అన్వేషించండి

సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!

Avore EX2 ఎలక్ట్రిక్ బైక్‌ ధర, బ్యాటరీ, రేంజ్‌, ఫీచర్లు, రంగుల గురించి తెలుసుకోండి. 5kWh బ్యాటరీతో 255 కి.మీ. IDC రేంజ్‌ అందిస్తుంది.

Avore EX2 Price, Range And Features Telugu: మన మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీలు వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి వచ్చిన కొత్త సంస్థ Avore. ఈ కంపెనీ.. EX2 మిడ్‌-స్పెక్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. ఇందులో 5kWh బ్యాటరీ, 7.5kW మోటార్‌ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 255 కి.మీ. IDC రేంజ్‌ వస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే, సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ దరిదాపుల్లోకి వెళ్లొచ్చు.

మీరు EX2ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే.

1. Avore EX2 ధర ఎంత?

Avore EX2 ప్రారంభ ధర రూ.1.46 లక్షలు. ఇది పరిచయ ఎక్స్‌షోరూమ్‌ ధర. కంపెనీ లైనప్‌లో EX2S కంటే ఈ మోడల్‌ దిగువ ర్యాంక్‌. EX2S ధర రూ.1.70 లక్షలు. అయితే ప్రస్తుతం EX2 అధికారిక ధర రూ.1.60 లక్షలుగా కూడా చెబుతున్నారు. కాబట్టి, కొనే సమయంలో డీలర్‌ వద్ద అసలైన ధర ఎంతో తెలుసుకోవడం మంచిది.

2. బ్యాటరీ, మోటార్‌ ఎలా ఉన్నాయి?

EX2లో 5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీనికి 7.5kW PMSM మోటార్‌ జత చేశారు. ఈ బైక్‌ గరిష్ఠంగా గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. IDC ప్రకారం రేంజ్‌ 255 కి.మీ. 

ఈ బండిలో... రివర్స్‌, ఎకో, సిటీ & స్పోర్ట్‌ అనే నాలుగు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. నగర ప్రయాణాలకు ఎకో లేదా సిటీ మోడ్‌ను ఉపయోగించుకోవచ్చు. మరింత వేగంగా ప్రయాణించాలనుకుంటే స్పోర్ట్‌ మోడ్‌ ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

3. ఏ ఫీచర్లు ఉన్నాయి?

Avore కంపెనీ, ఫీచర్ల విషయంలో EX2కు మంచి ప్యాకేజీనే ఇచ్చింది. ఈ టూవీలర్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ & నావిగేషన్‌ సదుపాయాలతో కలర్‌ LCD డిస్‌ప్లే ఉంటుంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, కీ-లెస్‌ ఆపరేషన్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

అంతేకాదు, వాహన ట్రాకింగ్‌, జియోఫెన్సింగ్‌, యాంటీ-థెఫ్ట్‌ అలర్ట్స్‌ వంటి కనెక్టెడ్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బైక్‌ భద్రతకు ఇవి ఉపయోగపడతాయి.

4. బైక్‌ పరిమాణం ఎంత?

Avore EX2 సీటు ఎత్తు 790mm. కెర్బ్‌ బరువు 154 కిలోలు. ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక భాగంలో మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉన్నాయి.

బ్రేకింగ్‌ కోసం ముందు & వెనుక డిస్క్‌ బ్రేక్‌లు ఇచ్చారు. వీటికి CBS సదుపాయం ఉంది. రోజువారీ నగర ప్రయాణాల్లో నియంత్రణ & స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో ఈ సెటప్‌ ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు

5. ఏ రంగుల్లో లభిస్తుంది?

Avore EX2ను మూడు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అవి Stellar Black DT, Starlit Red DT & Meteor Blue DT. ఈ మూడు రంగులు బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి.

మొత్తంగా చూస్తే.. Avore EX2లో మంచి బ్యాటరీ సామర్థ్యం, 255 కి.మీ. IDC రేంజ్‌, 100 కి.మీ గరిష్ఠ వేగం & అవసరమైన కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. రూ.1.46 లక్షల ప్రారంభ ధరలో ఇది ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే వాస్తవ రేంజ్‌, ఛార్జింగ్‌ సమయం & సర్వీస్‌ నెట్‌వర్క్‌ను కూడా పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget