అన్వేషించండి

Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?

2026 Maruti Brezzaలో కొత్తగా 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అందుబాటులోకి వచ్చింది. టర్బో & NA పెట్రోల్‌ వేరియంట్ల మధ్య డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ పరంగా ఉన్న తేడాలు తెలుసుకోండి.

2026 Maruti Brezza Price And Features: మారుతి సుజుకీ, Brezza 2026 మోడల్‌లో కొత్త ఆప్షన్‌ అందించింది. ఇప్పటివరకు 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ (NA) పెట్రోల్‌ & CNG ఇంజిన్లతో మాత్రమే అందుబాటులో ఉన్న Brezzaలో ఇప్పుడు 1.0 లీటర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో, మరింత పవర్‌ పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారికి కొత్త ప్రత్యామ్నాయం లభించింది. అయితే టర్బో పెట్రోల్‌ & సాధారణ పెట్రోల్‌ వేరియంట్ల మధ్య ఇంజిన్‌ మాత్రమే కాదు, డిజైన్‌, ఫీచర్లు & సాంకేతిక అంశాల్లో కూడా పలు తేడాలు ఉన్నాయి.

డిజైన్‌ 
టర్బో వేరియంట్‌ను ప్రత్యేకంగా గుర్తించేలా Maruti కొన్ని మార్పులు చేసింది. ముందు గ్రిల్‌పై, ముందు & వెనుక బంపర్లలోని సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ పైన, వీల్‌ ఆర్చ్‌లు & డోర్‌ క్లాడింగ్‌పై ఎరుపు రంగు హైలైట్‌లను అందించింది. ఇవి స్పోర్టీ లుక్‌ను తీసుకొస్తాయి. వెనుక క్వార్టర్‌ గ్లాస్‌పై "Turbo Boosterjet" స్టికర్‌తో పాటు టెయిల్‌గేట్‌పై "Turbo" బ్యాడ్జ్‌ను కూడా ఇచ్చింది. వీటిని మినహాయిస్తే డ్యూయల్‌-పాడ్‌ హెడ్‌ల్యాంప్స్‌, LED DRLs, LED ఫాగ్‌ ల్యాంప్స్‌, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, సిల్వర్‌ రూఫ్‌ రైల్స్‌, LED టెయిల్‌ల్యాంప్స్‌ వంటి అంశాలు రెండు వేరియంట్లలో ఒకేలా ఉన్నాయి.

క్యాబిన్‌లో... టర్బో & NA పెట్రోల్‌ వేరియంట్ల మధ్య ఎలాంటి డిజైన్‌ తేడా కనిపించదు. రెండు మోడళ్లలోనూ బ్లాక్‌ & బ్రౌన్‌ రంగుల ఇంటీరియర్‌, మూడు స్పోక్‌ల స్టీరింగ్‌ వీల్‌, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో కలర్‌ MIDను అందించారు. MIDలో కనిపించే మెనూలు కూడా రెండింటిలో ఒకే విధంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: 2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు

ఫీచర్లు 
టాప్‌-ఎండ్‌ ZXi+ వేరియంట్‌లో టర్బో & NA పెట్రోల్‌ మోడళ్లకు ఒకే ఫీచర్లు లభిస్తాయి. అయితే LXi, VXi & ZXi వేరియంట్లలో టర్బో మోడల్‌కు కొన్ని అదనపు సదుపాయాలు ఉన్నాయి.

LXi టర్బో వేరియంట్‌లో రియర్‌ డిఫాగర్‌, ఎత్తు సర్దుబాటు చేసుకునే డ్రైవర్‌ సీటు, అడ్జస్టబుల్‌ రియర్‌ హెడ్‌రెస్ట్స్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ను అదనంగా అందించారు.

VXi టర్బో వేరియంట్‌లో రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, ఎలక్ట్రిక్‌గా మడతపెట్టుకునే ORVMలు, అల్లాయ్‌ వీల్స్‌, ప్రత్యేక Bluish Black బాడీ కలర్‌ ఎంపిక లభిస్తుంది.

ZXi టర్బో వేరియంట్‌లో రియర్‌ వైపర్‌ & వాషర్‌, రెండు ట్వీటర్లు, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, బ్లైండ్‌ స్పాట్‌ వార్నింగ్‌, సేఫ్‌ ఎగ్జిట్‌ వార్నింగ్‌, రియర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీంతో తక్కువ వేరియంట్లలోనే మరిన్ని సౌకర్యాలు పొందాలనుకునే వారికి టర్బో మోడల్‌ మంచి ఎంపికగా మారుతుంది.

ఇది కూడా చదవండి: సరికొత్త CB500ని ఆవిష్కరించిన హోండా - లోకల్‌గా తయారీ, మూడు వేరియంట్లలో అందుబాటులోకి!

ఇంజిన్‌
ఇంజిన్‌ పరంగా రెండు మోడళ్ల మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొత్త 1.0 లీటర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 110 హెచ్‌పీ శక్తి & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 103 హెచ్‌పీ శక్తి & 139 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అంటే టర్బో ఇంజిన్‌ ఎక్కువ శక్తి & గణనీయంగా అధిక టార్క్‌ను అందిస్తుంది.

అయితే టర్బో వేరియంట్‌కు ఒక పరిమితి కూడా ఉంది. ఇందులో కేవలం మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ మాత్రమే లభిస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికను Maruti 1.5 లీటర్‌ NA పెట్రోల్‌ ఇంజిన్‌కే పరిమితం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే 1.0 లీటర్‌ టర్బో ఇంజిన్‌ను Fronxలో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌తో కలిపి అందిస్తున్నప్పటికీ, Brezzaలో మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. అలాగే టర్బో ఇంజిన్‌కు CNG ఎంపిక కూడా లేదు.

మొత్తంగా చూస్తే... ఎక్కువ పనితీరు, స్పోర్టీ లుక్‌ & అదనపు ఫీచర్లు కావాలనుకునే వారికి Turbo Brezza మంచి ఎంపికగా నిలుస్తుంది. మరోవైపు ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ లేదా CNG ఎంపిక కోరుకునే వారు 1.5 లీటర్‌ NA పెట్రోల్‌ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారుల అవసరాలను బట్టి Maruti రెండు వేర్వేరు ఎంపికలను అందించడం ఈ కొత్త Brezza ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget