అన్వేషించండి

Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?

Car Coolant: కూలెంట్ అయిపోయినప్పుడు, కారును సురక్షితమైన ప్రదేశంలో ఆపి, ఇంజిన్‌ను ఆపివేసి, చల్లారనివ్వండి. కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజిన్ ఓవర్‌ హీట్ అవుతుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కారు ఇంజిన్ చల్లగా ఉంచడానికి కూలెంట్ అవశ్యం; వేడెక్కితే ఆపండి.
  • కూలెంట్ లోపంతో ఇంజిన్ దెబ్బతిని, హెడ్ గ్యాస్కెట్ పాడవుతుంది.
  • ఇంజిన్ చల్లారిన తర్వాత కూలెంట్ నింపి, థర్మోస్టాట్ తనిఖీ చేయండి.

Car Coolant: కారు ఇంజిన్‌ను చల్లగా ఉంచడానికి కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పొగ వచ్చే వరకు చాలా మంది దానిని గమనించరు. కూలెంట్ అనేది నీరు, యాంటీఫ్రీజ్‌ల మిశ్రమం, ఇది ఇంజిన్ అతిగా వేడెక్కకుండా సహాయపడుతుంది. ఇది తగ్గినా లేదా పూర్తిగా అయిపోయినా, అది నేరుగా ఇంజిన్ హెల్త్‌పై మీ భద్రతపై ప్రభావం చూపుతుంది. కూలెంట్ అయిపోయినప్పుడు ఏం చేయాలో, మీ వాహనానికి జరిగే నష్టం గురించి తెలుసుకోండి.

కూలెంట్ అయిపోయినప్పుడు ఇలా చేయండి

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ వేడెక్కుతున్నట్లు మీరు గమనిస్తే, కారును సురక్షితమైన ప్రదేశంలో ఆపండి. వెంటనే ఇంజిన్‌ను ఆపివేసి, అది చల్లారే వరకు చూడండి. వేడిగా ఉన్న ఇంజిన్‌పై నేరుగా నీళ్లు పోయడం ప్రమాదం, కాబట్టి తొందరపడి బోనెట్ తెరిచి నీళ్లు పోయడం మానుకోండి. ఇంజిన్ చల్లారిన తర్వాత మాత్రమే రేడియేటర్ క్యాప్‌ను తెరిచి, సురక్షితమైన డ్రైవింగ్ కోసం అవసరమైనంత నీరు లేదా కూలెంట్‌ను కలపండి.

వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంది

కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. కారు రోడ్డు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కారు పాడవడమే కాకుండా, మీ భద్రతకు ఇతరుల భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది.

హెడ్ ​​గ్యాస్కెట్ వైఫల్యం ప్రమాదం

కూలెంట్ కొరత ఇంజిన్ హీట్‌ అసాధారణంగా పెరగడానికి కారణమవుతుంది, దీనివల్ల హెడ్ గ్యాస్కెట్ పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. పగిలిన హెడ్ గ్యాస్కెట్ వల్ల కూలెంట్,  ఇంజిన్ ఆయిల్ కలసిపోయి, మరమ్మతుల ఖర్చు భారీగా పెంచుతాయి. అంతేకాకుండా, కూలెంట్ లేకపోవడంతో వాటర్ పంప్‌ను ఎండిపోయేలా చేసి, అది అరిగిపోవడానికి దారితీస్తుంది. దీనిని వెంటనే పరిష్కరించకపోతే, ఇది మొత్తం పంప్‌ను దెబ్బతీస్తుంది. తర్వాత అది మార్చడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

థర్మోస్టాట్ పనిచేయకపోవడం ఒక కారణం 

థర్మోస్టాట్ కూలెంట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అది సరిగ్గా పనిచేయకపోతే, ఇంజిన్‌లో కూలెంట్ సరిగ్గా ప్రసరించదు, దీనివల్ల ఇంజిన్ హీటెక్కుతుంది. అందువల్ల, కూలెంట్ స్థాయిని చెక్ చేయడంతో పాటు, థర్మోస్టాట్‌ను కూడా క్రమం తప్పకుండా చెక్ చేయాలి.  

వేసవిలో ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?

భారత్‌లో ఇంజిన్ వేడెక్కడం ఒక సాధారణ సమస్య . తీవ్రమైన వేడి, ట్రాఫిక్ రద్దీ, సరైన నిర్వహణ లేకపోవడం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి, కాబట్టి మీ కూలెంట్ స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం మంచిది.

Frequently Asked Questions

కారులో కూలెంట్ పాత్ర ఏమిటి?

కూలెంట్ నీరు, యాంటీఫ్రీజ్ మిశ్రమం. ఇది ఇంజిన్ అతిగా వేడెక్కకుండా కాపాడుతుంది. దీని స్థాయి తగ్గితే ఇంజిన్ ఆరోగ్యం, మీ భద్రత ప్రభావితమవుతాయి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ వేడెక్కితే ఏం చేయాలి?

కారును సురక్షితంగా ఆపి, ఇంజిన్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాతే రేడియేటర్ క్యాప్ తెరిచి, కూలెంట్ లేదా నీళ్లు కలపండి. వేడి ఇంజిన్‌పై నేరుగా నీళ్లు పోయవద్దు.

కూలెంట్ తక్కువగా ఉంటే కారుకు ఎలాంటి నష్టం జరుగుతుంది?

కూలెంట్ కొరత ఇంజిన్‌ను ఓవర్ హీట్ చేసి హెడ్ గ్యాస్కెట్ దెబ్బతినేలా చేస్తుంది. అలాగే, వాటర్ పంప్ పాడయ్యే ప్రమాదం ఉంది. మరమ్మతులు ఖరీదైనవి కావచ్చు.

థర్మోస్టాట్ సరిగ్గా పనిచేయకపోతే ఇంజిన్ వేడెక్కుతుందా?

అవును, థర్మోస్టాట్ కూలెంట్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అది పనిచేయకపోతే, కూలెంట్ సరైన ప్రవాహం లేక ఇంజిన్ వేడెక్కుతుంది. దీనిని తరచుగా తనిఖీ చేయాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి
హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ CVT నిజమైన మైలేజ్ ఇదే.. నగరంలో నిరాశపరిచినా హైవేపై డబ్బు ఆదా!
హ్యుందాయ్ వెర్నా CVT మైలేజ్ టెస్ట్‌.. కంపెనీ చెప్పిన లెక్కకు, వాస్తవ లెక్కకు ఎంత తేడా ఉంది?
హోండా సిటీ CVT రియల్‌ వరల్డ్‌ మైలేజ్ ఇదే.. కంపెనీ చెప్పిన నంబర్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే?
హోండా సిటీ పెట్రోల్ CVT నిజమైన మైలేజ్ ఎంత? నగరంలో షాకింగ్ రిజల్ట్‌.. హైవేపై మాత్రం అదుర్స్!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
Embed widget