మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
మహీంద్రా BE 6 Sporteqలో కొత్త 70kWh బ్యాటరీ, BaaS, మూడు స్క్రీన్లు, కొత్త రంగులు & AI ఫీచర్లు వచ్చాయి. 651 కి.మీ. రేంజ్‌తో ఈ SUV మరింత ఆకర్షణీయంగా మారింది.

Mahindra BE 6 Sporteq Price, Range And Features Telugu: 2026 మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. 2026 అప్‌డేట్‌తో ఈ కారు పేరు కూడా మారింది. కొత్తగా ‘స్పోర్టెక్’ అనే పేరును జోడించారు. ధరలు రూ.19.45 లక్షల నుంచి రూ.26.95 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ మోడల్‌కు కొత్త పేరు మాత్రమే కాదు.. బ్యాటరీ, డ్యాష్‌బోర్డ్, టెక్నాలజీ, రంగులు ఇలా చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి.
1. కొత్త 70kWh బ్యాటరీ
ఇప్పటివరకు 59kWh & 79kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న BE 6కు ఇప్పుడు కొత్తగా 70kWh బ్యాటరీ కూడా వచ్చింది. ఈ బ్యాటరీతో 651 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని ARAI పేర్కొంది. కారు వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 241hp శక్తిని, 360Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
7.2kW AC, 11.2kW AC & 160kW DC ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ అనుకూలంగా ఉంటుంది. 160kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని మహీంద్రా చెబుతోంది.
2. BaaSతో రూ.8 లక్షలు తక్కువ
BE 6లో తొలిసారిగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్, అంటే BaaS విధానాన్ని మహీంద్రా తీసుకొచ్చింది. ఇది 59kWh బ్యాటరీ ఉన్న One & Two వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారు కొనేవాళ్లు BaaS స్కీమ్‌ను ఎంచుకుంటే కారు ప్రారంభ ధర రూ.8 లక్షల వరకు తగ్గుతుంది. One వేరియంట్ ధర రూ.11.45 లక్షలు. Two వేరియంట్ ధర రూ.12.95 లక్షలు అవుతుంది. అయితే కిలోమీటర్‌కు రూ.3.75 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. నెలకు కనీసం రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్ EV!.. MG Hector Tomahawkపై భారీ అంచనాలు!
3. డ్యాష్‌బోర్డ్‌లో మూడు స్క్రీన్లు
2026 BE 6లో డ్యాష్‌బోర్డ్ డిజైన్ కూడా మారింది. డ్రైవర్ డిజిటల్ డిస్‌ప్లే & ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు ముందు ప్రయాణికుడి కోసం కొత్త 12.30 అంగుళాల స్క్రీన్ ఇచ్చారు. దీంతో కారులో మూడు స్క్రీన్లు కనిపిస్తాయి. పాత మోడల్‌లో ఉన్న హాలో తరహా డిజైన్‌ను తొలగించారు. దాని స్థానంలో సెంటర్ కన్సోల్‌లో రెండు కప్‌హోల్డర్లు ఇచ్చారు.
4. Formula E వెర్షన్‌లో మార్పులు
2026 Formula E Freedom ఎడిషన్ డిజైన్ కూడా మారింది. పాత మోడల్‌కు భిన్నంగా కొత్త వెర్షన్ సాధారణ బీఈ 6 స్పోర్టెక్ డిజైన్‌నే కలిగి ఉంటుంది. Formula E బ్యాడ్జ్‌లు & FIA డీకాల్స్ ప్రత్యేకతగా నిలుస్తాయి. ఈ వెర్షన్‌లో మూడు & నాలుగు ట్రిమ్‌లు ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.24.45 లక్షలు & రూ.26.95 లక్షలు.
5. కొత్త రంగులు
కొత్త BE 6 స్పోర్టెక్‌కు Ruby Red అనే కొత్త ఎక్స్‌టీరియర్ రంగును అందించారు. Racing Tan & Black అనే కొత్త ఇంటీరియర్ రంగులు కూడా వచ్చాయి. Sporteq Launch Editionలో Graphite Storm ఎక్స్‌టీరియర్ & Racing Tan ఇంటీరియర్ లభిస్తాయి. Formula E Freedom ఎడిషన్‌కు Rosso Impulso అనే కొత్త ఎక్స్‌టీరియర్ రంగు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
6. Gemini AIతో కొత్త TEQ సూట్
BE 6లో కొత్త TEQ సూట్ కూడా వచ్చింది. ఇందులో Gemini ఆధారిత AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. వాయిస్ ద్వారా కారు నియంత్రణ, నావిగేషన్ & మ్యూజిక్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు.
అంతేకాదు, Karaoke, Dolby Vision & Dolby Audio వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Custom Drive Mode, Drift Mode వంటి కొత్త డ్రైవింగ్ ఆప్షన్లు వచ్చాయి. Formula E Freedom ఎడిషన్‌లో యాక్సిలరేషన్ బూస్ట్ మోడ్ కూడా ఉంది. దీంతో 0-100 కి.మీ. వేగాన్ని 6.44 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత కూడా అదనపు రేంజ్ అందించే Revive & Revive SOS ఫీచర్లు ఉన్నాయి. మీకు నచ్చిన సందేశాన్ని కారు Tailgateపై చూపించే TEQ_xting ఫీచర్ కూడా కొత్తగా యాడ్ అయింది.
మొత్తంగా చూస్తే... కొత్త బ్యాటరీ, BaaS విధానం, మూడు స్క్రీన్లు, కొత్త AI ఫీచర్లు & తాజా రంగులతో 2026 మహీంద్రా BE 6 స్పోర్టెక్ మరింత టెక్నాలజీని తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ SUVగా మారింది. ఇది Hyundai Creta Electric, Tata Sierra EV, Tata Curvv EV, MG ZS EV, Maruti Suzuki e Vitara, Toyota Ebella తో పోటీ పడుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















