అన్వేషించండి

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి

Maruti Fronx Finance Plan: మారుతి ఫ్రాంక్స్‌తో పాటు ఏ కారు అయినా ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధరలో చాలా మార్పులుంటాయి. డీలర్‌ను పూర్తి ఫైనాన్స్ ప్లాన్, నెలవారీ EMI వివరాలు సరిగ్గా తెలుసుకోవాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కూపే-స్టైల్, స్పోర్టీ డిజైన్ ఫ్రాంక్స్ ప్రత్యేకత.

Maruti Fronx EMI Plan | భారత మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. జులై 2026లోనే ఏకంగా 19,473 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జులైతో పోలిస్తే విక్రయాలు 51 శాతానికి పైగా పెరిగాయి. మీరు కనుక మారుతి ఫ్రాంక్స్ కారును కొనాలని భావిస్తున్నారా, అయితే మీ వద్ద మొత్తం నగదు లేకపోయినా పరవాలేదు. కొంత డౌన్ పేమెంట్ చేసి కార్ లోన్ ద్వారా మారుతి ఫ్రాంక్స్  సొంతం చేసుకోవచ్చు.

 ఈ క్రాసోవర్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్‌లో సుమారు రూ. 6.85 లక్షలుగా ఉంది. మేం మారుతి ఫ్రాంక్స్ వేర్వేరు వేరియంట్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. కారు EMI అనేది బ్యాంక్, క్రెడిట్ ప్రొఫైల్, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, డీలర్‌షిప్‌ను బట్టి మారుతుంది.

మారుతి ఫ్రాంక్స్ సిగ్మా MT Petrol
మొదటగా Fronx Sigma MT Petrol మోడల్.. హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6,84,900 కాగా, ఆన్-రోడ్ ధర సుమారు రూ. 8.52 లక్షలు ఉంటుంది. మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, దాదాపు రూ. 7.52 లక్షల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 9.8 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు దీని నెలవారీ EMI సుమారు రూ. 15,201 అవుతుంది. 6 ఏళ్లకు కార్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.13,243 చెల్లించాలి.

మారుతి ఫ్రాంక్స్ డెల్టా ఎంటీ మోడల్ (Fronx Delta MT Petrol)
మారుతి ఫ్రాంక్స్ Delta MT Petrol వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ. 7,69,900 మరియు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 9.24 లక్షలుగా ఉంది. రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసిన తర్వాత దాదాపు రూ. 8.24 లక్షల కార్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. 5 ఏళ్ల కాలానికి 9.8 శాతం వడ్డీ రేటును తీసుకుంటే, ప్రతినెల EMI సుమారు రూ. 17,441 అవుతుంది. ఈ లోన్‌పై వడ్డీ దాదాపు రూ. 2.24 లక్షలు అవుతుంది.

Also Read: టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు

మారుతి ఫ్రాంక్స్ Sigma CNG MT
మీరు CNG మోడల్ తీసుకోవాలనుకుంటే మారుతి ఫ్రాంక్స్ Sigma CNG MT చూడవచ్చు. హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,86,400 కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 9.41 లక్షలు. మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత సుమారు రూ. 8.41 లక్షల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 9.8 శాతం వడ్డీతో 5 ఏళ్లకు కార్ లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI దాదాపు రూ. 17,789 అవుతుంది. మీరు చెల్లించే మొత్తం వడ్డీ సుమారు రూ. 2.26 లక్షలు ఉంటుంది.

మారుతి ఫ్రాంక్స్ Fronx Delta Plus Petrol
Delta Plus MT Petrol ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ. 8,09,500 కాగా, దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.9.71 లక్షలు ఉంటుంది. రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ తర్వాత మీరు రూ. 8.71 లక్షల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల లోన్, 9.8 శాతం వడ్డీ రేటుతో EMI దాదాపు రూ. 18,490 చెల్లించాలి. మొత్తం లోన్ కాలంలో వడ్డీ సుమారు రూ. 2.33 లక్షల వరకు అవుతుంది. 

కారు డిజైన్ ఎలా ఉంటుంది
మారుతి ఫ్రాంక్స్‌ను కంపెనీ కూపే-స్టైల్ కాంపాక్ట్ SUVగా తీసుకొచ్చింది. దీని డిజైన్ సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే చాలా భిన్నంగా, స్పోర్టీగా అనిపిస్తుంది. కారు ముందు భాగంలో ఎత్తైన బోనెట్, పెద్ద ఆకర్షణీయమైన గ్రిల్, స్టైలిష్ స్పోర్టీ బంపర్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఇచ్చారు.  కారు బాడీ డిజైన్‌ను కూడా రోడ్డుపై మరింత వెడల్పుగా, ఎత్తుగా, స్ట్రాంగ్‌గా కనిపించేలా చేశారు.

Also Read: కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే, కార్ లోన్ వడ్డీ రేటు మీ బ్యాంక్, క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి మారవచ్చు. కనుక కొనుగోలు చేసే ముందు NEXA డీలర్‌షిప్‌ను సంప్రదించి ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ ఆప్షన్, వడ్డీ రేటు, EMI వివరాలు స్పష్టంగా తెలుసుకోవాలి. 

Frequently Asked Questions

మారుతి ఫ్రాంక్స్ కారు డిజైన్ ఎలా ఉంటుంది?

ఇది కూపే-స్టైల్ కాంపాక్ట్ SUV. దీని డిజైన్ సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే భిన్నంగా, స్పోర్టీగా ఉంటుంది. ఎత్తైన బోనెట్, పెద్ద గ్రిల్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు దీని ప్రత్యేకతలు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget