే రెగ్యూలర్ పెట్రోల్, డీజిల్ ఖర్చుల ఉండవు. కాబట్టి వీటి కోసం ముందుగానే బడ్జెట్ ఉంచాలి. లోన్ తీసుకునే ముందు పలు బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి. దీనివల్ల తక్కువ వడ్డీకే సరైన కారు లోన్ లభిస్తుంది. అలాగే వీలైనంత ఎక్కువ మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించడం వల్ల లోన్ మొత్తంతో పాటు చెల్లించే వడ్డీ, EMI రెండూ తగ్గుతాయి.

Also Read: రూ.50,000 డౌన్ పేమెంట్ చేసి Maruti Swift కారును తీసుకెళ్లండి, EMI పూర్తి వివరాలు

Frequently Asked Questions

నెలకు ₹30,000 జీతం ఉన్నవారు కారు కొనగలరా?

అవును, సరైన ప్రణాళిక, లెక్కలతో ఇది సాధ్యమే. బ్యాంకులు EMIలతో కార్ లోన్లు అందిస్తాయి, దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

కారు కొనుగోలుకు '20-4-10' నియమం ఏమిటి?

కనీసం 20% డౌన్ పేమెంట్ చెల్లించాలి. లోన్‌ను గరిష్టంగా 4 నుండి 5 సంవత్సరాలలో తీర్చాలి. నెలవారీ EMI జీతంలో 10 శాతానికి మించకూడదు.

కారు కొనేటప్పుడు EMI కాకుండా ఇంకే ఖర్చులను పరిగణించాలి?

ఇల్లు అద్దె, బిల్లులు, నిత్యావసరాలు వంటి సాధారణ ఖర్చులు కాకుండా, పెట్రోల్/డీజిల్, సర్వీసింగ్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఖర్చులను కూడా పరిగణించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget