అన్వేషించండి

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ విడుదలైంది. 360 డిగ్రీ కెమెరా, వెనుక సీట్లకు మసాజ్‌ ఫీచర్‌, కొత్త 8AT గేర్‌బాక్స్‌ సహా పలు అప్‌డేట్స్‌తో వచ్చింది.

2026 Skoda Slavia facelift Price And Features Telugu: స్కోడా, కొన్నాళ్లుగా టీజ్‌ చేస్తున్న 2026 స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను ఎట్టకేలకు ఆవిష్కరించింది. మిడ్‌లైఫ్‌ అప్‌డేట్‌లో భాగంగా ఈ సెడాన్‌కు పలు కొత్త మార్పులు చేసింది. డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు కొత్త ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా 1.0 TSI పెట్రోల్‌ ఇంజిన్‌కు కొత్త ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను తీసుకొచ్చింది.

కొత్త స్లావియా కోసం బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ధరలను అక్టోబర్‌ మొదటి వారంలో ప్రకటిస్తారు. డెలివరీలు ఈ పండుగ సీజన్‌లోనే ప్రారంభమవుతాయి.

కొత్త స్లావియా బయటి డిజైన్‌ ఎలా ఉంది?
ఫేస్‌లిఫ్ట్‌ అయినప్పటికీ, కారు మొత్తం ఆకారం దాదాపుగా అలాగే ఉంది. అయితే ముందు భాగంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. హెడ్‌ల్యాంప్స్‌, LED డీఆర్‌ఎల్‌ డిజైన్‌, గ్రిల్‌, బంపర్‌ గ్రిల్‌, ఎయిర్‌ డ్యామ్‌లో మార్పులు చేశారు. అల్లాయ్‌ వీల్స్‌ డిజైన్‌ను కూడా రిఫ్రెష్‌ చేశారు.

కారు వెనుక భాగంలో కూడా కీలక మార్పులు ఉన్నాయి. స్కోడా కుషాక్‌ తరహాలో సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లు వచ్చాయి. టెయిల్‌లైట్ల మధ్య కొత్త ట్రిమ్‌ ఇచ్చి, ఇందులో ‘SKODA’ అక్షరాలను పేర్చారు.

కొత్త రంగులు 
ఆర్కిటిక్‌ సిల్వర్‌, కాపుచినో బేజ్‌ వంటి రంగులు కొత్తగా వచ్చాయి. అయితే కాపుచినో బేజ్‌ రంగు కార్ల డెలివరీలు డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతాయి. షిమ్లా గ్రీన్‌, బ్రిలియంట్‌ సిల్వర్‌, క్యాండీ వైట్‌, కార్బన్‌ స్టీల్‌, స్టీల్‌ గ్రే, లావా బ్లూ, చెర్రీ రెడ్‌, డీప్‌ బ్లాక్‌ రంగులు కూడా కొనసాగుతాయి.

ఇది కూడా చదవండి: టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?

ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు
క్యాబిన్‌ లేఅవుట్‌ పెద్దగా మారలేదు. అయితే ఫీచర్ల విషయంలో స్లావియాకు మంచి అప్‌డేట్‌ లభించింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ను అందించారు. కుషాక్‌లో ఉన్న తరహా ఫీచర్‌ను ఇప్పుడు స్లావియాలోనూ తీసుకొచ్చారు.

ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ పరిమాణం 10 అంగుళాల నుంచి 10.1 అంగుళాలకు పెరిగింది. డ్రైవర్‌ డిస్‌ప్లే కూడా 8 అంగుళాల నుంచి 10.25 అంగుళాలకు చేరింది. రెండు స్క్రీన్లలోనూ కొత్త గ్రాఫిక్స్‌, అదనపు ఫీచర్లు ఉన్నాయి.

మరో ముఖ్యమైన మార్పు 360 డిగ్రీ కెమెరా. ఇప్పటివరకు ఉన్న వెనుక కెమెరా స్థానంలో కొత్త 360 డిగ్రీ కెమెరాను ఇచ్చారు. ఎయిర్‌ కండిషనింగ్‌ పనితీరు మెరుగుపడేందుకు కొత్త వేరియబుల్‌ జియోమెట్రీ కంప్రెసర్‌ను కూడా అందించారు. అయితే ADAS ఫీచర్లు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఇది కూడా చదవండి: BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌లో మార్పు
2026 స్లావియాలో ఇప్పటికే ఉన్న 115hp 1.0 TSI, 150hp 1.5 TSI టర్బో పెట్రోల్‌ ఇంజిన్లు కొనసాగుతాయి. 1.0 TSI ఇంజిన్‌కు 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. 1.5 TSI ఇంజిన్‌తో 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కొనసాగుతుంది.

1.0 TSI ఆటోమేటిక్‌ వెర్షన్‌లో కీలక మార్పు చేశారు. పాత 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ స్థానంలో కొత్త 8 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ గేర్‌బాక్స్‌ను తీసుకొచ్చారు. దీంతో స్లావియా డ్రైవింగ్‌ అనుభవం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం విక్రయిస్తున్న స్లావియా ధర రూ.10 లక్షల నుంచి రూ.18.19 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్‌తో ధరలు పెరిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా రూ.85,000 వరకు పెంపు ఉండొచ్చని అంచనా.

కొత్త ఫీచర్లు & కొత్త 8AT గేర్‌బాక్స్‌తో స్లావియాను మరింత ఆకర్షణీయంగా మార్చింది స్కోడా. ఈ కారు.. Hyundai Verna, Honda City కి ప్రధాన పోటీగా కొనసాగనుంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget