అన్వేషించండి

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

KTM 390 Duke ఇప్పుడు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 349cc స్టాండర్డ్ మోడల్ ధర రూ.2.84 లక్షలు కాగా, 398cc R వేరియంట్ ధర రూ.3.45 లక్షలు.

KTM 390 Duke Price And Features Telugu: పెర్ఫార్మెన్స్ బైకుల్లో KTM 390 Duke తీరే వేరు. 2013లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బండి యూత్‌ని ఆకట్టుకుంటూనే ఉంది. మంచి పెర్ఫార్మెన్స్‌ & స్పోర్టీ డిజైన్‌తో 390 Duke ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే... ప్రస్తుతం 390 Duke విషయంలో ఓ ఆసక్తికరమైన మార్పు వచ్చింది. KTM ఇండియా ఈ బైక్‌ను రెండు వేరియంట్లలో అమ్ముతోంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఇంజిన్ సామర్థ్యం & ధరలో మాత్రం పెద్ద తేడా ఉంది.

KTM 390 Duke రెండు వేరియంట్లు - స్టాండర్డ్ 390 Duke & 390 Duke R. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా రూ.2.84 లక్షలు & రూ.3.45 లక్షలు.

స్టాండర్డ్ 390 Duke

స్టాండర్డ్ వేరియంట్‌లో 349cc ఇంజిన్‌ ఉంటుంది. పాత 398cc ఇంజిన్‌తో పోలిస్తే ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గించారు. ఇందుకోసం స్ట్రోక్‌ను తగ్గించగా, బోర్‌ను మాత్రం అలాగే ఉంచారు. ఈ ఇంజిన్ 41.5hp గరిష్ట పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట టార్క్ 33.5Nm. 

ఇంజిన్ సామర్థ్యం తగ్గించడానికి ప్రధాన కారణాల్లో GST రేటు కూడా ఒకటి. ఈ మోడల్‌పై 18 శాతం GST వర్తిస్తుంది. తక్కువ పన్ను రేటు ప్రయోజనంతో స్టాండర్డ్ 390 Duke ధరను రూ.2.84 లక్షలుగా నిర్ణయించారు.

డిజైన్ పరంగా కూడా ఈ వేరియంట్‌కు ప్రత్యేక రంగులు & గ్రాఫిక్స్ ఉన్నాయి. ఆరెంజ్, బ్లాక్ & బ్లూ రంగుల్లో దీన్ని ఎంచుకోవచ్చు. ట్యాంక్ & బాడీ ప్యానెళ్లకు ఈ రంగులు అందిస్తారు. ఫ్రేమ్ & వీల్స్ మాత్రం బ్లాక్ రంగులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?

390 Duke R

390 Duke Rలో 398cc ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజిన్ 46hp పవర్‌ను, 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే పవర్ & టార్క్ రెండూ ఎక్కువ. ఈ వేరియంట్‌కు 40 శాతం GST వర్తిస్తుంది. అందుకే ధర కూడా ఎక్కువగా ఉంది.

స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే 390 Duke Rను గుర్తించడం కూడా సులభమే. ఇందులో ఆరెంజ్ రంగు ఫ్రేమ్ & వీల్స్ ఉంటాయి. సైడ్ ప్యానెళ్లపై ప్రత్యేకంగా R గుర్తు కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?

రెండు వేరియంట్లలో ఏది తీసుకోవాలి?

రెండు వేరియంట్ల మధ్య ప్రధాన తేడా ఇంజిన్ సామర్థ్యం, పవర్, టార్క్ & ధరలోనే ఉంది. స్టాండర్డ్ 390 Dukeలో 349cc ఇంజిన్‌తో 41.5hp పవర్ లభిస్తుంది. దీని ధర రూ.2.84 లక్షలు.

390 Duke Rలో 398cc ఇంజిన్, 46hp పవర్ & 39Nm టార్క్ ఉన్నాయి. దీని ధర రూ.3.45 లక్షలు.

ఇక.. బాడీ ప్యానెళ్లు, డిజైన్, ఛాసిస్ & ఫీచర్ల విషయంలో రెండు వేరియంట్లు చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పవర్ కోరుకునే రైడర్లు 390 Duke R ను పరిశీలించవచ్చు. ధర తగ్గించాలనుకునేవాళ్లు స్టాండర్డ్ 390 Duke వైపు చూడవచ్చు. కొనేముందు ఈ రెండు వేరియంట్లను టెస్ట్‌ డ్రైవ్‌ చేసి సరైన నిర్ణయం తీసుకోండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ
నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget