అన్వేషించండి

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం

FCRA సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, TMC డిమాండ్ చేశాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వందేమాతరం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది.
  • జాతీయ గేయం అడ్డుకుంటే నేరం, చర్చలేదని శశిథరూర్ విమర్శించారు.
  • FCRA బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం.
  • విపక్షాలు, తమిళనాడు అసెంబ్లీ FCRA బిల్లు ఉపసంహరణకు డిమాండ్ చేశాయి.

వందేమాతరం బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నాడు వందేమాతరం సవరణ బిల్లుకు బిల్లుకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా నిరోధించడం నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణే దీనికి కూడా లభిస్తుందని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త చట్టంతో 'జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే (సవరణ)చట్టం 2026' చట్టంగా మారింది. లోక్‌సభ జూలై 30న ఈ బిల్లును ఆమోదించగా, దానికి ఒక రోజు ముందే రాజ్యసభ దీనికి ఆమోదం తెలిపిందని తెలిసిందే.

వందేమాతరం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. అదే సమయంలో తనకు జాతీయ గీతం (జనగణమన), జాతీయ గేయం (వందేమాతరం) లపై ఎంతో గౌరవం ఉందన్నారు. 'వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం పొందిన ఈ సవరణ ప్రకారం.. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రారంభంలో, ముగింపులో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించడం తప్పనిసరి' అని తెలిపారు.

చట్టం ద్వారా ఓపికను అమలు చేయవచ్చా? శశి థరూర్ కీలకవ్యాఖ్యలు

 'నేను ఈ రెండింటినీ ఎంతగానో గౌరవిస్తాను. నేను జాతీయ గేయం (వందేమాతరం) లోని మొదటి రెండు చరణాలు, పూర్తి జాతీయ గీతాన్ని (జన గణ మన) పాడగలను. కానీ కఠిన వైఖరి గల వ్యక్తులు బహుశా విస్మరించిన ఒక ఆచరణాత్మక అంశాన్ని - మానవ నైజాన్ని నేను ఎత్తిచూపాలనుకుంటున్నాను. 'జన గణ మన' సమయంలో వీక్షకులు గౌరవప్రదంగా నిలబడి పూర్తి 52 సెకన్ల పాటు దృష్టి సారించాలి. పూర్తి జాతీయ గేయం పాడటానికి 3 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. ఈ రెండింటి కంటే ముందు తమిళ భాషలో రాష్ట్ర గేయాన్ని కూడా పాడాలని తమిళనాడు ప్రభుత్వం  నిర్ణయించింది. దానికి మరో 2 నిమిషాలు పడుతుంది. ప్రతి కార్యక్రమానికి ముందు,  తరువాత వీక్షకులు 5 నిమిషాల పాటు, అంటే మొత్తంగా 12 నిమిషాలదనంగా గౌరవప్రదంగా నిలబడతారని నిజంగా ఆశించగలమా? చట్టం ద్వారా గౌరవాన్ని, ఓపికను అమలు చేయవచ్చా? ఈ బిల్లు లక్ష్యం జాతీయ గేయం పట్ల గౌరవాన్ని పెంచడమే అయినప్పటికీ, అది నెరవేరకపోగా, దానికి విరుద్ధంగా జరిగే అవకాశం ఉందని’ శశిథరూర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 

అంతకుముందు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేశాయి. FCRA బిల్లును క్రైస్తవ వర్గాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు నిరంతరం వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ FCRA బిల్లును వ్యతిరేకిస్తూ నేడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

న్యూస్ ఏజెన్సీ పిటిఐ (PTI) సమాచారం ప్రకారం, ఈ సవరణ వల్ల స్వచ్ఛంద సంస్థల స్వయంప్రతిపత్తిపై, ముఖ్యంగా మైనారిటీలు నిర్వహించే విద్యా, సామాజిక సంక్షేమ సంస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రానికి ఆ తీర్మానంలో విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం దీనిని మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు.

Frequently Asked Questions

వందేమాతరం సవరణ బిల్లుకు ఎవరు ఆమోదం తెలిపారు?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వందేమాతరం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇది ఇప్పుడు 'జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే (సవరణ)చట్టం 2026'గా మారింది.

వందేమాతరం సవరణ బిల్లు ప్రకారం ఏది నేరంగా పరిగణించబడుతుంది?

జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా నిరోధించడం నేరంగా పరిగణిస్తారు. దీనికి జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణ లభిస్తుంది.

వందేమాతరం బిల్లుపై శశి థరూర్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు?

సభలో చర్చ లేకుండా బిల్లు ఆమోదం పొందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో జాతీయ గీతం, జాతీయ గేయం తప్పనిసరిగా ఆలపించడంపై సమయం, ఆచరణాత్మక అంశాలను ప్రశ్నించారు.

FCRA సవరణ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?

కేంద్ర ప్రభుత్వం FCRA సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని నిర్ణయించింది. విపక్ష పార్టీలు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

FCRA బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు, క్రైస్తవ వర్గాలు FCRA బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget