అన్వేషించండి

BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'

మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కొత్త రంగు, ప్రత్యేక డీకాల్స్‌, ప్రీమియం ఇంటీరియర్‌, 540 డిగ్రీల కెమెరా వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Mahindra BE 6 Formula E Freedom Edition: మహీంద్రా BE 6కు మరో ప్రత్యేక ఎడిషన్‌ వచ్చేసింది. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌ పేరుతో కొత్త వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. గతంలో వచ్చిన BE 6 'ఫార్ములా ఈ' ఎడిషన్‌కు ఏడాది కూడా పూర్తి కాకముందే ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే ఈసారి మహీంద్రా డిజైన్‌లో కీలక మార్పు చేసింది.

గత ఎడిషన్‌లో కనిపించిన రేసింగ్‌ తరహా డిజైన్‌ను పక్కన పెట్టింది. సాధారణ BE 6 కు దగ్గరగా కనిపించే డిజైన్‌ను ఫ్రీడమ్‌ ఎడిషన్‌కు ఇచ్చింది. దీంతో కొత్త వెర్షన్‌ మరింత సింపుల్‌గా ఉన్నప్పటికీ.. ప్రత్యేకమైన టచ్‌లతో ఆకట్టుకుంటోంది.

రేసింగ్‌ లుక్‌కు బదులు కొత్త డిజైన్‌

మునుపటి BE 6 ఫార్ములా ఈ ఎడిషన్‌లో సన్నగా ఉండే ముందు & వెనుక డీఆర్‌ఎల్‌లు, గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, పెద్ద బంపర్లు ఉండేవి. కొత్త ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ఇవన్నీ కనిపించవు.

దీనికి సాధారణ BE 6 తరహాలో సీ ఆకారంలోని ముందు & వెనుక డీఆర్‌ఎల్‌లు ఇచ్చారు. బంపర్లను కూడా మరింత స్లీక్‌ డిజైన్‌తో రూపొందించారు. దీంతో కారు మొత్తం లుక్‌ సాధారణ BE 6కు చాలా దగ్గరగా కనిపిస్తుంది.

అయితే ఫార్ములా ఈ గుర్తింపును మాత్రం మహీంద్రా వదులుకోలేదు. ముందు ఫెండర్లపై ఫార్ములా ఈ బ్యాడ్జింగ్‌ ఉంటుంది. కొత్తగా రోస్సో ఇంపల్సో రంగును కూడా తీసుకొచ్చింది. కారు బాడీ అంతటా మూడు రంగుల డీకాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇది కూడా చదవండి: స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!

ఇంటీరియర్‌లో ప్రత్యేక టచ్‌లు

క్యాబిన్‌ లేఅవుట్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ఫ్రీడమ్‌ ఎడిషన్‌ ప్రత్యేకతను చూపించేలా చాలా మార్పులు వచ్చాయి. ఫైర్‌స్టార్మ్‌ ఆరెంజ్‌ రంగు థీమ్‌ క్యాబిన్‌లో కనిపిస్తుంది. లెదరెట్‌ & స్వెడ్‌ అప్‌హోల్స్టరీని ఉపయోగించారు. ‘ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌’ పేరుతో ప్రత్యేక ప్లాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌పై ఫార్ములా ఈ డీకాల్స్‌ ఉంటాయి.

డ్యాష్‌బోర్డ్‌లోని ప్రత్యేక హాలో తరహా లూప్‌ కూడా కొనసాగింది. ఇది డ్రైవర్‌ & కో డ్రైవర్‌ స్పేస్‌ను వేరు చేస్తుంది. BE 6 స్పోర్టెక్‌లో కనిపించే సాధారణ లేఅవుట్‌కు బదులుగా ఈ ప్రత్యేక డిజైన్‌నే ఫ్రీడమ్‌ ఎడిషన్‌లోనూ కొనసాగించారు.

దీంతో ఇందులో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి. మూడు స్క్రీన్‌ల సెటప్‌ మాత్రం ఇందులో లేదు.

ఇది కూడా చదవండి: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!

ప్రీమియం ఫీచర్లకు కొదవ లేదు

ఫీచర్ల విషయంలోనూ BE 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో 16 స్పీకర్ల హర్మన్‌ కార్డన్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉంటుంది. డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కూడా ఉంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. 

ఈ కొత్త ఎడిషన్‌లో అన్నింటి కంటే అత్యంత ఆసక్తికరమైన ఫీచర్‌ 540 డిగ్రీల కెమెరా. ఈ కెమెరా వ్యవస్థ సాధారణ 360 డిగ్రీల వీక్షణతో పాటు కారు కింది భాగాన్ని కూడా చూపిస్తుంది. అండర్‌ఫ్లోర్‌ వ్యూను అందించే ఈ సదుపాయం ఆఫ్‌రోడ్‌ డ్రైవింగ్‌లో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సాధారణ BE 6లోనూ, గతంలో వచ్చిన ఫార్ములా ఈ ఎడిషన్‌లోనూ ఈ ఫీచర్‌ అందుబాటులో లేదు. దీంతో ఫ్రీడమ్‌ ఎడిషన్‌కు ఇది ప్రత్యేకమైన అదనంగా మారింది.

మొత్తంగా చూస్తే.. కొత్త BE 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో మహీంద్రా మరో వ్యూహాన్ని అనుసరించింది. మునుపటి ఎడిషన్‌లో ఉన్న దూకుడైన రేసింగ్‌ డిజైన్‌కు బదులుగా సాధారణ BE 6 రూపాన్ని తీసుకుంది. అదే సమయంలో ప్రత్యేక రంగు, జాతీయ జెండా రంగులతో డీకాల్స్‌, ఫైర్‌స్టార్మ్‌ ఆరెంజ్‌ ఇంటీరియర్‌, ప్రీమియం సౌండ్‌ సిస్టమ్‌ & 540 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లతో దీనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget