రవ్వ హల్వా.. టేస్టీ, ఈజీ రెసిపీ

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

భారతదేశంలో పూజల సమయంలో చాలామంది హల్వా తయారు చేస్తారు.

Image Source: pexels

అయితే హల్వా చేయడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటారు.

Image Source: pixabay

అందుకే తక్కువ సమయంలో రవ్వ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం.

Image Source: pexels

1 కప్పు రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు నెయ్యిని తీసుకోవాలి.

బాణలిలో నెయ్యి వేసి రవ్వను బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. సూజీ వేయించేటప్పుడు అందులో ఒక స్పూన్ శనగపిండి కలపండి.

Image Source: pixabay

మరొక పాత్రలో రవ్వ పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కువ నీటిని వేసి వేడి చేయాలి. అందులో చక్కెర, యాలకుల పొడిని కలపాలి.

Image Source: pixabay

చక్కెర నీటిలో కరిగిన తరువాత.. ఈ వేడి సిరప్ రవ్వలో వేసి నెమ్మదిగా పోయాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.

Image Source: pexels

తక్కువ మంట మీద 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. రవ్వ పలుకుగా, మెత్తగా అయ్యేలా చేసుకోవాలి.

చివరగా వేయించిన జీడిపప్పు, బాదం, ఒక స్పూన్ నెయ్యి వేసి దించేయడమే. అంతే టేస్టీ హల్వా రెడీ.

Image Source: pexels