అన్వేషించండి

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి

టాటా టియాగో CNGని హ్యాచ్‌బ్యాక్‌గా డిజైన్ చేశారు. నగరంలోని రద్దీ రోడ్లు, ఇరుకైన వీధుల్లో సైతం ఈ కారు డ్రైవింగ్ చేయడం తేలిక అనిపిస్తుంది. కారు EMI ప్లాన్‌ను తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో తక్కువ బడ్జెట్‌లో సిటీ నడపడానికి మంచి ఎంపిక.
  • కేవలం రూ.20 వేల డౌన్‌పేమెంట్‌తో EMIలో కారు పొందవచ్చు.
  • ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
  • పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌లు మంచి మైలేజీని అందిస్తాయి.

తక్కువ బడ్జెట్‌లో సిటీలో నడపడానికి సెట్ అయ్యే కార్ కోసం చూస్తున్నారా... అలాగే ఫీచర్లు, సేఫ్టీ విషయంలో కూడా మెరుగ్గా ఉండాలనుకుంటే మాత్రం మీకు టాటా టియాగో (Tata Tiago) ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది. ఈ కార్ ఆటో మార్కెట్‌లో విక్రయాల్లో దూసుకెళ్తోంది. సరైన బడ్జెట్ ధర, కాంపాక్ట్ సైజ్, మంచి ఫీచర్లతో కస్టమర్ల ఆదరణ పొందింది. 

ఈ కారును కొనుగోలు చేయడానికి ఫుల్ పేమెంట్ మీ వద్ద లేదని ఎలాంటి ఆందోళన చెందవద్దు. కారు మొత్తం ధరను ఒకేసారి చెల్లించే బదులు లోన్ తీసుకుని చెల్లించి ప్రతినెలా EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కస్టమర్ కేవలం రూ. 20 వేల డౌన్ పేమెంట్ చేస్తే ప్రతినెల EMI ఎంత చెల్లించాలి లెక్కల వివరాలు తెలుసుకోండి. 

Tiago CNG ఆన్-రోడ్ ధర ఎంత 

Tata Tiago CNG హైదరాబాద్‌లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.79 లక్షలుగా ఉంది.  కారు ఆన్-రోడ్ ధర సిటీ, RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీల బట్టి పెరుగుతుంది. ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6.33 లక్షలు చెల్లించాలి.

ఒకవేళ మీరు ఈ CNG కారును కొనుగోలు చేయడానికి కేవలం రూ. 20 వేలు డౌన్ పేమెంట్ చేస్తే, 9.5 శాతం వడ్డీ రేటుతో 6,12,868 రూపాయలకుగానూ 4 సంవత్సరాలకి ప్రతినెల రూ. 15,397 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలకు రూ. 12,871, అలాగే 6 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI మొత్తం రూ. 11,200 చెల్లించాలి.

Also Read: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

మీ నెలవారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా మీరు ఈఎంఐ తగ్గాలని భావిస్తే ఈ కారును 7 సంవత్సరాల కాలానికి లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు 9.5 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 10,017 రూపాయల్ని EMI కట్టాలి. 

EMI కి సంబంధించిన ఈ గణాంకాలు ఒక ఉదాహరణగా మాత్రమే ఇవ్వబడ్డాయని మీరు తెలుసుకోవడం ముఖ్యం. కారు యొక్క అసలు EMI అనేది బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలవ్యవధి, ప్రాసెసింగ్ ఫీజు, కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ మరియు కారు యొక్క ఆన్-రోడ్ ధర ప్రాతిపదికన మారవచ్చు. అందువల్ల కారు కొనుగోలు చేయడానికి ముందు బ్యాంక్ మరియు డీలర్ నుండి ఫైనల్ లోన్ మొత్తం మరియు EMI వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఇటువంటి పరిస్థితుల్లో మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, మీరు ఒక కాంపాక్ట్ ఫ్యామిలీ కారును EMI లో కొనుగోలు చేయాలనుకుంటే, Tata Tiago పై ఉన్న ఈ ఫైనాన్స్ ప్లాన్ మీకు ఒక ప్రారంభ ఉదాహరణగా ఉపయోగపడుతుంది.

కారు ఫీచర్లు, కేబిన్

Tata Tiagoని కంపెనీ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా తీసుకొచ్చింది. దీని సైజ్ వల్ల సిటీలోని రద్దీ రోడ్లు, ఇరుకైన వీధుల్లోనూ కారు నడపడం చాలా సులభం. కారు డిజైన్‌లో స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, ఆకర్షణీయమైన టెయిల్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. దీనివల్ల సాధారణ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే కాస్త ప్రీమియం లుక్ వస్తుంది.

కేబిన్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto, Apple CarPlay, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కారులో 5 సీటింగ్ కెపాసిటీ ఉంది. చిన్న కుటుంబాలకు రోజువారీ జర్నీకి, లాంగ్ జర్నీలకు కూడా ఉపయోగపడుతుంది.

Tata Tiagoలో సేఫ్టీపై కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటి ఫీచర్లు కూడా ఇచ్చారు. ఏ కారుకైనా సేఫ్టీ ఫీచర్లు వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటాయి. కొనే ముందు ఎంచుకున్న వేరియంట్ ఫీచర్ లిస్ట్‌ను చెక్ చేయాలి. 

Tata Tiagoలో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీనిని 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో కొనవచ్చు. ఇవే కాకుండా కంపెనీ CNG వేరియంట్‌ను తెచ్చింది. పెట్రోల్ మోడల్ లీటరుకు దాదాపు 19-20 కిలోమీటర్లు మైలేజీ, CNG మోడల్ మైలేజ్ 1 కేజీకి సుమారు 26-28 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంది. 

Frequently Asked Questions

టాటా టియాగో సిటీ డ్రైవింగ్ కు ఎందుకు మంచి ఆప్షన్?

ఇది తక్కువ బడ్జెట్‌లో లభిస్తుంది, కాంపాక్ట్ సైజులో ఉండి సిటీలో నడపడం సులువు. మంచి ఫీచర్లు, భద్రత కూడా అందిస్తుంది.

టాటా టియాగో CNG ఆన్-రోడ్ ధర ఎంత మరియు రూ. 20 వేల డౌన్ పేమెంట్ తో EMI వివరాలు ఏమిటి?

హైదరాబాద్‌లో టాటా టియాగో CNG ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6.33 లక్షలు. రూ. 20,000 డౌన్ పేమెంట్ చేస్తే, 7 సంవత్సరాలకు రూ. 10,017 EMI చెల్లించవచ్చు.

టాటా టియాగోలో ఏయే ప్రధాన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటివి లభిస్తాయి.

టాటా టియాగో ఏ ఇంజిన్‌తో వస్తుంది మరియు దాని మైలేజ్ ఎంత?

ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడల్ 19-20 కి.మీ/లీ, CNG మోడల్ 26-28 కి.మీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget