అన్వేషించండి

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి

Renault Kwid EMI Calculator: మీరు కొత్త రెనో క్విడ్ కొనాలని భావిస్తున్నారా.. అయితే బేస్ వేరియంట్ హైదరాబాద్ ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్, నెలవారీ ఈఎమ్‌ఐ (EMI) లెక్కలను ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రెనాల్ట్ క్విడ్ ఆన్-రోడ్ ధర సుమారు 5.41 లక్షలు.
  • నాలుగు లక్షల లోన్‌కు ఐదేళ్లకు 8,660 EMI.
  • సుదీర్ఘ లోన్‌కు EMI తక్కువ, వడ్డీ భారం ఎక్కువ.
  • లోన్ వడ్డీ రేట్లు, డీలర్ ఆఫర్లు తప్పక పోల్చండి.

Renault Kwid EMI Calculator: భారత ఆటో మార్కెట్లో బడ్జెట్ కార్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే, ప్రజలు ఇప్పటికీ తక్కువ బడ్జెట్‌లో లభించే ఒక మంచి కారు కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే రెనాల్ట్ క్విడ్ కారు రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్విడ్ డిమాండ్ పెరుగుతోంది. SUV తరహా స్పోర్టీ డిజైన్, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ సహా అడ్వాన్స్డ్ ఫీచర్ల కారణంగా ఈ కారు కస్టమర్లలో ప్రజాదరణ పొందింది.

కారు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది ఎక్స్-షోరూమ్ ధరను మాత్రమే చూస్తారు. అసలు లెక్క ఆన్-రోడ్ ధరతో పాటు డౌన్ పేమెంట్, ప్రతి నెలా చెల్లించే EMI లపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకేసారి పూర్తిగా మనీ చెల్లించకుండా లోన్ ద్వారా కారును తీసుకోవాలనుకుంటే, సరియైన బడ్జెట్ ప్లానింగ్ అవసరం. క్విడ్ బేస్ మోడల్ కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు చెల్లించాలి, ప్రతి నెలా ఈఎంఐ చెల్లింపు వివరాలు అర్థం చేసుకుందాం.

రెనో క్విడ్ ఆన్-రోడ్ ధర ఎంత 

రెనాల్ట్ క్విడ్ బేస్ వేరియంట్ హైదరాబాద్‌లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 4.53 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీనికి రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్,ఇతర ఛార్జీలు, వివిధ రాష్ట్రాలను బట్టి దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 5.41 లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీ కారు మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 5.41 లక్షలు అనుకుందాం.

మీరు దాదాపు రూ. 1.33 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే, మిగిలిన దాదాపు రూ. 4 లక్షలకు కారు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ మొత్తాన్ని మరికొంత పెంచితే, ఈఎమ్‌ఐ భారం ఇంకా తగ్గుతుంది.

Also Read: కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

నెలవారీ EMI ఎంత అవుతుంది?

మీరు తీసుకునే రూ. 4 లక్షల కారు లోన్‌ను 5 సంవత్సరాల వ్యవధికి, బ్యాంక్ 10% వడ్డీ రేటుతో ఇస్తే.. ఈ లెక్కన మీరు ప్రతి నెలా దాదాపు రూ. 8,660 ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ 5 సంవత్సరాలలో మీరు బ్యాంకుకు వడ్డీ రూపంలో మొత్తం దాదాపు లక్ష వరకు చెల్లిస్తారు. తమ లోన్‌ను త్వరగా పూర్తి చేసి, బ్యాంకుకు తక్కువ వడ్డీ చెల్లించాలనుకునే వారికి ఈ ఆప్షన్ సరిపోతుంది. మీ నెలవారీ ఆదాయం అధికంగా ఉంటే 5 సంవత్సరాల లోన్ టర్మ్ ఎంచుకోవడం మంచిది. 

7 సంవత్సరాలకు ఈఎమ్‌ఐ ఎంత?

మీరు ప్రతి నెలా బడ్జెట్‌ను మరీ టైట్ చేసుకోకుండా ఇంకా చౌకగా మార్చుకోవాలనుకుంటే, 7 సంవత్సరాలకు లోన్ తీసుకోవాలి. రూ. 4.60 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీ రేటు చొప్పున 7 సంవత్సరాలు నెలవారీ ఈఎమ్‌ఐ కేవలం రూ. 7,400 అవుతుంది. నెలవారీ వాయిదా చిన్నదైనప్పటికీ, సుదీర్ఘకాలంలో మీరు కాస్త ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని గ్రహించాలి. 

ఈ విషయాలు గుర్తుంచుకోండి

రెనో క్విడ్‌ను ఈఎమ్‌ఐపై ఇంటికి తీసుకోవడానికి ముందు కొన్ని విషయాలను చెక్ చేయాలి. ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర ఒకటి కాదు. ఆన్ రోడ్ ధరతో పాటు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు కంపేర్ చేసుకోవాలి. మంచి సిబిల్ (CIBIL) స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తాయి.

Also Read: యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?

మీ డీలర్‌షిప్ వద్ద ఉన్న డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ల గురించి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఈ ఆఫర్ల వల్ల ఆన్-రోడ్ ధర మరో రూ. 15,000 నుండి 20,000 వరకు తగ్గవచ్చు. 

Frequently Asked Questions

రెనాల్ట్ క్విడ్ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో రెనాల్ట్ క్విడ్ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 5.41 లక్షలు. ఇందులో రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు ఉంటాయి.

రూ. 4 లక్షల లోన్‌కు 5 సంవత్సరాల పాటు రెనాల్ట్ క్విడ్ నెలవారీ ఈఎంఐ ఎంత అవుతుంది?

రూ. 4 లక్షల లోన్‌కు 10% వడ్డీతో 5 సంవత్సరాల కాలానికి నెలకు దాదాపు రూ. 8,660 ఈఎంఐ చెల్లించాలి. ఈ కాలంలో మీరు బ్యాంకుకు సుమారు లక్ష రూపాయల వడ్డీ చెల్లిస్తారు.

రెనాల్ట్ క్విడ్ కోసం 7 సంవత్సరాల లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎంత?

రూ. 4.60 లక్షల లోన్‌పై 9% వడ్డీతో 7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 7,400 అవుతుంది. తక్కువ నెలవారీ వాయిదా కావాలంటే ఇది మంచి ఎంపిక.

రెనాల్ట్ క్విడ్ ఈఎంఐపై కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

ఆన్-రోడ్ ధరను, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడాలి. మంచి CIBIL స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంది. డీలర్‌షిప్ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా తెలుసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget