అన్వేషించండి

స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ను ఆవిష్కరించారు. రూ.19.79 లక్షల కంటే తక్కువ ధరతో మరికొన్ని నెలల్లో ఇది లాంచ్‌ అవుతుంది.

Mahindra Scorpio Lifestyler pickup truck: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త 'మహీంద్రా లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌'ను ఎట్టకేలకు దేశానికి పరిచయం చేశారు. 2023లో ప్రదర్శించిన గ్లోబల్‌ పికప్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ కొత్త వాహనాన్ని మహీంద్రా రూపొందించింది. ఈ పికప్‌ ట్రక్‌కు "స్కార్పియో లైఫ్‌స్టైలర్‌" అనే పేరు పెట్టింది.

స్కార్పియో ఎన్‌ ఆధారంగా..
స్కార్పియో లైఫ్‌స్టైలర్‌కు స్కార్పియో ఎన్‌లో ఉపయోగించిన బాడీ ఆన్‌ ఫ్రేమ్‌ ఛాసిస్‌నే వినియోగించారు. దీంతో ఇది మంచి ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. భారత మార్కెట్‌లో Toyota Hilux, Isuzu D-Max V-Cross కు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది.

ధర
ధర విషయంలో మహీంద్రా భారీ వ్యత్యాసం చూపబోతోంది. ఈ పికప్‌ ట్రక్‌ ప్రారంభ ధర రూ.19.79 లక్షల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 2027 ఏప్రిల్‌లోగా మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం.. టయోటా హైలక్స్‌, ఇసుజు డీ మ్యాక్స్‌ వీ క్రాస్‌ ప్రారంభ ధరలు రూ.25 లక్షలకు పైగానే ఉన్నాయి. అంటే ప్రత్యర్థులతో పోలిస్తే స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.

రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌
స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ డిజైన్‌ చాలా దూకుడుగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఎత్తుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు ఉన్నాయి. వీటికి ఎల్‌ ఆకారంలోని డీఆర్‌ఎల్‌ లైటింగ్‌ ఉంటుంది. వెడల్పాటి హనీకోంబ్‌ గ్రిల్‌ ఆకట్టుకుంటుంది. గ్రిల్‌కు క్రోమ్‌ అలంకరణలు ఇచ్చారు. బానెట్‌ ముందుభాగంలో స్కార్పియో అనే పేరు కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!

కింది భాగంలో బలమైన స్కిడ్‌ ప్లేట్‌ ఉంది. దానిపై మహీంద్రా పేరు కనిపిస్తుంది. మెష్‌ తరహా ఎయిర్‌ డ్యామ్‌ & నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంపులు ఉన్నాయి.

పక్క నుంచి చూస్తే డబుల్‌ క్యాబ్‌ డిజైన్‌ కనిపిస్తుంది. డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌, మందపాటి సైడ్‌ క్లాడింగ్‌, రూఫ్‌ రైల్స్‌ ఉన్నాయి. బెల్ట్‌లైన్‌ మధ్యలో కింక్‌ డిజైన్‌ ఇచ్చారు. వెనుక భాగంలో సీ ఆకారంలోని డీఆర్‌ఎల్‌లతో పాటు నిలువుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంపులు ఉన్నాయి. బూట్‌ లిడ్‌పై పెద్దగా మహీంద్రా పేరు కనిపిస్తుంది. వెనుక బంపర్‌ కూడా ముందు భాగం తరహాలోనే రగ్‌డ్‌ డిజైన్‌తో ఉంటుంది.

మూడు ప్రత్యేక ఎడిషన్లు
స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను మూడు ప్రత్యేక ఎడిషన్లలో తీసుకురానుంది. వ్యాలీ, రీఫ్‌, ట్రెయిల్‌ పేర్లతో ఇవి ఉంటాయి. వీటిని ఆర్టెమిస్‌ గ్రే, ఆక్వారీఫ్‌, సహారా బీజ్‌ రంగుల్లో అందిస్తారు. ఆయా ఎడిషన్లకు ప్రత్యేక డీకాల్స్‌ & యాక్సెసరీలు ఉంటాయి. పర్వతాలు, సముద్రాలు, ఎడారుల స్ఫూర్తితో వీటిని రూపొందించారు.

ప్రీమియం ఇంటీరియర్‌
బయట నుంచి రఫ్‌గా కనిపించినప్పటికీ లోపల మాత్రం ప్రీమియం అనుభూతిని అందించేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డ్‌ మధ్యలో నిలువు ఆకారంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంటుంది. దాని ఇరువైపులా ఏసీ వెంట్స్‌ ఉన్నాయి. కింద క్లైమేట్‌ కంట్రోల్‌ ప్యానెల్‌ & ఫిజికల్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!

డ్రైవర్‌ ముందు 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ & డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంటాయి. ట్రాన్స్‌మిషన్‌ టన్నెల్‌పై కూడా చాలా ఫిజికల్‌ కంట్రోల్స్‌ ఉంటాయి. వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, టెర్రైన్‌ మోడ్‌లు వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

స్కార్పియో ఎన్‌ ఇంజిన్లే?
ఇంజిన్‌ విషయంలో స్కార్పియో లైఫ్‌స్టైలర్‌కు స్కార్పియో ఎన్‌లోని ఇంజిన్లనే ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 175 హెచ్‌పీ సామర్థ్యంతో 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ & 203 హెచ్‌పీ సామర్థ్యంతో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండొచ్చు. 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 4WD సిస్టమ్‌ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్యం & దక్షిణాఫ్రికా మార్కెట్లలోనూ ఈ పికప్‌ను విక్రయించనున్నారు. అయితే, ఇతర దేశాల్లో స్కార్పియో పేరును చేర్చకుండా కేవలం లైఫ్‌స్టైలర్‌ పేరుతోనే ఈ వాహనం అందుబాటులోకి రానుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Embed widget