అన్వేషించండి

పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి

Ducati Monster V2 ధర, ఇంజిన్, ఫీచర్లు, సీటు ఎత్తు, బరువు, పాత Monster 937తో ఉన్న తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

Ducati Monster V2 Price And Features Telugu: డుకాటీ మాన్‌స్టర్‌కు ప్రీమియం నేకెడ్‌ బైక్‌ల విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు, ఈ కంపెనీ కొత్త Monster V2ను తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో భారీ మార్పులు ఉన్నాయి. కొత్త ఇంజిన్‌, కొత్త ఛాసిస్‌, మరింత ఆధునిక ఫీచర్లు యాడ్‌ అయ్యాయి. అదే సమయంలో, పాత మాన్‌స్టర్‌ బైక్‌లకు గుర్తుగా పెద్ద మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్‌ కూడా తిరిగి వచ్చింది.

కొత్త Monster V2 గురించి యూత్‌ తరచూ చర్చించుకునే 5 విషయాలు ఇవే..

1. Ducati Monster V2 ధర ఎంత?

భారత్‌లో Monster V2 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి Monster & Monster+. వీటిని మూడు రంగుల్లో కొనవచ్చు.

Ducati Red కలర్‌ Monster ధర రూ.13.99 లక్షలు. Iceberg White & Sport Livery రంగులు కావాలంటే ధర రూ.14.23 లక్షలు. Monster+లో అదనంగా హెడ్‌లైట్‌ కౌల్‌ & పిలియన్‌ సీట్‌ కవర్‌ లభిస్తాయి. దీని ధర Ducati Redలో రూ.14.34 లక్షలు. Iceberg White & Sport Livery కలర్స్‌ తీసుకుంటే రూ.14.45 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

2.  Ducati Monster V2లో ఎలాంటి ఇంజిన్‌ ఉంది?

Monster V2లో కొత్త 890cc లిక్విడ్‌ కూల్డ్‌ V2 ఇంజిన్‌ ఉంది. ఇది 9,000rpm వద్ద 111hp పవర్‌ & 7,250rpm వద్ద 91.1Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌ను Panigale V2, Streetfighter V2 & Multistrada V2 సిరీస్‌ల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో వేరియబుల్‌ వాల్వ్‌ టైమింగ్‌ టెక్నాలజీ ఉంది. గరిష్ఠ టార్క్‌లో 80 శాతం 4,000rpm నుంచి 9,000rpm మధ్య అందుబాటులో ఉంటుందని డుకాటీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి

3. ఏ ఫీచర్లు ఉన్నాయి?

Monster V2లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. పూర్తి LED లైటింగ్‌, ద్విముఖ క్విక్‌షిఫ్టర్‌, డైనమిక్‌ & సెల్ఫ్‌ క్యాన్సలింగ్‌ ఇండికేటర్లు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ విషయంలో కూడా బైక్‌ అడ్వాన్స్‌డ్‌గా ఉంది. రైడింగ్‌ మోడ్‌లు, పవర్‌ మోడ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌, వీలీ కంట్రోల్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌ & కార్నరింగ్‌ ABS‌ ఇందులో ఉన్నాయి.

క్రూయిజ్‌ కంట్రోల్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ & హీటెడ్‌ గ్రిప్స్‌ను అదనపు యాక్సెసరీలుగా ఎంచుకోవచ్చు.

4. సీటు ఎత్తు ఎంత? బరువు ఎంత?

Ducati Monster V2 సీటు ఎత్తు 815mm. సీటును ఇంకా సన్నగా డిజైన్‌ చేయడంతో, రైడర్‌ పాదాలను నేలపై ఉంచడం సులభమవుతుంది.

తక్కువ సీటు ఎత్తు కావాలనుకునేవారి కోసం 795mm 'లో సీటు' యాక్సెసరీగా లభిస్తుంది. సస్పెన్షన్‌ తగ్గించే కిట్‌తో 775mm సీట్‌ హైట్‌ను కూడా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.

ఇంధనం లేకుండా బైక్‌ బరువు 175 కిలోలు.

ఇది కూడా చదవండి: యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?

5. పాత Monster 937తో పోలిస్తే ఏం మారింది?

కొత్త Monster V2లో అత్యంత ముఖ్యమైన మార్పు ఇంజిన్‌. పాత 937cc ఇంజిన్‌ స్థానంలో కొత్త 890cc V2 ఇంజిన్‌ వచ్చింది. పవర్‌ మాత్రం 111hpగానే ఉంది. అయితే టార్క్‌ 2Nm తగ్గి 91.1Nmకు చేరింది. గరిష్ఠ టార్క్‌ కూడా పాత మోడల్‌తో పోలిస్తే 750rpm లేట్‌ అవుతుంది.

పాత అల్యూమినియం స్థానంలోకి కొత్త మోనోకాక్‌ ఛాసిస్‌ వచ్చింది, దీంతో బైక్‌ బరువు 4 కిలోలు తగ్గింది. డిజైన్‌ కూడా గణనీయంగా మారింది. పాత తరం Monster బైక్‌లను గుర్తు చేసే పెద్ద & మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్‌ తిరిగి వచ్చింది.

ఇక TFT డిస్‌ప్లే పరిమాణం 4.3 అంగుళాల నుంచి 5 అంగుళాలకు పెరిగింది. క్విక్‌షిఫ్టర్‌ను కూడా మరింత మెరుగుపరిచారు. మొత్తంగా చూస్తే కొత్త Monster V2లో పనితీరుతో పాటు డిజైన్‌ & టెక్నాలజీలోనూ గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget