వర్షాకాలంలో హెల్మెట్ కంపు కొట్టకుండా ఈ టిప్స్ పాటించండి!

Published by: Khagesh

వర్షాకాలంలో హెల్మెట్‌లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతాయి.

హెల్మెట్ లోపల ప్యాడ్‌లు, లైనర్‌ శుభ్రపరచాలి, లేకుంటే చర్మ, జుట్టు సమస్యలు వస్తాయి.

తీయగల లైనర్ ఉంటే గోరువెచ్చని నీరు, సబ్బు లేదా షాంపూతో కడగాలి, ఆరిన తర్వాత ఫిట్ చేయండి.

లైనర్ రాకపోతే, తేలికపాటి సబ్బు నీటిలో ముంచిన మైక్రోఫైబర్ వస్త్రంతో శుభ్రం చేయండి.

పొడి వస్త్రంతో తుడిచి, హెల్మెట్‌ను గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉంచండి.

హెల్మెట్ వర్షంలో తడిస్తే ఆరబెట్టి భద్రపరచండి.

హెల్మెట్ లోపల హెల్మెట్ శానిటైజర్ స్ప్రే చేయవచ్చు. యాంటీ బాక్టీరియల్ స్ప్రేను ఉపయోగించవచ్చు.

ఘాటైన పెర్ఫ్యూమ్‌లు లేదా డియోడరెంట్‌లను హెల్మెట్ లోపల స్ప్రే చేయవద్దు

హెల్మెట్ ధరించే ముందు తల, జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

తడి జుట్టు, చెమటతో హెల్మెట్ ధరించాల్సి వస్తే కాటన్ హెల్మెట్ క్యాప్ ధరించండి

హెల్మెట్‌ను వారానికి ఒకసారి శుభ్రం చేయండి. లోపలి ప్యాడ్‌ల చెక్‌ చేయండి.