అన్వేషించండి

టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?

టాటా సియెర్రా & కియా సెల్టోస్‌ డీజిల్‌ ఆటోమేటిక్‌ పనితీరు ఎలా ఉంది? 0-100 కి.మీ. వేగం, రోలింగ్‌ యాక్సిలరేషన్‌, పవర్‌, టార్క్‌ & ధరల పూర్తి వివరాలు.

Tata Sierra vs Kia Seltos diesel AT: మిడ్‌సైజ్‌ SUVలలో డీజిల్‌ ఇంజిన్‌తో వస్తున్న మోడళ్లు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విభాగంలో టాటా సియెర్రా & కియా సెల్టోస్‌ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రెండింటికీ డీజిల్‌ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉంది. ఈ రెండు SUVల మైలేజీని గత కథనంలో పోల్చాం. ఇప్పుడు, యాక్సిలరేషన్‌లో ఏ కారు మెరుగ్గా ఉందో చూద్దాం.

టాటా సియెర్రాలో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 118hp పవర్‌ & 280Nm టార్క్‌ను ఇస్తుంది. కియా సెల్టోస్‌లో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 116hp పవర్‌ & 250Nm టార్క్‌ను అందిస్తుంది.

అంటే పవర్‌లో సియెర్రా 2hp ముందుంది & టార్క్‌లో ఏకంగా 30Nm ఎక్కువగా ఉంది. సియెర్రా డీజిల్‌ ఆటోమేటిక్‌ వెర్షన్‌, మాన్యువల్‌ వెర్షన్‌ కంటే 20Nm అధిక టార్క్‌ను అందిస్తుంది.

రెండు SUVలలోనూ 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉంది. రెండు కార్లలోనూ వేరియబుల్‌ జ్యామెట్రీ టర్బోచార్జర్‌ ఉంటుంది. ఇది టర్బో ల్యాగ్‌ను తగ్గించి పవర్‌ డెలివరీని మెరుగుపరుస్తుంది.

టైర్ల విషయంలో.. సియెర్రాకు 19 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. సెల్టోస్‌లో 18 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!

0-100 కి.మీ. వేగం

ఆగి ఉన్న స్థితి నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకునే టెస్ట్‌లో కియా సెల్టోస్‌ స్వల్ప ఆధిక్యం సాధించింది. సియెర్రా 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి 13.37 సెకన్లు తీసుకుంది. సెల్టోస్‌ మాత్రం 13.17 సెకన్లలోనే ఈ వేగాన్ని అందుకుంది.

20 కి.మీ. వేగాన్ని చేరడంలోనూ సెల్టోస్‌దే ఆధిక్యం. సెల్టోస్‌ 1.36 సెకన్లలో 20 కి.మీ. వేగాన్ని అందుకోగా, సియెర్రా 1.44 సెకన్లు తీసుకుంది.

40 కి.మీ. వేగం అందుకోవడనికి సెల్టోస్‌ 3.11 సెకన్ల సమయం తీసుకుంది. సియెర్రా 3.53 సెకన్లు తీసుకుంది. 60 కి.మీ. స్పీడ్‌ కోసం కూడ రెండు కార్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సెల్టోస్‌ 5.81 సెకన్లు, సియెర్రా 5.93 సెకన్లు తీసుకున్నాయి.

80 కి.మీ. వేగాన్ని సెల్టోస్‌ 9 సెకన్లలో చేరుకుంది. సియెర్రాకు 9.31 సెకన్లు పట్టింది. మొత్తంగా చూస్తే.. 0-100 కి.మీ. పరీక్షలో సెల్టోస్‌ 0.20 సెకన్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!

తక్కువ బరువే కారణమా?

పవర్‌ & టార్క్‌లో సియెర్రా స్పష్టంగా ముందున్నప్పటికీ, వేగంలో సెల్టోస్‌ ముందుండడనికి ప్రధాన కారణం దాని తక్కువ బరువుగా చెప్పవచ్చు. తక్కువ బరువు కారణంగా ఇంజిన్‌ తన శక్తిని మరింత సమర్థంగా ఉపయోగించగలుగుతుంది.

ఈ పరీక్ష సమయంలో ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌లో మారిన ఫలితం

కారు కదులుతున్న సమయంలో వేగాన్ని పెంచే పరీక్షలో రెండు SUVల ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. 20-80 కి.మీ. వేగం పరీక్షలో, మూడో గేర్‌లో కిక్‌డౌన్‌ ఉపయోగించగా సెల్టోస్‌ 7.72 సెకన్లలో పరీక్షను పూర్తి చేసింది. సియెర్రా 7.97 సెకన్లు తీసుకుంది. దీంతో సెల్టోస్‌ 0.25 సెకన్ల ఆధిక్యంలో నిలిచింది.

అయితే 40-100 కి.మీ. వేగం పరీక్షలో సియెర్రా తన సత్తా చూపించింది. నాలుగో గేర్‌లో కిక్‌డౌన్‌ ఉపయోగించినప్పుడు సియెర్రా కేవలం 9.42 సెకన్లలో పరీక్షను పూర్తి చేసింది. సెల్టోస్‌ 10.04 సెకన్లు తీసుకుంది. దీంతో సియెర్రా ఏకంగా 0.62 సెకన్ల ఆధిక్యం ప్రదర్శించింది.

దేని ధర ఎంత?

టాటా సియెర్రా ధరలు రూ.15.99 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉన్నాయి. కియా సెల్టోస్‌ ధరలు రూ.15.32 లక్షల నుంచి రూ.21.82 లక్షల వరకు ఉన్నాయి. ప్రారంభ ధర విషయంలో సెల్టోస్‌ రూ.67,000 తక్కువగా ఉండగా, టాప్‌ వేరియంట్‌ ధరలో సియెర్రా రూ.53,000 తక్కువగా ఉంది.

మొత్తంగా చూస్తే, 0-100 కి.మీ. వేగం పరీక్షలో కియా సెల్టోస్‌ స్వల్ప తేడాతో గెలిచింది. తక్కువ బరువు దీనికి ప్రధానంగా కలిసొచ్చింది. అయితే 40-100 కి.మీ. రోలింగ్‌ యాక్సిలరేషన్‌లో టాటా సియెర్రా తన అధిక పవర్‌ & టార్క్‌తో స్పష్టమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. కాబట్టి, డైలీ డ్రైవింగ్‌లో చురుకుదనం కోరుకునేవారికి సెల్టోస్‌, వేగంగా ఓవర్‌టేక్‌ చేయడంలో ఎక్కువ పవర్‌ కోరుకునేవాళ్లకు సియెర్రా మంచి ఆప్షన్లు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget