అన్వేషించండి

రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!

మహీంద్రా BE 6 Sporteqలో 59kWh, 70kWh, 79kWh బ్యాటరీలు ఉన్నాయి. రూ.19.45 లక్షల నుంచి ధరలు మొదలవుతాయి. ఏ వేరియంట్‌ బెస్ట్‌? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Mahindra BE 6 Sporteq Price, Range And Features Telugu: మహీంద్రా BE 6 ఇప్పుడు కొత్త రూపంలో వచ్చింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV పేరుకు Sporteq అనే కొత్త సఫిక్స్‌ను జోడించింది. దీంతో పాటు కొత్త ఫీచర్లు, కొత్త బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. వేరియంట్ల సంఖ్యను కూడా పెంచింది. మరి, వీటిలో ఏ వేరియంట్‌ కొనడం మంచిది?

ధరలు
BE 6 Sporteq ధరలు రూ.19.45 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్‌ వేరియంట్‌ ధర రూ.26.95 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. హోమ్‌ ఛార్జర్‌ & ఇన్‌స్టాలేషన్‌ ఖర్చులు అదనం.

వేరియంట్లు
BE 6 Sporteqలో One, Two, Three, Three+, Four, FE, FE Four అనే వేరియంట్లు ఉన్నాయి. FE అంటే Formula E Freedom Edition. ఇది స్పోర్టియర్‌ డిజైన్‌తో వస్తుంది. Launch Edition కూడా ఉంది. ఇది Four వేరియంట్‌ ఆధారంగా రూపొందింది. దీనికి ప్రత్యేకమైన ఇంటీరియర్‌ & ఎక్స్‌టీరియర్‌ ఫినిష్‌లు ఉన్నాయి.

బ్యాటరీ
బ్యాటరీ విషయంలోనూ మార్పు వచ్చింది. 59kWh, 79kWh బ్యాటరీలతో పాటు కొత్తగా 70kWh బ్యాటరీ ఆప్షన్‌ కూడా తీసుకొచ్చారు. ఈ మూడు బ్యాటరీ ఆప్షన్లలోనూ వెనుక వైపు ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది. ఇది రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వ్యవస్థతో పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

రేంజ్‌
59kWh బ్యాటరీతో 231hp పవర్‌ లభిస్తుంది, దీని MIDC రేంజ్‌ 548 కిలోమీటర్లు. 70kWh బ్యాటరీ 245hp పవర్‌ ఇస్తుంది, దీని రేంజ్‌ 651 కిలోమీటర్లు. 79kWh బ్యాటరీతో 286hp పవర్‌ లభిస్తుంది, ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 683 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

ఛార్జింగ్‌ టైమ్‌
ఇక ఛార్జింగ్‌ సామర్థ్యం కూడా బ్యాటరీని బట్టి మారుతుంది. 59kWh బ్యాటరీకి గరిష్ఠంగా 120kW DC ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 70kWh బ్యాటరీ 160kW వరకు, 79kWh బ్యాటరీ 180kW వరకు DC ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి మూడు బ్యాటరీలకు దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది.

BaaS
BE 6 Sporteqలో అంటే బ్యాటరీని అద్దెకు తీసుకునే విధానం (BaaS) కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఎంపికతో.. One వేరియంట్‌ ధర రూ.11.45 లక్షలకు, Two వేరియంట్‌ ధర రూ.12.95 లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రతి కిలోమీటర్‌కు రూ.3.75 బ్యాటరీ అద్దె చెల్లించాలి.

ఫీచర్లు 
ఫీచర్ల విషయంలో.. బేస్‌ వేరియంట్‌ అయిన One కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, LED హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 12.3 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ Android Auto & Apple CarPlay వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

Two వేరియంట్‌లో, One వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు 16-స్పీకర్‌ Harman Kardon ఆడియో సిస్టమ్‌, Dolby Atmos, ప్యాసింజర్‌ స్క్రీన్‌, డిజిటల్‌ కీ, 540-డిగ్రీ కెమెరా, డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటివి అదనంగా వస్తాయి. 

Three వేరియంట్‌లో Two వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు నుంచి పానోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, పవర్‌డ్‌ డ్రైవర్‌ సీటు వంటివి కూడా యాడ్‌ అవుతాయి. Three+లో Level 2 ADAS, పవర్‌డ్‌ టెయిల్‌గేట్‌, యాంబియంట్‌ లైటింగ్‌, ఫ్రంట్‌ ఫాగ్‌ ల్యాంప్స్‌ వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి.

Four వేరియంట్‌లో 79kWh బ్యాటరీ ఉంటుంది. ఇందులో, పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, Level 2+ ADAS, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, ఆటో పార్క్‌ అసిస్ట్‌, క్యాబిన్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, Google Gemini ఇంటిగ్రేషన్‌, డ్యాష్‌క్యామ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు లభిస్తాయి.

ఏ వేరియంట్‌ బెస్ట్‌?
అందరికీ టాప్‌ వేరియంట్‌ అవసరం లేదు. ధర, ఫీచర్లు & బ్యాటరీ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటే Three వేరియంట్‌ బెస్ట్‌ వాల్యూ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. పానోరమిక్‌ రూఫ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పవర్‌డ్‌ డ్రైవర్‌ సీటు, ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. కాబట్టి, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి బ్యాలెన్స్‌ కోరుకునేవారికి BE 6 Sporteq Three వేరియంట్‌ మంచి ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget