అన్వేషించండి

టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు

Tesla Model Y RWD రియల్ వరల్డ్ రేంజ్ పరీక్షలో తేలిపోయింది, ఊహించిన దాని కంటే చాలా తక్కువ దూరం ప్రయాణించింది. 20-80 శాతం ఛార్జింగ్‌కు 23 నిమిషాలు పట్టింది.

Tesla Model Y RWD real world range: టెస్లా మోడల్ Y.. భారత్‌లో ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఫుల్‌ ఛార్జ్‌తో ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఈ రేంజ్ ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ఆటో ఎక్స్‌పర్ట్‌లు టెస్లా మోడల్ వై RWD ప్రీమియం వేరియంట్‌ను రియల్ వరల్డ్ పరిస్థితుల్లో పరీక్షించారు.

భారత్‌లో 2026 టెస్లా మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం RWD & L ప్రీమియం AWD వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలోనూ 60kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. వీటిలో ప్రీమియం RWD ప్రారంభ ధర రూ.50.89 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర.

ప్రీమియం RWD వేరియంట్‌లో వెనుక చక్రాలకు శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ 299hp శక్తిని & 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 60kWh LFP బ్యాటరీ ఉంటుంది. దీని మొత్తం సామర్థ్యం 64kWh. కంపెనీ ప్రకారం ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

అయితే, ఎక్స్‌పర్ట్‌లు రియల్ వరల్డ్ పరీక్ష కోసం ఈ కారును ఎకానమీ సెట్టింగ్ అయిన ‘చిల్’ మోడ్‌లో నడిపారు. నగర పరీక్షలో అత్యధిక రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం ‘స్టాండర్డ్’ సెట్టింగ్‌ను ఉపయోగించారు. హైవే పరీక్షలో ‘రెడ్యూస్డ్’ సెట్టింగ్‌ను ఎంచుకున్నారు.

ఇది కూడా చదవండి: రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!

నగరంలో టెస్లా మోడల్ వై 5.84 కిలోమీటర్లు/kWh సామర్థ్యాన్ని నమోదు చేసింది. ఈ ప్రకారం, ఒక పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించగలిగింది.

హైవేపై మాత్రం కారు మరింత మెరుగైన సామర్థ్యాన్ని చూపించింది. ఇక్కడ 6.52 కిలోమీటర్లు/kWh సామర్థ్యం నమోదైంది. దీంతో సుమారు 391 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది.

నగరం & హైవే ప్రయాణాలను కలిపి చూస్తే, సగటున మొత్తం సామర్థ్యం 6.18 కిలోమీటర్లు/kWhగా నమోదైంది. అంటే సాధారణ వినియోగంలో, సగటున సుమారు 370 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్‌ను ఆశించవచ్చు. 500 కిలోమీటర్ల కంపెనీ క్లెయిమ్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే దాదాపు 1.9 టన్నుల బరువున్న ఈ క్రాసోవర్‌కు ఈ రేంజ్ సహేతుకంగానే ఉందని పరీక్ష ఫలితాలు సూచిస్తున్నాయి.

ఛార్జింగ్ విషయంలోనూ మోడల్ వై ఆకట్టుకుంది. 250kW టెస్లా సూపర్‌ఛార్జర్‌తో పరీక్షించగా గరిష్ఠంగా 183kW ఛార్జింగ్ వేగం కనిపించింది. 30 శాతం SOC వద్ద 176kWగా ఉన్న వేగం, 40 శాతం SOC వద్ద 109kWకు పడిపోయింది. ఆ తర్వాత కూడా ఛార్జింగ్ వేగం క్రమంగా తగ్గింది.

20-80 శాతం SOC చేరుకోవడానికి కేవలం 23 నిమిషాలు పట్టింది. అయితే 80-100 శాతం ఛార్జింగ్‌కు మరో 30 నిమిషాలు అవసరమైంది. అంటే బ్యాటరీ చివరి దశలో ఛార్జింగ్ వేగం గణనీయంగా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?

రేంజ్ పరీక్షకు ముందు 'టెస్లా మోడల్ Y RWD' బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేశారు. కంపెనీ సూచించిన స్థాయిలో టైర్లలో గాలిని నింపారు. ముంబై నగరంలో & సమీప రాష్ట్ర రహదారిపై కారును నడిపారు. వెదర్‌ కంట్రోల్‌ను 22 డిగ్రీల వద్ద పూర్తి ఆటో మోడ్‌లో ఉంచారు. సాధారణ ప్రజల మాదిరిగానే ఆడియో సిస్టమ్, సూచికలు, ముందు వెంటిలేటెడ్ సీట్లను అవసరమైనప్పుడు ఉపయోగించారు.

టెస్లా మోడల్ వై RWDకి 500 కిలోమీటర్ల అధికారిక రేంజ్ ఉన్నప్పటికీ, వాస్తవ వినియోగంలో సుమారు 370 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే ఆశించాలని ఈ పరీక్షలు సూచిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget