అన్వేషించండి

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!

JCB Hydromax హైడ్రోజన్ కారు గంటకు 653.90 కి.మీ. సగటు వేగంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. రెండు ఇంజిన్లతో 1,622hp పవర్‌ను ఈ కారు ఉత్పత్తి చేస్తుంది.

JCB Hydromax hydrogen-powered car: JCB అనగానే సాధారణంగా మనకు భారీ యంత్రాలు, బుల్డోజర్లు గుర్తొస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఈ ఇంజినీరింగ్ దిగ్గజ కంపెనీ, ఇప్పుడు పెను సంచలనం సృష్టించింది. హైడ్రోజన్‌ ఇంజిన్ కారుతో ఏకంగా ప్రపంచ ల్యాండ్ స్పీడ్ రికార్డును బద్దలు కొట్టింది.

JCB రూపొందించిన హైడ్రోమ్యాక్స్‌ (Hydromax) స్పీడ్‌స్టర్ గంటకు 653.90 కిలోమీటర్ల సగటు వేగాన్ని అందుకుంది. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న బోన్నెవిల్లే సాల్ట్ ఫ్లాట్స్‌లో ఈ కారును పరీక్షించారు. ఈ రికార్డు ప్రయత్నంలో, ప్రముఖ డ్రైవర్ ఆండీ గ్రీన్ Hydromaxను నడిపాడు.

రెండు ఇంజిన్లు.. 1,622hp పవర్
Hydromaxలో రెండు హైడ్రోజన్ కంబన్షన్‌ ఇంజిన్లు ఉన్నాయి. ఒక్కో ఇంజిన్ సామర్థ్యం 4.8 లీటర్లు. అంటే రెండు ఇంజిన్ల కలిపి సామర్థ్యం 9.6 లీటర్లు. ఇవి కలిసి ఏకంగా 1,622hp పవర్‌ ఇస్తారు. అధిక ఎత్తులో ఉన్న బోన్నెవిల్లే ప్రాంతంలో ఇంజిన్లకు తగిన పనితీరు అందించేందుకు సింగిల్-స్టేజ్ మోటార్‌స్పోర్ట్ టర్బోచార్జర్‌ను ఉపయోగించారు. అంతేకాదు.. Le Mans రేసింగ్ కారులో ఉపయోగించే స్పార్క్ ప్లగ్‌లను కూడా ఇందులో అమర్చారు.

ముందు & వెనుక చక్రాలకు పవర్
Hydromax పొడవు 9.75 మీటర్లు. దీన్ని స్టీల్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. కారులో రెండు ఇంజిన్లను ఛాసిస్‌కు ఇరువైపులా అమర్చారు. ఒక ఇంజిన్ ముందు యాక్సిల్‌కు పవర్ అందిస్తుంది. మరో ఇంజిన్ వెనుక యాక్సిల్‌ను నడుపుతుంది. రెండు ఇంజిన్లకూ ప్రత్యేకంగా 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇందులోని క్లచ్‌లను JCB డిగ్గర్ నుంచి తీసుకున్నారు. ఇలాంటి స్పీడ్ రికార్డు కారు కోసం అవసరమైన భారీ లోడ్లను మోటార్‌స్పోర్ట్ క్లచ్‌లు తట్టుకోలేవని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు

రెండు ప్రయత్నాల్లో రికార్డు
రికార్డు కోసం Hydromax రెండుసార్లు పరుగులు తీసింది. మొదటి రన్‌లో గంటకు 644.74 కిలోమీటర్ల సగటు వేగాన్ని నమోదు చేసింది. రెండో రన్‌లో గంటకు 663.26 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ రెండు ట్రయల్స్‌ సగటు వేగం గంటకు 653.90 కిలోమీటర్లు. దీంతో, 2004లో BMW H2R సాధించిన రికార్డు అడ్రస్‌ లేకుండాపోయింది. BMW H2R అప్పట్లో గంటకు 298.53 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది.

JCB ప్రకారం.. Hydromax సగటు వేగం ఆధారంగా చూస్తే చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రయాణించిన హైడ్రోజన్ వెహికల్‌గా నిలిచింది.

ప్రత్యేక డిజైన్
Hydromaxలో డ్రైవర్ కూర్చునే భాగాన్ని కార్బన్ ఫైబర్ మోనోకోక్ సబ్-ఛాసిస్‌తో రూపొందించారు. గాలిని సులభంగా చీల్చుకువెళ్లేలా ముందు భాగానికి ప్రత్యేక ఆకృతిని ఇచ్చారు. దీంతో గాలి నిరోధకత తగ్గుతుంది.

హైడ్రోజన్ ట్యాంక్‌ను డ్రైవర్ సీటింగ్ భాగం వెనుక అమర్చారు. కారు ముందు భాగం కింద ప్రత్యేక ఛానళ్లను రూపొందించారు. బోన్నెవిల్లే సాల్ట్ ఫ్లాట్స్‌లోని ఉప్పు కారు కింద పేరుకుపోకుండా బయటకు వెళ్లేలా వీటిని డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!

వేగం పెరిగే కొద్దీ పెరిగే టైర్లు
ఇంతటి వేగాన్ని తట్టుకునేందుకు JCB ప్రత్యేకంగా కొత్త టైర్లను తయారు చేయించింది. అధిక వేగంలో ఈ టైర్లు కొంత విస్తరిస్తాయి. అందుకే ముందు చక్రాల ఆర్చ్‌ల పరిమాణాన్ని పెంచాల్సి వచ్చింది.

ఇంజిన్లను చల్లబరచడానికి సాధారణ కూలింగ్ ఇన్‌లెట్‌లకు బదులుగా మంచుతో కూడిన రెండు ట్యాంకులను ఉపయోగించారు. ఒక్కో రన్‌కు ఏకంగా 250 కిలోల మంచు అవసరం.

రికార్డు స్థాయి రన్‌లో Hydromax కేవలం 2 కిలోల కంటే కొంచెం ఎక్కువ హైడ్రోజన్‌ను మాత్రమే వినియోగించిందని JCB తెలిపింది. దీనివల్ల సుమారు 18 లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుంది.

ఆండీ గ్రీన్‌కు మూడో ప్రపంచ రికార్డు
Hydromaxను నడిపిన ఆండీ గ్రీన్‌కు ఇది మూడో ప్రపంచ రికార్డు. 1997లో ధ్వని వేగాన్ని దాటిన Thrust SSCతో ప్రపంచ ల్యాండ్ స్పీడ్ రికార్డును సాధించాడు. ఆ తర్వాత 2006లో JCB Dieselmaxతో డీజిల్ కారుకు సంబంధించిన ప్రపంచ వేగ రికార్డును నెలకొల్పాడు.

ఇప్పుడు JCB Hydromaxతో హైడ్రోజన్ కంబన్షన్‌ ఇంజిన్‌ వెహికల్‌తో మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget