అన్వేషించండి

Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..

Honda ZR-V Review in Telugu: హోండా కంపెనీ భారత మార్కెట్లోకి ZR-V హైబ్రిడ్ SUVని తెస్తోంది. ఇది 181 BHP పవర్, 22.7 కి.మీ మైలేజ్‌తో ఆకట్టుకున్నా, అధిక ధర దీనికి పెద్ద ఇబ్బందిగా మారవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా ZR-V హైబ్రిడ్ SUV CBU మార్గంలో భారత్‌లోకి వస్తుంది.
  • 181 bhp శక్తివంతమైన ఇంజిన్ 22.7 కిమీ మైలేజ్ అందిస్తుంది.
  • స్పోర్టీ డ్రైవింగ్, ప్రీమియం ఫినిషింగ్ వాహనానికి ప్రత్యేక ఆకర్షణ.
  • అధిక ధర, కొన్ని ఫీచర్ల లోపం అమ్మకాలకు సవాలు.

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మార్కెట్ భారత్‌లోనూ చాలా పెద్దది. అయినప్పటికీ కంపెనీ సివిక్, సిఆర్-వి మోడల్స్ నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, హోండా మరోసారి ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. కంపెనీ భారత్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ SUV హోండా ZR-V ని CBU అంటే ఇంపోర్టెడ్ విధానం ద్వారా లిమిటెడ్ కార్లను ప్రవేశపెడుతోంది.

ట్రాక్‌పై టెస్టింగ్ సమయంలో మోండా జెడ్‌ఆర్ వీ (Honda ZR V) కార్ తన డ్రైవింగ్ డైనమిక్స్, ప్రీమియం ఫినిషింగ్, అద్భుతమైన మైలేజ్‌తో ఎంతో ఆకట్టుకుంది.  అయితే, ఇంపోర్టెడ్ మోడల్ కావడం వల్ల దీని ధర ఎక్కువగా ఉండనుంది. దాంతోపాటు కొన్ని ఫీచర్ల లోపం అమ్మకాల్లో దీనికి కొంత సవాలుగా మారవచ్చు. హోండా ఈ పవర్‌ఫుల్ కార్ ఫీచర్లు, విశేషాలు ఇక్కడ అందిస్తున్నాం.

181 BHP పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్

హోండా ZR-V లో 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి 181 bhp పవర్, 315 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కార్ పూర్తిగా EV మోడ్‌లో స్టార్ట్ అవ్వడం ప్లస్ పాయింట్. స్పీడ్ అందుకోగానే ఇంజిన్ ఎలాంటి జెర్క్ లేకుండా పవర్‌ను అందిస్తుంది. ఇది 22.7 కిలోమీటర్‌తో అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని హోండా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. రియల్ వరల్డ్ కండిషన్‌లో కారు 16 నుండి 18 కి.మీ  మైలేజ్ ఇస్తుందని గుర్తించారు. 

స్పోర్టీ డ్రైవింగ్, క్విక్ రెస్పాన్స్

హోండా ఈ కార్ డ్రైవింగ్ చేయడానికి కస్టమర్లు ఇష్టపడతారు. లో-స్లగ్ డ్రైవింగ్ పొజిషన్, సూపర్‌కార్ల లాంటి మెటల్ ప్యాడిల్ షిఫ్టర్లు దీని స్టీరింగ్ ను ప్రత్యేకంగా చేస్తాయి. eCVT గేర్‌బాక్స్ డ్రైవ్ చేసినప్పుడు చాలా స్మూత్, క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది. దీని స్టీరింగ్ వీల్ తేలికగా ఉన్నప్పటికీ మలుపుల వద్ద బెస్ట్ అనిపిస్తుంది. కారు సైజులో పెద్దదిగా ఉన్నప్పటికీ ఎక్కువ బరువు అనిపించదు. టర్నింగ్‌లలో కూడా దీని రోడ్ గ్రిప్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.

ఫీచర్లు, క్యాబిన్‌ మైనస్ అవుతాయా..

లుక్స్ పరంగా హోండా ZR-V ఫ్రంట్ చూస్తే ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ లభిస్తుంది.  ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ఫినిషింగ్ క్వాలిటీ చాలా రిచ్‌గా ఫీలవుతారు. దీని అతిపెద్ద బలహీనత దీని చిన్న, బేసిక్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ ఫీచర్లు ఇవ్వలేదు. బూట్ స్పేస్‌లో ఆటో- క్లోజ్ బటన్ వంటి కొన్ని ప్రాక్టికల్ ఫీచర్లు ఇచ్చారు. ఇవి లగేజ్ తీసేటప్పుడు హెల్ప్ అవుతాయి.

Also Read: హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?

సవాలుగా మారుతున్న దీని ధర

CBU మార్గం ద్వారా రావడం వల్ల ఈ SUV పై భారీ పన్నులు కస్టమర్లపై పడతాయి. దీని ఎక్స్-షోరూమ్ అంచనా ధర 40 లక్షల నుండి 45 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ ధరల వద్ద దీనికి స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి పెద్ద SUVలతో పోటీ తప్పదు. ఆ కార్లు హోండా కంటే ఎక్కువ ఫీచర్లు, 7 సీటర్ స్పేస్‌ను అందిస్తాయి. తన పవర్‌ఫుల్ లుక్స్, హోండా క్వాలిటీ, రికార్డు స్థాయి మైలేజ్ పై కొందరు కార్ లవర్స్‌ను తనవైపు తిప్పుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

Frequently Asked Questions

హోండా ZR-V భారతదేశంలో ఎలా ప్రవేశపెట్టబడుతోంది?

హోండా ZR-Vని CBU (పూర్తిగా నిర్మించిన యూనిట్) దిగుమతి విధానం ద్వారా పరిమిత సంఖ్యలో కార్లను భారతదేశంలోకి ప్రవేశపెట్టబడుతోంది. ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టును నిలుపుకోవడానికి ఇది ఒక ప్రయత్నం.

హోండా ZR-V ఇంజిన్ వివరాలు మరియు మైలేజ్ ఎంత?

హోండా ZR-V 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 181 bhp పవర్ మరియు 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ 22.7 కి.మీ మైలేజ్ క్లెయిమ్ చేయగా, నిజ ప్రపంచంలో 16-18 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

హోండా ZR-V అంచనా ధర ఎంత మరియు దాని ప్రధాన సవాళ్లు ఏమిటి?

CBU దిగుమతి కారణంగా హోండా ZR-V అంచనా ఎక్స్-షోరూమ్ ధర 40-45 లక్షల మధ్య ఉండవచ్చు. అధిక ధర మరియు కొన్ని ఫీచర్ల లోపం దాని అమ్మకాలకు సవాలుగా మారవచ్చు.

హోండా ZR-Vలో ఏయే ఫీచర్లు లేవు?

హోండా ZR-V చిన్న మరియు ప్రాథమిక టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు మరియు సన్‌రూఫ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు లేవు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget