అన్వేషించండి

ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌, స్కార్పియో ఎన్‌ మధ్య డిజైన్‌, ఇంటీరియర్‌, ఇంజిన్‌, ఫీచర్లలో ఉన్న కీలక తేడాలు ఏమిటో తెలుసుకుందాం.

Mahindra Scorpio Lifestyler vs Scorpio N: మహీంద్రా స్కార్పియో కుటుంబంలోకి మరో కొత్త మోడల్‌ వచ్చేసింది. స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పేరుతో లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌ను ఆ కంపెనీ ఆవిష్కరించింది. దీనిని స్కార్పియో ఎన్‌ ఆధారంగా రూపొందించినప్పటికీ.. రెండు వాహనాలు ఒకేలా ఉండవు. రెండు వెహికల్స్‌ ఒకే ల్యాడర్‌ ఫ్రేమ్‌ ఛాసిస్‌ను ఉపయోగించినా.. డిజైన్‌, బాడీ స్టైల్‌, ఇంటీరియర్‌, ఫీచర్ల విషయంలో మహీంద్రా చాలా మార్పులు చేసింది.

అసలు స్కార్పియో ఎన్‌కు.. లైఫ్‌స్టైలర్‌కు మధ్య తేడాలు ఏంటి? పికప్‌ ట్రక్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు మహీంద్రా ఎలాంటి మార్పులు చేసింది?.

ముందు భాగంలోనే తేడా స్పష్టం

స్కార్పియో ఎన్‌ ముందు భాగంలో రెండు భాగాలుగా కనిపించే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు ఉంటాయి. బంపర్‌పై స్కార్పియన్‌ టెయిల్‌-ఆకారంలో డీఆర్‌ఎల్‌ లైట్లు ఉంటాయి. ఫాగ్‌ ల్యాంపులను చుట్టుకుని కనిపించేలా వీటిని బిగించారు. క్రోమ్‌ ఫినిష్‌తో ఆరు వెర్టికల్‌ స్లాట్ల హెక్సాగనల్‌ గ్రిల్‌ ఉంటుంది. గ్రిల్‌ పైభాగంలో క్రోమ్‌ స్ట్రిప్‌ ఉంటుంది. ఎయిర్‌ ఇన్‌టేక్‌ ప్రాంతంలో హనీకోంబ్‌ డిజైన్‌ కనిపిస్తుంది. కింది భాగంలో సిల్వర్‌ రంగు స్కిడ్‌ ప్లేట్‌ ఉంటుంది.

లైఫ్‌స్టైలర్‌లో మాత్రం కొంచెం సన్నగా ఉండే హెడ్‌ల్యాంపులు ఉన్నాయి. వీటికి ఎల్‌ ఆకారంలో డీఆర్‌ఎల్‌ లైట్లు ఇచ్చారు. గ్రిల్‌ గ్లాస్‌ బ్లాక్‌ ఫినిష్‌తో ఉంటుంది. పైభాగంలో స్కార్పియో పేరును పొందుపరిచారు. క్రోమ్‌ స్లాట్లకు ఆరెంజ్‌ కలర్‌ హైలైట్స్‌ ఇచ్చారు. బంపర్‌ కూడా స్కార్పియో ఎన్‌ కంటే బాక్సీగా ఉంటుంది. మధ్యలో చెకర్డ్‌ డిజైన్‌ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

బాడీ విషయంలో భారీ మార్పు

రెండు వాహనాల మధ్య అసలు తేడా బాడీ స్టైల్‌లోనే కనిపిస్తుంది. స్కార్పియో ఎన్‌ మూడు వరుసల ఎస్‌యూవీ. లైఫ్‌స్టైలర్‌ మాత్రం వెనుక భాగంలో ప్రత్యేకమైన లోడ్‌ బెడ్‌తో వచ్చే డబుల్‌ క్యాబ్‌ పికప్‌ ట్రక్‌.

లైఫ్‌స్టైలర్‌లో వీల్‌ ఆర్చ్‌లు & డోర్ల కింది భాగంలో మరింత మందమైన క్లాడింగ్‌ ఉంటుంది. అల్లాయ్‌ వీల్స్‌ డిజైన్‌ కూడా భిన్నంగా ఉంటుంది. రెండు మోడళ్లలోనూ రూఫ్‌ రైల్స్‌ ఉన్నాయి. అయితే లైఫ్‌స్టైలర్‌ వెనుక లోడ్‌ బెడ్‌ను ఏర్పాటు చేయడానికి స్కార్పియో ఎన్‌ కంటే పొడవైన వీల్‌బేస్‌తో వచ్చే అవకాశం ఉంది.

గ్లాస్‌హౌస్‌ డిజైన్‌లోనూ మార్పు ఉంది. ముఖ్యంగా వెనుక విండో పైకి ఎగసిన కింక్‌ ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీంతో పికప్‌ ట్రక్‌కు ప్రత్యేకమైన రూపం వచ్చింది.

వెనుక భాగంలోనూ కొత్త డిజైన్‌

స్కార్పియో ఎన్‌ వెనుక భాగంలో నిలువుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంపులు ఉంటాయి. లైఫ్‌స్టైలర్‌లో మాత్రం చిన్నగా ఉండే దీర్ఘచతురస్రాకార ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంపులు ఉన్నాయి. వీటిలో సీ ఆకారపు లైటింగ్‌ సిగ్నేచర్‌ కనిపిస్తుంది.

స్కార్పియో ఎన్‌ వెనుక మహీంద్రా ట్విన్‌ పీక్స్‌ లోగోతో పాటు స్కార్పియో ఎన్‌ బ్యాడ్జింగ్‌ ఉంటుంది. లైఫ్‌స్టైలర్‌ టెయిల్‌గేట్‌పై పెద్ద అక్షరాలతో మహీంద్రా లైఫ్‌స్టైలర్‌ అని రాశారు. కింది భాగంలో చతురస్రాకార డిజైన్‌ ఎలిమెంట్లతో రగ్డ్‌ బ్లాక్‌ బంపర్‌ ఉంటుంది. స్కార్పియో ఎన్‌లో మాత్రం బంపర్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!

మూడు ప్రత్యేక ఎడిషన్లు

స్కార్పియో ఎన్‌కు భిన్నంగా లైఫ్‌స్టైలర్‌ను మూడు ప్రత్యేక ఎడిషన్లలో అందించనున్నారు. రీఫ్‌, వ్యాలీ & ట్రెయిల్‌ పేర్లతో ఇవి ఉంటాయి. ఎడిషన్‌ను బట్టి బయట డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. రూఫ్‌ ర్యాక్‌, స్నార్కెల్‌ వంటి ప్రత్యేక యాక్సెసరీలు కూడా లభిస్తాయి.

ఇంటీరియర్‌లోనూ భారీ మార్పులు

క్యాబిన్‌లో స్కార్పియో ఎన్‌తో పోలిస్తే లైఫ్‌స్టైలర్‌ డ్యాష్‌బోర్డ్‌ లేఅవుట్‌ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్కార్పియో ఎన్‌లో అడ్డంగా ఉండే ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంటుంది. లైఫ్‌స్టైలర్‌లో మాత్రం పెద్ద నిలువు స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.

స్టీరింగ్‌ వీల్‌ కూడా భిన్నంగా ఉంటుంది. లైఫ్‌స్టైలర్‌లో ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉంటుంది. దీనిపై ప్రత్యేకమైన స్విచ్‌గేర్‌ ఉంటుంది. రెండు మోడళ్లలోనూ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే ఉంటుంది. అయితే స్కార్పియో ఎన్‌లో ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను చుట్టూ కవర్‌ చేసే సంప్రదాయ బిన్నాకిల్‌ ఉంటుంది. లైఫ్‌స్టైలర్‌లో ఇది ఉండదు.

సన్‌రూఫ్‌ విషయంలోనూ తేడా ఉంది. లైఫ్‌స్టైలర్‌లో సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌ ఉంటుంది. స్కార్పియో ఎన్‌లో పెద్ద పనోరమిక్‌ సన్‌రూఫ్‌ ఉంటుంది.

స్కార్పియో ఎన్‌లో ఫిజికల్‌ స్విచ్‌లు ఎక్కువగా ఉంటాయి. డ్యాష్‌బోర్డ్‌కు లెదరెట్‌ ఫినిష్‌ ఇవ్వడం వల్ల అది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. లైఫ్‌స్టైలర్‌లో మాత్రం రగ్డ్‌ లుక్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇంజిన్లు ఒకటేనా?

లైఫ్‌స్టైలర్‌ పూర్తి సాంకేతిక వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించలేదు. అయితే గ్లోబల్‌ పికప్‌ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సమయంలో, స్కార్పియో ఎన్‌తో ఇంజిన్‌ను పంచుకుంటుందని కంపెనీ సూచించింది. అందువల్ల 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ & 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్లు వచ్చే అవకాశం ఉంది. రెండు ఇంజిన్లకు 6 స్పీడ్‌ మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లు ఉండొచ్చు. 4WD వ్యవస్థతో పాటు ప్రయాణంలోనే డ్రైవ్‌ మోడ్‌ మార్చుకునే సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది.

నార్మల్‌, గ్రాస్‌-గ్రావెల్‌-స్నో, మడ్‌-రట్‌ & శాండ్‌ వంటి డ్రైవ్‌ మోడ్‌లు లభించవచ్చు. పికప్‌ ట్రక్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజిన్‌ను మహీంద్రా ప్రత్యేకంగా ట్యూన్‌ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి తుది సాంకేతిక వివరాలు విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

మొత్తంగా చూస్తే.. స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ను స్కార్పియో ఎన్‌కు వెనుక భాగంలో లోడ్‌ బెడ్‌ యాడ్‌ చేసిన మోడల్‌గా మాత్రమే మహీంద్రా తీసుకురాలేదు. బయట డిజైన్‌ నుంచి ఇంటీరియర్‌ వరకు అనేక మార్పులు చేసింది. రగ్డ్‌ లుక్‌, ప్రత్యేకమైన ఎడిషన్లు & పికప్‌ ట్రక్‌కు తగిన ఫీచర్లతో దీనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ రావడంతో స్కార్పియో కుటుంబంలో ఇప్పుడు మూడు మోడళ్లు ఉంటాయి. ప్రస్తుత స్కార్పియో క్లాసిక్‌, స్కార్పియో ఎన్‌తో పాటు కొత్తగా లైఫ్‌స్టైలర్‌ కూడా ఈ కుటుంబంలో చేరింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget