అన్వేషించండి

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌తో Maruti WagonR Automatic కొంటే చెల్లించాల్సిన EMI ఎంత

మీరు నగరంలో నడపడానికి, తక్కువ బడ్జెట్‌లో వీలుగా ఉండే మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తుంటే Maruti WagonR ఆటోమేటిక్ ఒక అద్భుతమైన ఆప్షన్ కాగలదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ₹7.31 లక్షలు; EMI నెలకు ₹11,374.

తక్కువ బడ్జెట్‌లో సిటీలో నడిపేందుకు చిన్న ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నారా.. భారత మార్కెట్‌లో చాలాకాలం నుంచి హ్యాచ్‌బ్యాక్ కారు Maruti WagonR బెస్ట్ ఆప్షన్‌ కాగలదు. దాని  క్యాబిన్, ఈజీ డ్రైవింగ్, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కొనడానికి ప్రధాన కారణాలు. ఈ కారులో కంపెనీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ అందిస్తోంది. రోజువారీ ట్రాఫిక్‌లో క్లచ్, గేర్లు మార్చే నొప్పులు వద్దనుకునే వారు ఆటోమేటిక్ వేరియంట్‌ తీసుకోవచ్చు.

మీరు కనుక వాగన్ ఆర్ తీసుకోవాలని భావిస్తే మొత్తం డబ్బులు చెల్లించకుండానే డౌన్ పేమెంట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. అందుకుకోసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి ఆటోమేటిక్ వేరియంట్‌ను ఫైనాన్స్ ద్వారా కొనవచ్చు. ప్రతి నెలా మీరు ఎంత EMI చెల్లించాలి ఫైనాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Maruti WagonR ధర, నెలవారీ EMI చెల్లింపులు 

Maruti Wagon R పలు పెట్రోల్, CNG వేరియంట్లలో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్‌లో 1.0 లీటర్, 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు వస్తున్నాయి. కొన్ని వేరియంట్లలో AGS (ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్) ట్రాన్స్‌మిషన్ ఇస్తున్నారు. రాష్ట్రం, ఆయా నగరాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు. మారుతి Wagon R ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. మీరు హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలంటే ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7.21 లక్షలు అవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారణంగా దీని ధర మ్యాన్యువల్ మోడల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ వద్ద కారు కొనేందుకు పూర్తి నగదు లేకపోతే, లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

Also Read: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Maruti WagonR ఆటోమేటిక్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే మిగతా రూ.6.31 లక్షల మొత్తాన్ని బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవాలి. 

మీరు 9 శాతం వడ్డీ రేటుతో 6 సంవత్సరాల (84 నెలలు) కాలపరిమితికి లోన్ తీసుకుంటే, ప్రతి నెలా  EMI రూ. 11,374 చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్లు (60 నెలలు) అయితే ప్రతినెలా ₹13,098 కట్టాలి. అదే వడ్దీ రేటుతో 4 ఏళ్లు (48 నెలలు) కాలానికిగానూ ప్రతినెలా EMI రూ.15,701 చెల్లించాలి. 

కారు ఫీచర్లు, మైలేజ్

రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణించే వారికి Wagon R ఆటోమేటిక్ మోడల్ ఉపయోగపడుతుంది. ట్రాఫిక్‌లో పదే పదే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో క్లచ్ నొక్కడం కష్టం. అదే ఆటోమేటిక్ (AGS) మోడల్‌లో ఈ సమస్య ఉండదు.  Wagon R పొడవైన బాక్సీ డిజైన్ వల్ల లోపల అధిక స్థలం లభిస్తుంది. మైలేజ్ ఈ కారుకు ప్లస్ పాయింట్. పెట్రోల్ వేరియంట్‌తో పాటు CNG ఆప్షన్ కూడా ఉన్నప్పటికీ, ఆటోమేటిక్ మోడల్ ప్రధానంగా పెట్రోల్ వేరియంట్లలోనే అందుబాటులో ఉంది. కారు కొనేముందు దాని ధరతో పాటు డౌన్ పేమెంట్, నెలవారి చెల్లించాల్సిన ఈఎంఐ వివరాలు, మైలేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 

Frequently Asked Questions

రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ తర్వాత EMI వివరాలు ఎలా ఉంటాయి?

9% వడ్డీతో 6 సంవత్సరాలకు నెలకు రూ. 11,374, 5 సంవత్సరాలకు రూ. 13,098, మరియు 4 సంవత్సరాలకు రూ. 15,701 EMI చెల్లించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget