అన్వేషించండి

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి

Toyota Urban Cruiser Hyryder | టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కొనుగోలు చేయాలనుకుంటే, ₹1 లక్ష రూపాయిల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో లెక్కలు ఇక్కడ అందిస్తున్నాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టయోటా హైరైడర్, హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజీతో మార్కెట్లో.
  • ₹13.9 లక్షల ఆన్-రోడ్ ధర, ₹1 లక్షతో లోన్ పొందవచ్చు.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్, వివిధ ఇంజిన్, మైలేజీ ఆప్షన్లు.

మీరు అధిక మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన మిడ్ సైజ్ SUVని కొనుగోలు చేయాలనుకుంటే Toyota Urban Cruiser Hyryderపై ఓ లుక్కేయండి. ఈ SUV  మారుతి గ్రాంట్ విటారా (Maruti Grand Vitara), Hyundai Creta, కియా సెల్టోస్ (Kia Seltos), Honda Elevate, స్కోడా కుషక్ (Skoda Kushaq) వంటి మోడళ్లకు గట్టి  పోటీని ఇస్తుంది.

ఈ కార్‌ను కొనుగోలు చేయడానికి మీ వద్ద మొత్తం నగదు లేకపోయినా పరవాలేదు. ఫుల్ పేమెంట్ చేయకుండానే ఈ కార్‌ను కార్ లోన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కొనుగోలు చేయాలనుకుంటే, రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

కార్ ఆన్ రోడ్ ధర

Toyota Urban Cruiser Hyryder బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్‌లో సుమారు ₹11.31 లక్షలు మరియు ఆన్-రోడ్ ధర ₹13.9 లక్షలుగా ఉంది. అయితే మీ సిటీ, పన్నులు/ఛార్జీలను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. ₹1 లక్ష డౌన్ పేమెంట్ చేశాక ₹13.9 లక్షల్లో ₹1 లక్ష తీసివేస్తే సుమారు ₹12.9 లక్షల లోన్ అవుతుంది. మీరు సంవత్సరానికి 9.8% వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకి లోన్ తీసుకుంటే, ప్రతి నెలా ₹21,265 EMI అవుతుంది. 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే ప్రతినెలా ఈఎంఐ రూ.23,749 చెల్లించాలి. ఒకవేళ 5 ఏళ్లకు కార్ లోన్ తీసుకుంటే కనుక ప్రతినెలా ఈఎంఐ రూ.27,260 కట్టాలి.

వాస్తవానికి బ్యాంకు వడ్డీ రేటు, మీ క్రెడిట్ హిస్టరీ, లోన్ కాలపరిమితి, ప్రాసెసింగ్ ఫీజు, ఆన్-రోడ్ ధరపై ఆధారపడి EMI కాస్త పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలవారీ EMI తగ్గొచ్చు. కానీ మొత్తం వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు.  ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే లోన్ అమౌంట్ తగ్గి, EMIతో పాటు మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది.

Also Read: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

కార్ ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే మీ చివరి కొనుగోలు ధర కాదు. ఆన్-రోడ్ ధరలో రోడ్ టాక్స్ లేదా RTO, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర అవసరమైన ఛార్జీలు కలిసి ఉంటాయి. కారు ప్రారంభ ధర సుమారు ₹11 లక్షలు ఉందని చూసి, అంతే మొత్తానికి ఫైనాన్సింగ్ చేసుకోవచ్చని భావించరాదు. 

కార్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Hyryder బేస్ E వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. పై వేరియంట్లయిన S, G, V మోడళ్లలో మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఉదాహరణకు, ఎత్తైన వేరియంట్లలో 7 అంగుళాలు లేదా 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay/Android Auto, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు  ఉన్నాయి.

ఇంజిన్, మైలేజ్ విషయానికొస్తే Toyota Hyryder ప్రత్యేకత దాని వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఎంపికలే. ఇందులో 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అవుట్‌పుట్ 103 PS,  137 Nm గా పేర్కొన్నారు. 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 116 PS పవర్ లభిస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు సుమారు 26.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.  Hyryderలో CNG, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లు ఉన్నాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ క్లెయిమ్ చేసిన మైలేజ్ దాదాపు 27.97 కిలోమీటర్ల వరకు ఉంది.

Also Read: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?

కార్ ప్రత్యేకత

ఈ SUV మరొక పెద్ద ప్రత్యేకత ఏంటంటే, కస్టమర్లు తమ అవసరం, బడ్జెట్‌కు అనుగుణంగా విభిన్న పవర్‌ట్రెయిన్‌ను ఎంచుకోవచ్చు. మీ ప్రాధాన్యత తక్కువ ప్రారంభ ధర, సాధారణ పెట్రోల్ వాడకం అయితే, బేస్ పెట్రోల్ వేరియంట్‌ సరిపోతుంది. ఎక్కువ మైలేజ్ కోసం కొనుగోలుదారులకు CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉంటాయి. హైబ్రిడ్ వేరియంట్ల ధర బేస్ పెట్రోల్ మోడల్ కంటే ఎక్కువ. 

 

Frequently Asked Questions

Toyota Urban Cruiser Hyryder బేస్ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు లభిస్తాయి?

Hyryder బేస్ E వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Toyota Urban Cruiser Hyryder కారును ₹1 లక్ష డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే EMI ఎంత అవుతుంది?

₹1 లక్ష డౌన్ పేమెంట్ చేశాక, ₹12.9 లక్షల లోన్ అవుతుంది. 9.8% వడ్డీతో 7 సంవత్సరాలకు నెలకు ₹21,265 EMI చెల్లించాలి.

Toyota Urban Cruiser Hyryder ఇంజిన్ ఎంపికలు, మైలేజ్ వివరాలు ఏమిటి?

ఇందులో 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్, 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌లు ఉన్నాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ దాదాపు 27.97 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. CNG ఎంపిక కూడా ఉంది.

కారు ఆన్-రోడ్ ధరలో ఏ ఏ ఛార్జీలు కలుస్తాయి?

ఆన్-రోడ్ ధరలో రోడ్ టాక్స్ లేదా RTO, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర అవసరమైన ఛార్జీలు కలిసి ఉంటాయి. ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే చివరి కొనుగోలు ధర కాదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget