అన్వేషించండి

రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

Alto K10 on EMI: ఒక కస్టమర్ సుమారు 50 వేల డౌన్ పేమెంట్ చేస్తే ఆల్టో కే10 కారు కోసం దాదాపు 4 లక్షల రూపాయల కార్ లోన్ తీసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ వడ్డీ రేటు, EMI సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తక్కువ డౌన్‌పేమెంట్, EMIలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

తక్కువ బడ్జెట్‌లో చిన్న, అందుబాటు ధరలో ఉండే కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే Maruti Suzuki Alto K10 మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఇప్పుడు ఈ కారులోనూ 6 ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. కాగా గతంలో ఫ్రంట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు మాత్రమే ఉండేవి. అందువల్ల తక్కువ ధర కారును కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ సేఫ్టీ ఫీచర్ చాలా ముఖ్యమైనది. 

Maruti Alto K10 ధర ఎంత?

హైదరాబాద్ మార్కెట్లో Maruti Alto K10 ఎక్స్-షోరూమ్ ధర 3.70 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో కార్ ఆన్-రోడ్ ధర సుమారు 4,58,448 లక్షల రూపాయలు ఉంటుంది. ఆన్-రోడ్ ధరలో ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. కనుక ఆన్ రోడ్ ధరలు రాష్ట్రాలు, సిటీ, ఇతర ఛార్జీల ఆధారంగా మారతాయి.

ఒక కస్టమర్ సుమారు రూ. 50 వేలు డౌన్ పేమెంట్ చేస్తే దాదాపు 4.08 లక్షల కార్ లోన్ తీసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలవ్యవధి ఆధారంగా ప్రతి నెల EMI నిర్ణయిస్తారు. 

3.74 లక్షల రూపాయల లోన్‌ను 9.8 శాతం వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కోసం తీసుకుంటే EMI నెలకు సుమారు 9 వేలుగా ఉంటుంది. ఈ లెక్కన 4 సంవత్సరాల్లో బ్యాంక్‌కు మొత్తం సుమారు 4.53 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. EMI బ్యాంక్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, లోన్ నిబంధనలు, డౌన్ పేమెంట్ ఆధారంగా మారవచ్చు. 

రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

Also Read: మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!

Maruti Alto K10లో లభించే ఫీచర్లు

Alto K10లో సేఫ్టీ విషయంలో అతిపెద్ద మార్పు చేశారు. కారులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులు ఇస్తున్నారు. దీని ద్వారా కారులో వెనుక సీట్లో కూర్చున్నా మీకు మరింత భద్రత లభిస్తుంది. అయితే, ఎయిర్‌బ్యాగులతో పాటు సీట్ బెల్ట్ ఉపయోగించాలి. ఈ అప్‌డేట్‌తో కార్ మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పు చేయలేదు.

Alto K10లో 998cc K10C పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 49 kW పవర్, 3,500 rpm వద్ద 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టో కే10 కారులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు. Alto K10ను కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే కాకుండా CNG ఆప్షన్‌తో  అందిస్తున్నారు. 27 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే, ఇంధన ఖర్చు తగ్గించాలనుకునే కస్టమర్లకు CNG వేరియంట్ ఉపయోగకరంగా ఉంటుంది.

Alto K10 కాంపాక్ట్ సైజు దీన్ని ముఖ్యంగా నగరాల్లో ఉపయోగించడాన్ని తేలిక చేస్తుంది. చిన్న కారు కావడంతో ట్రాఫిక్‌లో నడపడం, ఇరుకైన ప్రదేశాల్లో పార్క్ చేయడం సులభం.  తక్కువ ప్రారంభ ధర, చిన్న ఇంజిన్ కారణంగా మొదటి కారు కొనుగోలు చేయడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను ఇది ఆకర్షిస్తుంది. Alto K10ను కాంపాక్ట్ సిటీ కార్‌గా చెబుతున్నారు.  

Also Read: ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!

కొనుగోలు చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి 

50 వేల రూపాయల డౌన్ పేమెంట్ అనేది ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ కారు కొనుగోలు సమయంలో కేవలం డౌన్ పేమెంట్, EMI చూసి నిర్ణయం తీసుకోరాదు. మొత్తం ఆన్-రోడ్ ధర, లోన్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, మొత్తం చెల్లింపును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేర్వేరు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల వడ్డీ రేట్లను పోల్చిన తర్వాతే లోన్ తీసుకోవాలి.  

Maruti Alto K10 కారు 6 ఎయిర్‌బ్యాగుల అప్‌డేట్, తక్కువ డౌన్ పేమెంట్‌ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. 50 వేల రూపాయల డౌన్ పేమెంట్ తర్వాత సుమారు 9 వేలు, 10 వేలు రూపాయల EMI ప్రజలకు అందుబాటు ఆప్షన్ ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది. 

 

Frequently Asked Questions

మారుతి ఆల్టో K10 ఎవరికి సరైన ఎంపిక?

తక్కువ బడ్జెట్‌లో చిన్న, అందుబాటు ధరలో ఉండే కారు కొనాలనుకునే వారికి, ముఖ్యంగా నగరాల్లో ఉపయోగించడానికి, ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ప్రారంభ ధర, కాంపాక్ట్ సైజుతో ఇది మొదటిసారి కారు కొనేవారిని ఆకర్షిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Child Seat Mounts: ఫ్యామిలీ కార్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చే కార్ల లిస్ట్‌
కారు ప్రయాణంలో మీ పిల్లల భద్రతకు భరోసా.. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX ఉన్న కార్లు
EV Charger: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు ఎంత కెపాసిటీ ఛార్జర్ కావాలి? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లోనే EV ఛార్జర్... 3.3 kW, 7.2 kW, 11 kWలో మీ కారుకు ఏది సరిపోతుందో తెలుసుకోండి
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Embed widget