అన్వేషించండి

Pending Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు! లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవడం ఎలా?

Traffic Fine Settlement: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో ఎలా సెటిల్ చేయాలి? అర్హతలు, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, అవసరమైన పత్రాలు, విచారణ ప్రక్రియ వివరాలు తెలుసుకోండి.

Traffic Challans At Lok Adalat: వాహనంపై ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంటే దానిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. జరిమానా చెల్లించకుండా వదిలేస్తే అది వాహనం రికార్డులో అలాగే ఉండిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పెండింగ్ చలాన్లను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ (Lok Adalat) ఒక మార్గాన్ని అందిస్తుంది.

దేశవ్యాప్తంగా వివిధ సమయాల్లో నిర్వహించే లోక్ అదాలత్‌లలో అర్హత ఉన్న ట్రాఫిక్ చలాన్లను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. అయితే ప్రతి చలాన్‌కు ఈ అవకాశం ఉండదు. రాష్ట్రాన్ని బట్టి అర్హతలు, పరిమితులు, తేదీలు మారుతుంటాయి. లోక్ అదాలత్‌లో చలాన్‌ను ఎలా సెటిల్ చేయాలి? ఆన్‌లైన్‌లో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? అక్కడ ఏం జరుగుతుంది? తెలుసుకుందాం.

లోక్ అదాలత్ ఎలా పనిచేస్తుంది?

లోక్ అదాలత్‌లకు Legal Services Authorities Act, 1987 ప్రకారం చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు, ఇంకా కోర్టుకు వెళ్లని వివాదాలను కూడా ఇవి పరిష్కరించగలవు.

లోక్ అదాలత్ సభ్యులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చేలా ప్రయత్నిస్తారు. అయితే ఎవరినీ బలవంతంగా రాజీకి ఒప్పించే అధికారం వారికి ఉండదు.

లోక్ అదాలత్‌లో దాఖలు చేసే కేసులకు కోర్టు ఫీజు ఉండదు. కోర్టు నుంచి లోక్ అదాలత్‌కు పంపిన కేసు పరిష్కారమైతే, అంతకుముందు చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చు.

లోక్ అదాలత్‌లో అంగీకారం కుదిరి అవార్డు జారీ అయితే, దానికి సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన హోదా ఉంటుంది. ఇరు పక్షాలకూ అదే తుది నిర్ణయం. దానిపై మరే కోర్టులోనూ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి, ట్రాఫిక్ చలాన్ విషయంలోనూ సెటిల్‌మెంట్ పూర్తయిన తర్వాత ఆ వ్యవహారం అక్కడితో ముగిసినట్లే.

లోక్‌ అదాలత్‌ తేదీ

జాతీయ లోక్‌ అదాలత్‌లను దేశవ్యాప్తంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. 12 డిసెంబర్ 2026న తదుపరి లోక్‌ అదాలత్‌ జరుగుతుంది.

ట్రాఫిక్ చలాన్ల కోసం రాష్ట్రాలు ప్రత్యేకంగా ఇతర తేదీల్లోనూ లోక్ అదాలత్‌లను నిర్వహించవచ్చు. కాబట్టి మీ రాష్ట్ర Legal Services Authority లేదా ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో తేదీలను చూడవచ్చు.

ఇది కూడా చదవండి: J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?

ఏ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో సెటిల్ చేయవచ్చు?

జరిమానా చెల్లించడం ద్వారా పరిష్కరించగలిగే, విచారణ అవసరం లేని నేరాలనే లోక్ అదాలత్‌లు స్వీకరిస్తాయి. రాజీ చేసుకునే వీలు లేని నేరాలపై లోక్ అదాలత్‌కు అధికార పరిధి ఉండదు. ఉదాహరణకు.. మద్యం సేవించి వాహనం నడపడం (సెక్షన్ 185), ప్రమాదం జరిగిన తర్వాత ఆగకపోవడం లేదా సమాచారం ఇవ్వకపోవడం (సెక్షన్ 187) వంటి నేరాలు ఈ జాబితాలో లేవు. అందువల్ల ఇలాంటి చలాన్లను లోక్ అదాలత్‌లో సెటిల్ చేయలేరు.

కొన్ని రాష్ట్రాలు, ఒక లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే చలాన్ల సంఖ్యపైన & చలాన్ల జరిమానా మొత్తంపైన పరిమితి విధిస్తాయి.

ఆన్‌లైన్‌లో లోక్ అదాలత్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి?

ముందుగా, మీ వాహనంపై ఎన్ని చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవాలి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన Parivahan పోర్టల్‌లో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, చలాన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఉపయోగించి వీటిని తనిఖీ చేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో లోక్ అదాలత్‌కు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకునే అవకాశం ఉంది.

1. రాష్ట్ర ట్రాఫిక్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌లో లోక్‌ అదాలత్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి.
2. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
3. స్క్రీన్‌పై కనిపించే Captcha కోడ్‌ను ఎంటర్ చేయాలి.
4. వాహనానికి రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి ధ్రువీకరించాలి.
5. మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే, హోమ్‌పేజీలోని ‘Update Vehicle Owner Mobile Number’ ఆప్షన్ ద్వారా ముందుగా అప్‌డేట్ చేయాలి.
6. OTP వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పెండింగ్ చలాన్లు, నోటీసులు కనిపిస్తాయి.
7. సెటిల్ చేయాలనుకునే చలాన్లు, నోటీసులను ఎంపిక చేసుకోవాలి.
8. అందుబాటులో ఉన్న కోర్టు కాంప్లెక్స్‌లలో మీకు దగ్గరగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి.
9. ఉదయం లేదా మధ్యాహ్నం స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి.
10. Virtual Court పోర్టల్ (vcourts.gov.in)లో చలాన్‌ను వ్యతిరేకించబోమని తెలిపే అంగీకార పత్రాన్ని చదివి అంగీకరించాలి.
11. చివరగా ‘Submit’పై క్లిక్ చేయాలి.

అపాయింట్‌మెంట్ వివరాలు, ఎంపిక చేసిన చలాన్లు లేదా నోటీసుల ప్రింట్‌అవుట్ తీసుకోవాలి. కోర్టుల సామర్థ్యం, అందుబాటులో ఉన్న స్లాట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అందువల్ల వీలైనంత ముందుగానే బుక్‌ చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: 349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?

లోక్ అదాలత్ రోజున ఏం జరుగుతుంది?

ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత, ఆ తేదీన లోక్ అదాలత్‌ నిర్వహించే కోర్టు కాంప్లెక్స్‌కు నేరుగా వెళ్లాలి. అపాయింట్‌మెంట్ వివరాలతో పాటు చలాన్లు, నోటీసుల ప్రింట్‌అవుట్‌లను వెంట తీసుకెళ్లాలి. విచారణ సమయంలో వాటిని సమర్పించాలి.

లోక్ అదాలత్‌లో మీ చలాన్‌ను పరిశీలించి, ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఎంత మొత్తం చెల్లించాలనేది విచారణ సమయంలో నిర్ణయిస్తారు. అసలు జరిమానా కంటే తక్కువ మొత్తానికే సెటిల్ అవుతుందని ఎలాంటి హామీ లేదు. అంగీకారం కుదిరి చెల్లింపు పూర్తయిన తర్వాత చలాన్ క్లోజ్ అవుతుంది.

లోక్ అదాలత్‌కు వెళ్లకపోతే ఏం చేయాలి?

మీకు కేటాయించిన తేదీన లోక్ అదాలత్‌కు హాజరు కాకపోతే, తదుపరి లోక్ అదాలత్ కోసం మళ్లీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. తదుపరి లోక్ అదాలత్ వరకు వేచి ఉండకూడదనుకుంటే, వర్చువల్‌ కోర్ట్‌ పోర్టల్ (vcourts.gov.in) ద్వారా కూడా చలాన్‌పై చర్య తీసుకోవచ్చు. అక్కడ మొబైల్ నంబర్, వాహన నంబర్ లేదా కేసు నంబర్ ఉపయోగించి మీ చలాన్‌ను వెతకవచ్చు.

ఆ పోర్టల్‌లో.. చలాన్‌ను అంగీకరించడం లేదా వ్యతిరేకించడం వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. చలాన్‌ను వ్యతిరేకిస్తే, అది డిజిటల్ ట్రాఫిక్ కోర్టుకు వెళుతుంది. అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుంది. కోర్టు జరిమానా విధించిన తర్వాత eCourts చెల్లింపు పోర్టల్ (pay.ecourts.gov.in) ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాలి.

ఇది కూడా చదవండి: కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!

గుర్తుంచుకోవాల్సిన విషయం

లోక్ అదాలత్‌లో అన్ని ట్రాఫిక్ చలాన్లనూ పరిష్కరించుకునే అవకాశం ఉండదు. అర్హత, చలాన్ల సంఖ్య, జరిమానా పరిమితి, తేదీలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఒకసారి సెటిల్‌మెంట్‌కు అంగీకరించి అవార్డు జారీ అయితే ఇక దానిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!
కారు చిన్నదైనా ధర మాత్రం రూ.53.9 లక్షలు! మినీ కూపర్ SEలో అంత స్పెషల్ ఏముంది?
ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్‌ లాంచ్‌, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బిగ్‌ బైక్‌' హిమాలయన్ 750 లాంచ్.. ధర రూ.4.89 లక్షల నుంచి ప్రారంభం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
J-Series ఇంజిన్‌తో Royal Enfield Classic 350 హైవేపై, సిటీలో నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా?
E20 పెట్రోల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ Classic 350 నిజమైన మైలేజ్‌ ఇదే.. ఆన్‌రోడ్‌ ధర ఎంతంటే?
Amadalavalasa Elections: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Embed widget