అన్వేషించండి

కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

కారును ఎక్కడ పడితే అక్కడ పార్క్‌ చేస్తే బీమా క్లెయిమ్‌ చిక్కుల్లో పడొచ్చు. నో పార్కింగ్‌, నిర్లక్ష్యపు పార్కింగ్‌, తాళంచెవి కారులో వదిలివేత వంటి అంశాలు క్లెయిమ్‌పై ప్రభావం చూపుతాయి.

Car parking insurance claim: కారు ఎక్కడ పడితే అక్కడ పార్క్‌ చేస్తున్నారా? జాగ్రత్త. పార్కింగ్‌ విషయంలో చేసే చిన్న తప్పు కూడా ఒక్కోసారి బీమా క్లెయిమ్‌కు పెద్ద అడ్డంకిగా మారొచ్చు. ముఖ్యంగా నో పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో కారును నిలిపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

నగరాల్లో కారును సురక్షితంగా పార్క్‌ చేయడం పెద్ద సవాలుగా మారింది. అపార్ట్‌మెంట్లు, మార్కెట్లు, రద్దీగా ఉండే వీధుల్లో పార్కింగ్‌ స్థలాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో చాలామంది రోడ్డు పక్కన, నో పార్కింగ్‌ ప్రాంతాల్లో, చెట్ల కింద లేదా లోతట్టు ప్రదేశాల్లో కార్లను నిలిపి వెళ్తున్నారు. కారును సమగ్ర మోటారు బీమా పాలసీ ఉన్నప్పటికీ, ఇలాంటి చోట్ల కారు దెబ్బతింటే బీమా సంస్థ కొన్ని విషయాలను పరిశీలిస్తుంది.

సాధారణంగా, సమగ్ర మోటారు బీమా పాలసీ ఉంటే ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు సాధారణంగా రక్షణ ఉంటుంది. పార్క్‌ చేసిన కారును మరో వాహనం ఢీకొట్టినా, దుండగులు ధ్వంసం చేసినా, తుపాను సమయంలో చెట్టు విరిగి కారుపై పడినా పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వరద నీటితో కారు దెబ్బతిన్నా ఓన్‌ డామేజ్‌ కవరేజీ కింద పరిహారం లభించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?

అయితే, డ్యామేజీ జరిగిన సందర్భంలో, కారు ఎక్కడ పార్క్‌ చేశారనే అంశం కూడా ముఖ్యమే. నో పార్కింగ్‌ బోర్డు ఉన్న ప్రాంతంలో కారు నిలిపినంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ క్లెయిమ్‌ తిరస్కరిస్తారని చెప్పలేం. కానీ, వాహన యజమాని తెలిసీ ప్రమాదకర పరిస్థితిని ఎంచుకున్నారని బీమా సంస్థ భావిస్తే సమస్యలు రావచ్చు. స్థానిక నిబంధనలను పట్టించుకోకపోవడం లేదా స్పష్టమైన భద్రతా హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం క్లెయిమ్‌పై ప్రభావం చూపొచ్చు.

అంతేకాదు, వాహన యజమాని తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడినట్లు రుజువైతే బీమా క్లెయిమ్‌ మరింత కష్టమవుతుంది. ఉదాహరణకు, కారు ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచి దుకాణానికి వెళ్లడం, తాళంచెవిని కారులోనే వదిలేయడం వంటి చర్యలు ప్రమాదకరమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో కారు చోరీకి గురైతే బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిశీలించే సమయంలో యజమాని నిర్లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

కారు విడిభాగాలు దెబ్బతిన్నప్పుడు వాటిని మార్చాల్సి వస్తే, మొత్తం ఖర్చు తరుగుదల కారణంగా బీమా పరిధిలోకి రాకపోవచ్చు. దీనికి జీరో డెప్రిసియేషన్‌ అనుబంధ కవరేజీ ఉపయోగపడుతుంది. అర్హత ఉన్న సందర్భాల్లో విడిభాగాల తరుగుదల భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే కారణాన్ని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ముందుగా సంస్థ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించాలి. సమస్య పరిష్కారం కాకపోతే ఐఆర్‌డీఏఐకి చెందిన బీమా భరోసా పోర్టల్‌ లేదా ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

కాబట్టి కారును పార్క్‌ చేసేటప్పుడు నో పార్కింగ్‌ బోర్డులు ఉన్నాయా చూడాలి. రాత్రివేళల్లో వెలుతురు, నిఘా కెమెరాలు ఉన్న ప్రదేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తాళంచెవిని ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో వదిలిపెట్టకూడదు. కారు దెబ్బతిన్న వెంటనే ఫొటోలు, వీడియోలు తీసుకోవాలి. ఇవి క్లెయిమ్‌ సమయంలో ఉపయోగపడే ఆధారాలుగా నిలుస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
Embed widget