యష్, 'కేజీఎఫ్ 2' మరియు 'టాక్సిక్' చిత్రాలను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేసిన ఏకైక కన్నడ హీరోగా నిలిచారు. ఇది ఆయన సృష్టించిన అరుదైన రికార్డు.
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Toxic Imax Release: కన్నడ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'ను ఐమ్యాక్స్ ఫార్మాటులో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీనితో ఆయన రేర్ రికార్డు క్రియేట్ చేశారు.

- యష్ 'టాక్సిక్' సినిమాతో ఐమాక్స్ రికార్డు సృష్టించారు.
- 'కేజీఎఫ్ 2' తర్వాత ఐమాక్స్‌లో విడుదలైన రెండో కన్నడ చిత్రం 'టాక్సిక్'.
- రెండు ఐమాక్స్ చిత్రాలు ఉన్న ఏకైక కన్నడ హీరో యష్.
- గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' ఆగస్టు 26న విడుదల.
Yash's Record With Kannada IMAX Releases: కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో కన్నడ సినిమా హిస్టరీలో రేర్ రికార్డు క్రియేట్ చేశారు యష్. అది ఏమిటంటే?
'కేజీఎఫ్ 2' తర్వాత 'టాక్సిక్'తో!
First Kannada Movie Released In IMAX Format: ఐమ్యాక్స్ ఫార్మాటులో విడుదల అయిన మొదటి కన్నడ సినిమా 'కేజీఎఫ్: చాఫ్టర్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్' భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌ను ఐమ్యాక్స్ ఫార్మాటులో విడుదల చేశారు. ఇప్పుడు 'టాక్సిక్'ను కూడా ఐమ్యాక్స్ ఫార్మాటులో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
రెండు సినిమాలను... అదీ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ ఐమ్యాక్స్ ఫార్మాటులో రిలీజ్ చేసిన ఏకైక కన్నడ హీరోగా యష్ సరికొత్త రికార్డు సృష్టించారు. అంతే కాదు... కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఐమ్యాక్స్ వెర్షన్‌లో విడుదల అవుతున్న రెండో సినిమాగా 'టాక్సిక్' నిలిచింది. ఐమ్యాక్స్, ఇతర ఫార్మాట్‌లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.
View this post on Instagram
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' తెరకెక్కింది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ, మాన్‌స్టర్ మైండ్స్ పతాకంపై యష్ ప్రొడ్యూస్ చేశారు. హీరో అక్క పాత్రలో నయనతార... హీరోయిన్లు కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తార సుతారియా కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్టు 26న భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. అమెరికాలో సుమారు 2,000 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయనున్నారని తెలిసింది.
Also Read: Kiran Abbavaram Family Photos - అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Frequently Asked Questions
యష్ 'టాక్సిక్' సినిమాతో ఏ రికార్డు సృష్టించాడు?
ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదలైన మొదటి కన్నడ సినిమా ఏది?
ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదలైన మొదటి కన్నడ సినిమా 'కేజీఎఫ్: చాప్టర్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
'టాక్సిక్' సినిమా దర్శకురాలు ఎవరు మరియు ఎప్పుడు విడుదల కానుంది?
'టాక్సిక్' చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
'టాక్సిక్' సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులు ఎవరు?
యష్ హీరోగా, నయనతార హీరో సోదరి పాత్రలో నటించగా, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తార సుతారియా వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
ట్రెండింగ్ వార్తలు






















