అన్వేషించండి

సరికొత్త CB500ని ఆవిష్కరించిన హోండా - లోకల్‌గా తయారీ, మూడు వేరియంట్లలో అందుబాటులోకి!

హోండా భారత్‌లో ఆల్‌-న్యూ CB500 బైక్‌ను ఆవిష్కరించింది. 501సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 43.3 ఎన్ఎం టార్క్‌, HSTC, RoadSync కనెక్టివిటీతో ఈ బైక్‌ త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది.

All-new Honda CB500 Details In Telugu: భారత మిడ్‌సైజ్‌ రెట్రో మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు హోండా సిద్ధమైంది. కంపెనీ తన ఆల్‌-న్యూ Honda CB500 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ఒకప్పుడు దేశంలో 500cc సింగిల్‌ సిలిండర్‌ బైక్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది. అయితే 2020లో Royal Enfield 500cc UCE ఇంజిన్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ విభాగంలో పెద్దగా ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడమే లక్ష్యంగా Honda CB500 రంగంలోకి దిగుతోంది.

501cc ఇంజిన్‌
ఈ కొత్త బైక్‌లో 501cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను హోండా తొలిసారిగా పరిచయం చేసింది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 27 హెచ్‌పీ శక్తి & 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ పరంగా సంఖ్యలు సాధారణంగానే కనిపించినా, టార్క్‌ మాత్రం ఈ బైక్‌కు ప్రధాన బలం. ఈ టార్క్‌ గణాంకం Royal Enfield Interceptor 650కు చాలా దగ్గరగా ఉండటం విశేషం. ఇంటర్‌సెప్టర్‌లో 648సీసీ ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ ద్వారా 47.4 హెచ్‌పీ శక్తి & 52.3 ఎన్ఎం టార్క్‌ లభిస్తుండగా, తక్కువ సామర్థ్యం ఉన్న సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తోనే Honda ఈ స్థాయి టార్క్‌ను అందించడం విశేషంగా చెప్పాలి. ఈ బైక్‌కు 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

డిజైన్‌ 
Honda CB350 నుంచి స్ఫూర్తి పొందిన క్లాసిక్‌ లుక్‌ను CB500లో అందించారు. గుండ్రటి LED హెడ్‌లైట్‌, రిబ్బ్డ్‌ సింగిల్‌ పీస్‌ సీటు, పెద్ద టియర్‌డ్రాప్‌ ఆకారంలోని ఇంధన ట్యాంక్‌ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రెట్రో స్టైలింగ్‌ను కొనసాగిస్తూ ఆధునిక సాంకేతికతను కూడా హోండా ఇందులో జోడించింది.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్

ఫీచర్లు
Honda Selectable Torque Control (HSTC), స్లిప్పర్‌ క్లచ్‌, అనలాగ్‌-డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, Honda RoadSync కనెక్టివిటీ వంటి ప్రీమియం సదుపాయాలు ఈ బైక్‌లో ఉన్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టివిటీతో పాటు మరింత సురక్షితమైన & సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని పొందవచ్చు.

హోండా ఇంకా పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్లు, రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. రోజువారీ వినియోగంతో పాటు లాంగ్‌ రైడ్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది

Honda CB500ను మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. స్టాండర్డ్‌ అల్లాయ్‌ వీల్‌ వేరియంట్‌తో పాటు క్రాస్‌-స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ వీల్‌ వేరియంట్‌, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో కూడిన టాప్‌-ఎండ్‌ క్రాస్‌-స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ వేరియంట్‌ను వినియోగదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విభిన్న అభిరుచులు ఉన్న రైడర్లను ఆకట్టుకోవాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.

అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే Honda CB500 మోడల్‌ను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా ధర కూడా పోటీ స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారిక ధరను ప్రకటించలేదు. అయితే మిడ్‌సైజ్‌ రెట్రో మోటార్‌సైకిల్‌ విభాగంలో Royal Enfield Interceptor 650 & BSA Gold Star 650లకు నేరుగా పోటీ ఇవ్వడమే కాకుండా, వాటి కంటే ఆకర్షణీయమైన ధరతో ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావచ్చని ఆటోమొబైల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లాసిక్‌ స్టైలింగ్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే యువతకు Honda CB500 మంచి ఎంపికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget