అన్వేషించండి

రూ.50,000 డౌన్ పేమెంట్ చేసి Maruti Swift కారును తీసుకెళ్లండి, EMI పూర్తి వివరాలు

మారుతి స్విఫ్ట్‌ను ₹50,000 డౌన్ పేమెంట్‌తో మీ సొంతం చేసుకోండి. బేస్ మోడల్ LXi ఆన్ రోడ్ ధర, లోన్ మొత్తం, వడ్డీ రేటు ద4, 5, 6 ఏళ్ల వరకు EMI పూర్తి లెక్కలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 50,000 డౌన్‌పేమెంట్‌తో మారుతి స్విఫ్ట్ కారు సులభంగా పొందవచ్చు.
  • ఆన్-రోడ్ ధర ₹7.06 లక్షలు, 6 లక్షల లోన్‌కు EMI వివరాలు.
  • LXi మోడల్ 9% వడ్డీతో, 24.8kmpl మైలేజ్ అందిస్తుంది.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Maruti Swift down payment Rs 50000 emi calculator loan details here

భారత్‌లో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న కంపెనీలలో మారుతి సుజుకి కంపెనీ ఒకటి. అందుకే కంపెనీకి చెందిన అన్ని కార్లూ సూపర్ హిట్ అయ్యాయి. మారుతి కంపెనీకి చెందిన ఒక హ్యాచ్‌బ్యాక్ కారు గురించి ఇక్కడ తెలుసుకోండి. మారుతి సుజుకి స్విఫ్ట్ కారు కస్టమర్లకు ఫస్ట్ ప్రియారిటీగా చూసే హ్యాచ్‌బ్యాక్ కారు. తన స్పోర్టీ లుక్, అద్భుతమైన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ కారణంగా ఈ కారు ఏళ్ల తరబడి విక్రయాల్లో దూసుకెళ్తోంది. మీరు మీ కుటుంబం కోసం ఒక కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈ విషయాలపై ఓ లుక్కేయండి. 

మీరు స్విఫ్ట్ కారు కొనడానికి ఒకేసారి మొత్తం అమౌంట్ ఒకేసారి చెల్లించకపోయినా కొనవచ్చు. ఫైనాన్స్ ప్లాన్ ద్వారా మొదట కొంత మొత్తం చెల్లించి కారు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కేవలం 50,000 డౌన్ పేమెంట్ చేసి కొత్త కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. స్విఫ్ట్ బేస్ మోడల్ LXi ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹5.80 లక్షలు. పన్నులు, ఇన్సూరెన్స్ కలిపి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు ₹7.06 లక్షల వరకు ఉంటుంది. కేవలం 50 వేల డౌన్ పేమెంట్ చేసhso.. లోన్ ద్వారా తీసుకున్న మొత్తానికి నెలవారీ EMI ఎంత అవుతుంది తెలుసుకోవాలి. 

₹50,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు

మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ LXiని కొనేందుకు ₹50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన ఆన్-రోడ్ మొత్తం అంటే సుమారు రూ.6 లక్షల వరకు మీరు కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు కార్ లోన్లపై ఏడాదికి 9 నుండచి 9.5% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఈ వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్,  ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.

రూ.6 లక్షల లోన్‌పై నెలవారీ EMI వివరాలు 

మీరు తీసుకున్న 6 లక్షల లోన్‌కు వడ్డీ రేటు ఏడాదికి 9% ఉంటే, మీరు ప్రతి నెల EMI వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

4 ఏళ్లు (48 నెలలు) అయితే ప్రతి నెలా EMI ₹14,931 చెల్లించాలి. చెల్లించే మొత్తం వడ్డీ: సుమారు ₹1.16 లక్షలు

5 ఏళ్లు (60 నెలలు) అయితే ప్రతి నెలా EMI ₹12,455 కట్టాలి. చెల్లించే మొత్తం వడ్డీ: సుమారు ₹1.47 లక్షలు అవుతుంది.

6 ఏళ్లు (72 నెలలు): ప్రతి నెలా EMI ₹10,816 చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ సుమారు 1.78 లక్షలు వరకు వడ్డీ చెల్లిస్తారు.

అయితే, లోన్ కాలపరిమితి పెరగడం ఎక్కువ కాలం వడ్డీ చెల్లిస్తారు. మీ నెలవారీ EMI తగ్గి, లోన్ మొత్తాన్ని నెమ్మదిగా సులభంగా తీర్చవచ్చు.

బేస్ మోడల్‌లో లభించే ఫీచర్లు, మైలేజ్

మారుతి స్విఫ్ట్ LXi లో పలు ముఖ్యమైన ఫీచర్లు, సేఫ్టీ లభిస్తాయి. ఇందులో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది లీటరుకు సుమారు 24.8 కిలోమీటర్ల  మైలేజ్‌ ఇస్తుంది. ఇక సేఫ్టీ విషయానికొస్తే బేస్ మోడల్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇచ్చారు. 

 

Frequently Asked Questions

మారుతి సుజుకి స్విఫ్ట్ బేస్ మోడల్ ధర ఎంత? దానికి ఎంత డౌన్ పేమెంట్ చేయాలి?

స్విఫ్ట్ LXi ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹5.80 లక్షలు, హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ₹7.06 లక్షలు. మీరు ₹50,000 డౌన్ పేమెంట్‌తో కారును పొందవచ్చు.

₹50,000 డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత స్విఫ్ట్ కారుకు నెలవారీ EMI ఎంత అవుతుంది?

₹50,000 డౌన్ పేమెంట్‌తో, సుమారు ₹6 లక్షల లోన్ తీసుకోవాలి. 9% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలపరిమితికి, EMI ₹14,931 చెల్లించాలి.

మారుతి స్విఫ్ట్ బేస్ మోడల్ LXiలో ఎలాంటి ఫీచర్లు, మైలేజ్ లభిస్తాయి?

LXi మోడల్ 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది సుమారు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కార్ లోన్ కాలపరిమితి పెరిగితే EMI మరియు మొత్తం వడ్డీపై దాని ప్రభావం ఏమిటి?

లోన్ కాలపరిమితి పెరిగితే, నెలవారీ EMI తగ్గుతుంది. ఇది చెల్లింపులను సులభతరం చేస్తుంది. అయితే, చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget