హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్-రోడ్ రేటు ఎంత? నెలకు ఎంత ఈఎంఐ కట్టాలి?

Published by: Khagesh

హైదరాబాద్‌లో టాటా పంచ్‌ బేస్ మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర దాదాపు 6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

తెలంగాణ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌, ఫాస్టాగ్‌, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి బేస్ మోడల్‌ ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌లో సుమారు 7.30 లక్షల నుంచి 7.50 లక్షల వరకు ఉంటుంది.

హైదరాబాద్‌లో టాటా పంచ్ కొనాలి అంటే 75వేల నుంచి లక్ష రూపాయల వరకు డౌన్‌పేమెంట్ చేయాలి.

లక్ష డౌన్‌పేమెంట్ చేస్తే మిగిలిన 6.30 లక్షలు లోన్ ద్వారా తీసుకోవచ్చు

బ్యాంకులు ప్రస్తుతం 8.5 శాతం నుంచి 9.5 శాతం వార్షిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి.

ఐదేళ్ల టెన్యూర్‌కు 9 శాతం వడ్డీతో 6.30 లక్షలు లోన్ రూపంలో తీసుకుంటే నెలకు 13, 500 EMI చెల్లించాలి.

7 ఏళ్ల టెన్యూర్‌కు 9 శాతం వడ్డీతో 6.30 లక్షలు లోన్ రూపంలో తీసుకుంటే నెలకు 10, 600 EMI చెల్లించాలి.

మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే మీకు వడ్డీ రేటు తక్కువ పడుతుంది.

హైదరాబాద్‌లో అధికారిక షోరూమ్‌లు ఆఫర్స్‌ కూడా ఇస్తాయి. దీంతో ఆన్‌రోడ్డు ధర, EMI భారం తగ్గుతుంది.