అన్వేషించండి

Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!

Electric Cars Under 50k Downpayment: ఇప్పుడు కారు కొనడం పెద్ద కష్టం కాదు. చేతిలో 50వేల నగదు, నెలకు 10వేలు చెల్లించే కెపాసిటీ ఉంటే చాలు మీ ఇంటి ముందు కారు ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెలసరి ₹10వేల ఈఎంఐతో కారు సొంతం చేసుకోవడం సులభం.
  • ₹50వేల డౌన్ పేమెంట్‌తో పలు ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఎంజీ కామెట్, టాటా టియాగో, పంచ్ ఈవీలు చౌకైన ఎంపికలు.
  • పెట్రోల్ కార్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

Electric Cars Under 50k Downpayment: సొంతంగా ఒక ఫోర్ వీలర్ కొనుగోలు చేయాలనేది చాలా మంది కల. దీని కోసం లక్షల రూపాయలు చేతిలో ఉండాలి, బ్యాంకు బ్యాలెన్స్‌ కూడా అదే స్థాయిలో ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ మీకు నెలకు 10వేల రూపాయలు ఈఎంఐ చెల్లించే సంపాదన ఉంటే చాలు కారు మీ సొంతం అవుతుంది. మరోవైపు పెట్రోల్ భారం లేకుండా తక్కువ నిర్వహణ ఖర్చు కలిగిన ఈవీలనే సొంతం చేసుకోవచ్చు. 

చాలా మందిలో ఎలక్ట్రిక్ కారు అంటే 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందనే అపోహ ఉంది. కానీ ప్రస్తుతం మన దేశంలో కేలవ 50వే డౌన్‌పేమెంట్‌తో నెల నెలా 10వే EMI చెల్లిస్తూ సొంతం చేసుకోగలిగే బెస్ట్‌ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి.

ఎంజీ కామెట్‌ ఈవీ

భారత మార్కెట్‌లో లభించే అత్యంత కాంపాక్ట్‌, సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్‌ ఈవీ గుర్తింపు పొందింది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు పనుల కోసం సిటీ ట్రాఫిక్‌లో తిరిగే ఐటీ ఉద్యోగులకు, చిన్న కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక. 

ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు 6.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌ చెల్లించి, 9.5 శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు సుమారు 9500 నుంచి 10200 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. 

ఇందులో 17.3kwh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే కంపెనీ చెప్పిన ప్రకారం 230 కిలోమీటర్ల రేంజ్‌ లభిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. కిలోమీటర్‌కు కేవలం 80 పైసల నుంచి రూపాయి మాత్రమే. పెట్రోల్ కారుతో పోలిస్తే దాదాపు పదో వంతు ఖర్చు. 

టాటా టియాగో ఈవీ 

మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన బ్రాండ్‌ టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన ఎంట్రీ- లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ టాటా టియాగో ఈవీ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. 

దీని బేస్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్‌ ధర సుమారు 7.99 లక్షలు. వివిధ బ్యాంకులు అందించే 90 శాతం నుంచి 95శాతం ఆన్‌రోడ్ ఫైనాన్షియల్‌ స్కీమ్స్‌ ద్వారా, మీరు 50 వేల నుంచి 70వేల వరకు ప్రారంభ డౌన్‌పేమెంట్‌  చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని 7 ఏళ్ల వ్యవధికి లోన్‌గా తీసుకుంటే నెలకు 10500 నుంచి 11200 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. 

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 19.2kwh బ్యాటరీ 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 24kwh లాంగ్‌ రేంజ్‌ బ్యాటరీ 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ముఖ్యంగా దీనికి 4-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్‌ సేఫ్టీ రేటింగ్‌ ఉంది. 

టాటా పంచ్‌ ఈవీ 

మీరు హ్యాచ్‌ బ్యాక్‌ కాకుండా కొంచెం పవర్‌ఫుల్‌ ఎస్‌యూవీ లుక్ ఉన్న కారు కోరుకుంటే టాటా పంచ్‌ ఈవీ సరైన ఎంపిక. కొత్త తరం acti.ev ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారు అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. 

దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర 9.99 లక్షలు. పండుగ ఆఫర్స్, పాత కారును ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా మీరు 50 వేల నుంచి 75వేల డౌన్‌పేమెంట్‌ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. 7 ఏళ్ల లోన్‌ తీసుకుంటే ఈఎంఐ 12, 500 నుంచి 13వేల వరకు ఉంటుంది కానీ ఎక్స్చేంజ్ బోనస్‌లతో దీనిని పదివేలకు తగ్గించుకోవచ్చు. 

పెట్రోల్‌ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారును వాడటం వల్ల నెలకు సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఇంధన ఖర్చుు ఆదా చేయవచ్చు. నెలకు వెయ్యి కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్‌ కారుకు ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈవీకి అయ్యే కరంట్ బిల్లు కేవలం వెయ్యి నుంచి 1200 మాత్రమే. ఈ ఆదా చేసే మొత్తాన్ని మీ ఈఎంఐకి మళ్లించడం ద్వారా, కేవలం మూడు వేల నుంచి నాలుగు వేల నికర వ్యయంతో మీరు కారును నడుపుకోవచ్చు.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకోవడానికి నెలవారీ EMI ఎంత చెల్లించాలి?

నెలకు సుమారు 10,000 రూపాయల EMI చెల్లించే సంపాదన ఉంటే ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా 50,000 రూపాయల డౌన్‌పేమెంట్‌ కూడా అవసరం.

ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి 15-20 లక్షలు ఖర్చు అవుతుందా?

చాలా మందిలో ఎలక్ట్రిక్ కార్లు 15-20 లక్షలు ఖర్చు అవుతుందనే అపోహ ఉంది. కానీ, 50,000 డౌన్‌పేమెంట్‌తో నెలకు 10వే EMIతో సొంతం చేసుకోగలిగే ఎంట్రీ-లెవల్ EVలు అందుబాటులో ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ నిర్వహణ ఖర్చు ఎంత?

ఎంజీ కామెట్ ఈవీ నిర్వహణ ఖర్చు కిలోమీటర్‌కు కేవలం 80 పైసల నుంచి రూపాయి మాత్రమే. ఇది పెట్రోల్ కారుతో పోలిస్తే దాదాపు పదో వంతు తక్కువ.

ఎలక్ట్రిక్ కారు వాడటం వల్ల ఇంధన ఖర్చులో ఎంత ఆదా అవుతుంది?

పెట్రోల్ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారును వాడటం వల్ల నెలకు 6,000 నుండి 7,000 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆదా చేసిన మొత్తాన్ని మీ ఈఎంఐకి మళ్లించవచ్చు.

టాటా టియాగో ఈవీ ముఖ్య లక్షణాలు ఏమిటి?

టాటా టియాగో ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది 4-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్‌ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది, 250 కి.మీ. నుండి 315 కి.మీ. రేంజ్ అందిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget