అన్వేషించండి

Electric Vehicles: ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EVల ధర ఎందుకు పెరుగుతోంది

ప్రభుత్వ మద్దతు, సబ్సిడీ ఉన్నప్పటికీ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా మారుతున్నాయి. అధిక బ్యాటరీ వ్యయం, దిగుమతులు, సబ్సిడీల కోతకు సంబంధించిన పూర్తి కారణాలను తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వ సబ్సిడీ తగ్గింపు, బ్యాటరీ భద్రత వ్యయం పెరుగుదల.
  • బ్యాటరీ ధర, ముడిసరుకు దిగుమతులపై ఆధారపడటం అధికం.
  • మోడ్రన్ సాఫ్ట్‌వేర్, ఇతర దాగి ఉన్న ఖర్చులు అధికం.

రోజురోజుకూ రోడ్లపై పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రోత్సహిస్తోంది. పన్ను మినహాయింపులు, పలు రకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నా వినియోగదారులు షోరూమ్‌కు వెళ్లి ఈవీల ధరలు చూసి షాక్‌ అవుతున్నారు. సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ సబ్సిడీల తగ్గింపు, బ్యాటరీల ఉత్పత్తి వ్యయం,  మోడ్రన్ టెక్నాలజీ వ్యయాలే కారణమని ఆటో నిపుణులు చెబుతున్నారు.

ఫేమ్ సబ్సిడీ తగ్గిస్తున్న ప్రభుత్వం

ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అధికంగా ఉండటానికి మొదటి కారణం ప్రభుత్వం మొదట్లో ఇచ్చే 'ఫేమ్' (FAME) పథకం సబ్సిడీలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. సబ్సిడీలు తగ్గడంతో వాహన తయారీ కంపెనీలు ఆ భారాన్ని నేరుగా వినియోగదారులపైనే వేస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఈవీలలో ప్రమాదాలను అరికట్టడానికి బ్యాటరీ భద్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అత్యంత కఠినతరం చేసింది. ఈ కొత్త సేఫ్టీ నిబంధనలను పాటించడానికి బ్యాటరీ తయారీ వ్యయం మరింత పెరిగింది.

భారంగా మారుతున్న ఈవీ బ్యాటరీల ధర

రెండవ విషయం అత్యంత ముఖ్యమైనది బ్యాటరీల ధర. ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో దాదాపు 40 శాతం వాటా ఒక్క బ్యాటరీదే ఉంటుందనితెలిసిందే. మన దేశంలో వాహనాల అసెంబ్లింగ్ జరుగుతున్నప్పటికీ, బ్యాటరీ తయారీకి కావలసిన లిథియం- అయాన్ సెల్స్, లిథియం, కోబాల్ట్ వంటి ముడి సరుకులను భారత్ ఇప్పటికీ చైనా, ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవి రేట్లు పెరగడం, దిగుమతి సుంకాల ప్రభావంతో బ్యాటరీల ధరలు తగ్గడం లేదు. భారత్‌లోనే పెద్ద ఎత్తున ఈ సెల్స్ ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఇవి సామాన్యుడికి అందుబాటు బడ్జెట్‌లోకి రావడం కష్టమ అని చెప్పవచ్చు.

Also Read: 2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు

వీటికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలలో వినియోగించే మోడ్రన్ సాఫ్ట్‌వేర్, సెన్సార్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) ఖర్చులు కూడా వాహనం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కేవలం వాహనం కొనడమే కాకుండా, ఇంట్లో ఫాస్ట్ ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేకపోవడం, 3-ఫేజ్ కరెంట్ కనెక్షన్ తీసుకోవడం, అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి అదనపు లేదా దాగి ఉన్న ఖర్చులు కూడా ఈవీ కొనాలనుకున్న కస్టమర్లపై అదనపు భారంగా మారుతున్నాయి. ఇవన్నీ కలిపి ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే చాలా ఖరీదైనవిగా మారుస్తున్నాయి.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రభుత్వ సబ్సిడీల తగ్గింపు, బ్యాటరీల అధిక ఉత్పత్తి వ్యయం, ఆధునిక సాంకేతిక ఖర్చులు, అలాగే బ్యాటరీ తయారీకి ముడిసరుకుల దిగుమతులపై ఆధారపడటం వల్ల EVల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీల ధర ఎంత ఉంటుంది?

ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో దాదాపు 40 శాతం ఒక్క బ్యాటరీదే ఉంటుంది. లిథియం-అయాన్ సెల్స్ వంటి ముడిసరుకులకు విదేశాలపై ఆధారపడటం వల్ల వాటి ధర తగ్గడం లేదు.

EV కొనుగోలుతో పాటు అదనపు ఖర్చులు ఏమైనా ఉంటాయా?

EV కొనుగోలుతో పాటు ఫాస్ట్ ఛార్జర్ ఏర్పాటు, 3-ఫేజ్ కరెంటు కనెక్షన్, అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి అదనపు ఖర్చులు కస్టమర్‌లపై భారం మోపుతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget