అన్వేషించండి

భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?

CAFE 3 నిబంధనల నేపథ్యంలో భారత్‌లో చిన్న కార్లకు మళ్లీ డిమాండ్ పెరగాల్సిన అవసరం ఉంది. EV, CNG, హైబ్రిడ్ కార్లతో కొత్త మార్కెట్‌కు బాట వేయాల్సిన సమయం ఇదే.

Small Cars In India 2026: భారత్‌లో చిన్న కార్లకు మళ్లీ మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దేశ కార్ల మార్కెట్‌ను చిన్న కార్లే ముందుండి నడిపించాయి. ఇప్పుడు SUVల హవా పెరిగింది, పెద్ద కార్లకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో ఎంట్రీ లెవల్ కార్లపై కంపెనీల ఫోకస్‌ తగ్గింది. అయితే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి.

CAFE 3 నిబంధనలు మరో ఎనిమిది నెలల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో కార్ల తయారీ సంస్థలపై ఒత్తిడి మరింత పెరగనుంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలి, ఇంధన సామర్థ్యాన్ని పెంచాలి & తక్కువ బరువున్న కార్లను తీసుకురావాలి. అంతేకాదు, ప్రస్తుతం భారీ సంఖ్యలో ఉన్న SUVల విషయంలోనూ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.

ఇక్కడే చిన్న కార్లకు కొత్త అవకాశం కనిపిస్తోంది.
CAFE 3 నిబంధనల్లో భాగంగా, ఫ్లీట్-సగటు పనితీరులో 30 శాతం వరకు తగ్గింపు సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇప్పటివరకు ఉపయోగిస్తున్న MIDC పరీక్షా విధానానికి బదులుగా WLTP ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలకు కొత్త నిబంధనలను అందుకోవడం అంత సులభం కాదు. అందుకే, కార్ల కంపెనీలు చిన్న కార్లపై మళ్లీ దృష్టి సారిస్తున్నాయి. ఇది కేవలం నిబంధనలను పాటించే మార్గమే కాదు కాదు, భవిష్యత్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకునే వ్యూహం కూడా.

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

చిన్న కార్లకు డిమాండ్ కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని అనుకోవడం తప్పు. యూరప్‌లోనూ చిన్న కార్లపై ఆసక్తి పెరుగుతోంది. అమెరికాలోనూ తక్కువ ఖర్చుతో, మెరుగైన సామర్థ్యంతో ఉండే వాహనాలున్నాయి. జపాన్‌ అయితే చిన్న కార్లకు ఎప్పటి నుంచో పెద్ద మార్కెట్‌గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కారు కొనుగోలుదార్ల ఆలోచనలో మార్పు వస్తోంది. తక్కువ ఖర్చుతో కొనాలి, సౌకర్యంగా ఉండాలి, అధునాతన ఫీచర్లు ఉండాలి, కారు రూపం ఆకర్షించాలి, అదే సమయంలో కాలుష్యం కూడా తగ్గాలి. అంటే చిన్న కారు అయినా నాణ్యతలో రాజీ పడకూడదన్న మాట.

ఈ దిశగా ఇప్పటికే కొన్ని కంపెనీలు అడుగులు వేశాయి. సిట్రోయెన్‌ అమి, ఫియట్‌ టొపొలినో, ఫియట్‌ మల్టిప్లా, రెనో 5, ఆల్పైన్‌ A290, నిస్సాన్‌ మైక్రా, స్మార్ట్‌ ఫోర్‌టూ, హోండా సూపర్‌ ఎన్‌, మైక్రోలినో, మైక్రోలెట్టా వంటి మోడళ్లు ఇందుకు ఉదాహరణలు. ఇవి కేవలం చౌక ధర కార్లు కావు. వీటిలో బ్యాటరీతో నడిచే వాహనాలు ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్స్‌ అందించే మోడళ్లు ఉన్నాయి. వీటిలో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి, ఆకర్షణీయమైన డిజైన్ ఉంది. అందుకే యువత నుంచి వృద్ధుల వరకు ఇప్పుడు వీటిపై ఆసక్తి పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

భారత్‌ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దేశంలో కార్ల వినియోగం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. చైనా స్థాయి మార్కెట్‌లో కనీసం సగానికి చేరుకోవాలంటే కోట్లాది ద్విచక్ర వాహనదార్లను కార్ల వైపు తీసుకురావాలి. అందుకు చిన్న కార్లే కీలకం. అవి EVలైనా, CNG కార్లయినా, హైబ్రిడ్ వాహనాలైనా సరే. మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా, టాటా, హోండా వంటి సంస్థలు ఈ విభాగాన్ని మళ్లీ బలోపేతం చేయాలి

చిన్న కారు అంటే తక్కువ స్థాయి కారు అనే భావనను కంపెనీలు మార్చాలి. తక్కువ ధరలో మంచి నాణ్యత, మెరుగైన భద్రత, ఆధునిక ఫీచర్లు అందించాలి. అప్పుడే భారత్‌ మరోసారి చిన్న కార్లకు ప్రపంచ కేంద్రంగా ఎదుగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget