'కెజియఫ్ 2లో ఒక్కో డైలాగ్ థియేటర్లలో ఒక్కో బుల్లెట్‌లా పేలింది. ఆ డైలాగులను మీరూ చదవండి.

మెరిట్‌లో వచ్చిన వాడిని, రెస్పెక్ట్ ఇవ్వండి! - యశ్

ఒక్కటి గుర్తు పెట్టుకోండి... ఇక మీదట ఆ టెరిటరీ నాది, ఈ టెరిటరీ నీది అనేదంతా మాయే. The World Is My Territory - యశ్

రాకీ భాయ్: నేను సీఈవో!
ఫారినర్: ఏ కంపెనీకి?
రాకీ భాయ్: ఇండియాకి!

నాలాంటోడిని ఇంకొకడిని పుట్టించడం నా అబ్బ వల్లే కాలేదు... నా అబ్బ మీద ఒట్టు, ఇంకెవ్వడి వల్ల కాదు - యశ్

నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికి ప్రయత్నిస్తా. లేదంటే గెలిచి తీరతా! - రాకీ భాయ్

నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు. నాతో దుష్మనీ ఎవ్వడూ తట్టుకోలేడు - యశ్

ఇక్కడ తలలు శాశ్వతం కాదు, కిరీటాలు శాశ్వతం! - యశ్

చరిత్ర, పురాణాలు చెబుతున్నాయి... ఆడదానికి కోపం వస్తే చేయి చేసుకోకూడదు. చెయ్యి ఎత్తి దణ్ణం పెట్టాలి - యశ్

వయలెన్స్... వయలెన్స్... ఐ డోంట్ లైక్! ఐ అవాయిడ్! బట్, వయలెన్స్ లైక్స్ మి. ఐ కాంట్ అవాయిడ్!

నాలాంటి క్రిమినల్‌ని కొట్టాలంటే... సిస్టమ్ల్ నుంచి బయటకు వచ్చి కొట్టాలి - రాకీ భాయ్

నీళ్ళ నుంచి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. కానీ, ఇక్కడ ఓ తల్లి కన్నీటి నుంచి రాకీ అనే నిప్పు పుట్టింది.

అధీరా కొండల్ని వంచడం మానేశాడు. ఇప్పుడు కొండల్ని పిండి చేస్తున్నాడు - సంజయ్ దత్

కత్తి విరిసి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్దరించడానికి! - సంజయ్ దత్